యువ

ఇవిగో ఫుట్‌బాల్ యాప్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాప్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! అన్ని రంగాల్లోకీ యాప్స్ ప్రవేశించాయి. ఆటలకూ ఇవి మినహాయింపు కాదు. తాజాగా ఫుట్‌బాల్ ఆటలోకి కూడా యాప్స్ వచ్చేశాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకుని మీ ఆటను మెరుగుపరచుకోవడమే తరువాయి!
Adidas miCoach smart ball
ప్రఖ్యాత క్రీడా పరికరాల సంస్థ ఆడిడాస్ ఇప్పుడు స్మార్ట్ ఫుట్‌బాల్‌తో మార్కెట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ బాల్‌తో మైదానంలో ఎంచ క్కా ఆడుకోవచ్చు. ఇందులోనే ఓ కెమెరా ఉంటుంది. దీనిని ఐఫోన్ యాప్‌కు బ్లూటూత్‌ద్వారా అనుసంధానించుకోవచ్చు. బంతిలో ఉండే సెన్సర్ల ద్వారా సమాచారం యాప్‌కు అందుతుంది. ఎలా కిక్ చేశారు, ఎంతబలంగా కిక్ చేశారు వంటి సమాచారంతో నైపుణ్యాన్ని ఎలా మెరుగు పరచుకోవచ్చో యాప్ విశే్లషించి చెబుతుందన్నమాట. ఈ స్మార్ట్ బాల్ ధర 144 పౌండ్లు.
Talent rebounder
అప్పుడే ఫుట్‌బాల్ ఆట మొదలెట్టేవారు ఏ గోడకో పాస్‌లు ఇస్తూ ఉంటారు. అదే ప్రొఫెషనల్స్ అయితే ‘రీ బౌండ్’ నెట్స్ వాడతారు. బంతిని కొడితే తిరిగి అంతే స్పీడుతో, దిశ తప్పకుండా వెనక్కు వస్తుంది. ఎం-స్టేషన్ టాలెంట్ రీబౌండర్ కూడా ఇలాంటిదే. నెట్‌కు బంతిని పాస్ చేస్తుంటే స్మార్ట్ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న మ్యునిన్‌ప్లే యాప్...ప్లేయర్ ఆట విధానాన్ని అంచనా వేసి, సూచనలు, సలహాలు ఇస్తుంది.