యువ

కారుకు రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో ఏ గాడ్జెట్టూ శాశ్వతం కాదు. ఒకటి ఇవాళ మార్కెట్లోకి వస్తే, దాన్ని తలదనే్న గాడ్జెట్ మరుసటి రోజే, మరింత చౌకగా అందుబాట్లోకి రావచ్చు. ఆ కోవకే చెందుతుంది ఫెండర్ డిఫెండర్. ఇదొక యాంటీ కొలిజన్ వార్నింగ్ సిస్టమ్. కార్‌ను రివర్స్ చేసేటప్పుడు వెనక ఉండే వాహనాన్ని లేదా ఇతర వస్తువులను ఢీకొట్టకుండా హెచ్చరించే పరికరం. ఇలాంటివి ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయనేని కదా మీ సందేహం? నిజమే. కారుకు వెనకభాగంలో సెన్సర్లను అమర్చి, ముందుభాగంలో ఎల్‌సిడి డిస్‌ప్లే వ్యవస్థను ఏర్పాటు చేసే పద్ధతి ఇప్పుడు వాడుకలో ఉంది. అయితే ఫెండర్ డిఫెండర్ తీరు వేరు. ఇది స్మార్ట్ఫోన్ ఆధారంగా పనిచేస్తుంది. దీనిని అమర్చడం కూడా తేలిక. నంబర్ ప్లేట్‌ను తీసి, దాని వెనుక భాగంలో ఫెండర్ డిఫెండర్ పరికరాన్ని మనమే అమర్చుకోవచ్చు.
కారును రివర్స్ చేసేటప్పుడు పది అడుగుల దూరంలో ఏమున్నా వెంటనే స్మార్ట్ఫోన్‌కు హెచ్చరికలు (విజువల్, ఆడియో) పంపిస్తుంది. దీని ధర 150 డాలర్లు. ఇందులో ఉండే రీచార్జబుల్ బ్యాటరీ ఐదు నెలలు నిరాఘాటంగా పనిచేస్తుంది.
*