పశ్చిమగోదావరి

అంతా అతిథులే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిడదవోలు, జూలై 26: ఆరు మండలాల్లోని 46 గ్రామాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల వ్యవహారాలకు కేంద్రమైన నిడదవోలు సబ్-రిజిస్ట్రారు కార్యాలయంలో ప్రజలు నిత్యం వెతలకు గురవుతున్నారు. సబ్-రిజిస్ట్రార్ సహా కార్యాలయానికి చెందిన అత్యధిక శాతం ఉద్యోగులు ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటూ, విధులకు హాజరవుతుండటంతో ఆ ప్రభావం ప్రజలపై పడుతోంది. అయితే ఉద్యోగులు, ప్రజలకు అనుసంధానకర్తగా ఒక ప్రైవేటు వ్యక్తి మాత్రం ఇక్కడ చక్రం తిప్పుతుండటం విశేషం. వివరాల్లోకి వెళితే... నిడదవోలు సబ్ రిజిస్ట్రారు కార్యాలయం పరిధిలో నిడదవోలు మండలంలోని 25 గ్రామాలు, కొవ్వూరు మండలంలోని మూడు గ్రామాలు, ఉండ్రాజవరం మండలంలోని నాలుగు గ్రామాలు, చాగల్లు మండలంలోని తొమ్మిది గ్రామాలు, పెరవలి మండలంలోని నాలుగు గ్రామాలు, తాడేపల్లిగూడెం మండలంలోని ఒక గ్రామం ఉన్నాయి. దీనికి నిడదవోలు పట్టణం అదనం. ఆయా గ్రామాల ప్రజలంతా ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల వ్యవహారాలకు ఈ కార్యాలయంపైనే ఆధారపడుతుంటారు.
ఇంత కీలకమైన కార్యాలయంలో సబ్-రిజిస్ట్రార్ నుండి అటెండర్ వరకు ఉద్యోగులంతా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు విధినిర్వహణకు వస్తుంటారు. ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా ఇలా వచ్చేవారేనని సమాచారం. దీనితో దాదాపు ఉదయం 11 గంటల వరకు కార్యాలయంలో అధికారికంగా విధులు ప్రారంభం కావని ప్రజలు వాపోతుంటారు. మంగళవారం ఉదయం 11.15 గంటలకు కూడా సబ్- రిజిస్ట్రార్ కార్యాలయానికి హాజరుకాలేదు. దీనితో రిజిస్ట్రేషన్ కోసం వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు పడిగాపులుపడాల్సి వచ్చింది. ఈలోగా కార్యాలయానికి సంబంధం లేని ఒక ప్రైవేటు వ్యక్తి రిజిస్ట్రేషన్లు త్వరగా చేయిస్తానని వసూళ్లు జరపడటం కనిపించింది. ఆరాతీస్తే ఈ వ్యక్తి ద్వారానే కార్యాలయంలో లావాదేవీలకు సంబంధించిన వసూళ్లు జరుగుతుంటాయని తెలియవచ్చింది.
కాగా ఈ విషయమై దీనిపై సబ్-రిజిస్ట్రార్ జగన్నాథంను ఆంధ్రభూమి వివరణ కోరగా, ప్రైవేటు వ్యక్తిని తాము నియమించలేదని, తమకు, ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదన్నారు. తాను గానీ, కిందిస్థాయి సిబ్బంది ఇతర ప్రాంతాల నుండి వస్తున్నా, సకాలంలో విధులకు హాజరవుతున్నామన్నారు. మంగళవారం మాత్రమే తనకు ఆలస్యమైందని తెలిపారు.