యువ

వారెవా... ఓర్కా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐఐటి -బాంబే విద్యార్థులు చరిత్ర సృష్టించారు. పోర్ష్, ఆడి, టెస్లా వంటి కార్ల తయారీ కంపెనీలు చేయలేని పనిని తొమ్మిది నెలల్లో సాధించి, సత్తా చాటారు. ఇంతకీ వారు చేసిందేమిటి? ఇండియాలోనే అత్యంత వేగంగా పరుగెత్తే కారును తయారు చేయడం! ఐఐటి బాంబేకు చెందిన 75 మంది విద్యార్థులు సాధించిన ఘనత ఇది. తొమ్మిది నెలల కిందట మొదలు పెట్టిన ఈ మహత్తర కార్యం ఇటీవలే పూర్తయింది. గత ఆదివారం దీనిని కాలేజీ ప్రాంగణంలోనే ప్రదర్శనకు పెట్టారు. వీరు తయారు చేసిన స్పోర్ట్స్ కార్‌కు ఓర్కా అని పేరు పెట్టారు. స్టార్ట్ చేసిన 3.47 సెకన్లలోనే గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని ఓర్కా అందిపుచ్చుకుంటుంది. పేరొందిన రేస్ కార్లు కూడా ఇంత స్వల్ప వ్యవధిలో ఇంత వేగాన్ని అందుకోలేవు. దీంతో సాధారణంగానే ప్రఖ్యాత ఆటో కంపెనీల దృష్టి ఇప్పుడు ఓర్కాపై పడింది.
ఓర్కా డిజైన్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన స్టీల్ ఫ్రేమ్, కార్బన్ ఫైబర్ బాడీ కీలక పాత్ర వహించాయంటాడు రిషబ్ కప్పాసియా. ఐఐటి బాంబేలో అతను ఇంజనీరింగ్ ఫిజిక్స్‌లో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఓర్కా టీమ్‌లో అతనిది కీలకపాత్ర. ఓర్కా తయారీలో విద్యార్థులు శ్రమిస్తే, వారికి ఎన్‌సిబి బేరింగ్స్, టాటా మోటార్స్, సియట్ టైర్స్ వంటి సంస్థలు అండదండలు అందించాయి. త్వరలో బ్రిటన్‌లో జరిగే ఫార్ములా స్టూడెంట్ యుకె కాంపిటీషన్‌లో భారత్ తరపున ‘ఓర్కా’ ప్రాతినిధ్యం వహించబోతోంది. *