రంగారెడ్డి

6న మెగా జాబ్‌మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 4: వికారాబాద్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణ/అంబేద్కర్ భవన్‌లలో ఈనెల 6న ఉదయం నిర్వహించే జాబ్‌మేళా, ఉపాధి శిక్షణ ఎంపికను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మండల అభివృద్ధి అధికారి ఎం.సత్తయ్య పిలుపునిచ్చారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో నియోజకవర్గ పరిధిలోని ఏడో తరగతి పాసై ఆపై చదువులు చదవిన నిరుద్యోగులు 11 కంపెనీలు భర్తీ చేసే 1550 ఉద్యోగాలకు ఎంపిక కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యుడు బి.సంజీవరావు హాజరవుతారని చెప్పారు. హైదరాబాద్ నవత ట్రాన్స్‌పోర్టులో పురుష అభ్యర్థుల కోసం 100 మార్కెటింగ్, డ్రైవర్ ఖాళీలున్నాయని, ఎస్‌ఎస్‌సి, ఇంటర్ ఆపై చదివినవారు అర్హులని వేతనం ఎనిమిది వేల రూపాయలున్నాయని చెప్పారు. శేఖర్ గ్లాస్ వర్క్స్‌లో హెల్పర్, మార్కెటింగ్, డ్రైవర్ ఖాళీలు 50 ఉన్నాయని, వయస్సు 18 నుండి 25 మధ్య ఉండాలని, వేతనం 8000 రూపాయల నుండి 15వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. జి4ఎస్ కంపెనీలో 500 సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలున్నాయని వయస్సు 19 నుండి 30 సంవత్సరాలుండి ఎస్‌ఎస్‌సి పాసై 5.8 ఎత్తు కలిగి ఉండాలని, పురుషులకు మాత్రమే అవకాశమని వేతనం 9385 నుండి 18 వేల వరకు ఉంటుందని అన్నారు. సెంట్రో కంపెనీలో కస్టమర్ రిలేషన్స్ అధికారుల ఉద్యోగాల స్ర్తి, పురుషుల కోసం 100 ఖాళీలున్నాయని, ఎస్‌ఎస్‌సి పాసై వయస్సు 19 నుండి 30లోపు ఉండాలని వేతనం 7500 రూపాయలు ఉంటుందని పేల్కొన్నారు. ఓంకార్ నర్సింగ్‌లో 100 ఖాళీలు స్ర్తిల కోసం ఉన్నాయని, వరుణ్ మోటార్స్‌లో 100 పురుషుల కోసం, అపోలో ఫార్మసీలో 100, డాక్టర్ ఐపిఎంలో స్ర్తి, పురుషుల కోసం 100 ఖాళీలు, స్విగ్గిలో 100 పురుషుల కోసం, ఆరంజ్ ప్రైవేటు లిమిటెడ్‌లో 100, యురేకా ఫోర్బ్స్‌లో 100 పురుషుల కోసం ఖాళీలున్నాయని వయస్సు 19 నుండి 30 ఉండాలని, ఇంటర్ ఆపై చదివి ఉండాలని, వేతనం 8500 రూపాయలు ఉంటుందని వివరించారు. మరో 540 మందికి వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఎంపిక చేస్తారని అభ్యర్థులు సర్ట్ఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.