రంగారెడ్డి

అర్థమయ్యే రీతిలో విద్యా బోధన ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూలై 26: ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో నాణ్యమైన విద్యనందించాలని రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ పి.సునీతామహేందర్‌రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని ధన్నారంలోని ప్రభుత్వ పాఠశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, సమీపంలోని యజ్ఞ ఫౌండేషన్ అనాథ విద్యార్థులకు ఎస్‌కెఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు అందజేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఉచితంగా నోటు పుస్తకాలు ట్రస్ట్ ఇవ్వడం సంతోషకరమని, వీలైతే మొక్కలు కాపాడేందుకు ట్రీగార్డు ఇవ్వాలని చెప్పారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యనందించి విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. నాటిన మొక్కలు పెరిగి చెట్లైతే భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు కొద్దిగా వెనుకబడిన మాట వాస్తవమేనని విద్యార్థులు, ఉపాధ్యాయులు కష్టపడి ఈసారి పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా ఉన్నందున ప్రతి ఒక్కరూ మొక్కను తప్పనిసరిగా నాటాలని అన్నారు. ప్రకృతి మనకు ఏమి ఇస్తుందని ఆలోచించకుండా ప్రకృతికి మనం ఏమి ఇస్తామని భావించి మొక్కలు నాటాలని వివరించారు. వికారాబాద్, చేవెళ్ళ శాసనసభ్యులు బి.సంజీవరావు, కె.యాదయ్య మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీలు కె.యాదవరెడ్డి, నరేందర్‌రెడ్డి, వికారాబాద్ మార్కెట్ కమిటి చైర్మన్ ఎస్.రాంచంద్రారెడ్డి, ఎంపిపి ఎస్.్భగ్యలక్ష్మి, జడ్పిటిసి ముత్తహర్‌షరీఫ్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.నాగేందర్‌గౌడ్, టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎన్.శుభప్రద్‌పటేల్, నవాబ్‌పేట జడ్పిటిసి పి.రాంరెడ్డి, ఎంపిడివో ఎం.సత్తయ్య, ఎస్‌కెఆర్ ట్రస్ట్ నిర్వాహకుడు కొండల్‌రెడ్డి, నాయకులు ఎల్లారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.