పశ్చిమగోదావరి

రైతు అవతారమెత్తిన ఎమ్మెల్యే నిమ్మల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యలమంచిలి, జూలై 26: పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంగళవారం చింతదిబ్బ గ్రామంలో వరినాట్లు తీసి అసలు సిసలైన రైతుగా మారారు. స్వచ్ఛమేవ జయతేలో భాగంగా వరినాట్లు తీసి కట్టలు కట్టి నాట్లువేసే మహిళలకు ఆయన అందించారు. అర ఎకరం భూమి నాట్లు వేసే వరకు ఆయన చేలోనే ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ నియోజకవర్గంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం శ్రమదానం ద్వారా జరుగుతుందని, చింతదిబ్బ, ఇలపకుర్రు గ్రామాల్లో ప్రజలు శ్రమదానం చేసి ఆ సొమ్ముతో మొక్కలు నాటి ట్రీగార్డులు అమర్చారన్నారు. ఆయన వెంట జడ్పీటీసీ బోనం నాని, ఆంజనేయులు, టిడిపి నేతలు టి మాధవరావు, సిహెచ్ శ్రీను, తమ్మినీడి ప్రసాద్, అనిశెట్టి వెంకటరెడ్డి, సానబోయిన శ్రీను, పెచ్చెట్టి నాగేశ్వరరావు, ఈతకోట శేషగిరిరావు, కడలి సత్యనారాయణ, ఎస్ రాజా తదితరులున్నారు.