రంగారెడ్డి

రూ.20వేల కోట్లతో నగరం అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూన్ 4: మహానగరాన్ని ఇరవైవేల కోట్ల రూ.లతో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అంచనాలు తయారు చేస్తుందని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లిలోని ఖాజగూడ మెయిన్‌రోడ్డు నుంచి చిత్రపురి కాలనీవరకు రూ.20 లక్షలతో ఏర్పాటుచేసే సిసి రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. చిత్రపురి కాలనీ మణికొండ గ్రామ పంచాయతీలో వున్నప్పటికీ శేరిలింగంపల్లి నుంచి కాలనీకి వెళ్లాల్సి వుందని రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారని, మంత్రి కెటిఆర్‌కు విన్నవించగా జిహెచ్‌ఎంసి అధికారులతో సంప్రదించి రోడ్డుకి రూ.20 లక్షలు మంజూరు చేసారన్నారు. గ్రామ పంచాయతీ నుంచి కూడా నిధులతో లోపల రోడ్లను వేయనున్నట్లు వాటికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే గుర్తింపు పొందిన నగరంగా అభివృద్ధి చేయడానికి సిఎం కృషి చేస్తున్నారని అన్నారు. వందరోజుల పనులను అధికారులు సరిగా పట్టించుకోవడం లేదని విలేఖరులు ప్రశ్నించగా- అభివృద్ధి పనుల విషయంలో అలసత్వం అవలంబిస్తే సహించేది లేదని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో ప్రజలనుంచి వచ్చిన విన్నపాలను పనులను పూర్తి చేస్తామన్నారు. ఎక్కడ చిన్నపాటి ఇబ్బందులున్నా సమస్యలు పరిష్కారం కాకపోయినా స్థానిక శాసనసభ్యుడు, కార్పొరేటర్లు వున్నారని వారి దృష్టికి తీసుకురావాలని మహేందర్‌రెడ్డి సూచించారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, చిత్రపురి కాలనీలో అన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందన్నారు. 63 ఎకరాల్లో ఏర్పాటైన పెద్ద కాలనీ అని, సినీ కళాకారులు తమకు బస్ సౌకర్యం కల్పించాలని కోరిన వెంటనే ఆర్టీసి బస్ ఏర్పాటు చేసామని, రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తలసాని చెప్పారు. తెలంగాణను ఆదర్శంగా చేయడానికి సిఎం కృషి చేస్తున్నారని, సినీ కళాకారుల కోసం మరో 10 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యుడు గాంధీ, కార్పొరేటర్లు సాయిబాబు, నాగేందర్ యాదవ్, చిత్రపురికాలనీ అధ్యక్షుడు వెంకటేష్, కిరణ్, ఆర్‌డిఓ సురేష్ పాల్గొన్నారు.