పశ్చిమగోదావరి

మళ్లీ మొదలైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, జూలై 26: చినకాపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. రాష్టవ్య్రాప్తంగా చినకాపవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు వింత వ్యాధి సోకి పడిపోతున్నారన్న వార్త సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మూడురోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటించింది. మంగళవారం పాఠశాల యథావిథిగా తెరిచారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి సక్రమంగానే ఉండటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాకమిటీ ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల ప్రాంగణంలోనే డిప్యూటీ డిఎంహెచ్‌ఒ రాంబాబు, పెదకాపవరం పిహెచ్‌సి వైద్యులు రవికిరణ్‌రెడ్డి ఎఎన్‌ఎంలతో కలిసి వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేశారు. విద్యార్థులకు బలానిచ్చే విధంగా గుడ్లు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లను సర్పంచ్ దారపురెడ్డి కనకయ్య, మర్రివాడ వెంకట్రావు పంపిణీ చేశారు. పరిస్థితి బాగానే ఉందనుకున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి సక్రమంగానే కనిపించింది. అయితే మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో విద్యార్థినులు ఒక్కొక్కరిగా పడిపోవడం ప్రారంభమయ్యంది. వై దుర్గ్భావాని, నాతిరెడ్డి అనూష, దువ్వాని కామేశ్వరి, దువ్వాని కోమలి భారతి, ఆలమూరి శైలజ, దాసరి గాయత్రి, ఎ భాగ్యలక్ష్మి అస్వస్థతకు గురయ్యారు. వీరికి వైద్యసేవలు అందించిన అనంతరం ఇంటికి పంపించేశారు. సర్వశిక్షాభియాన్ వైద్యులు ఆశా, ఫిజియోథెరపిస్టు బాల శ్రీనివాస్ ప్రతి తరగతి గదికి వెళ్ళి కౌనె్సలింగ్ ఇచ్చారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ కేవలం ఫోబియోతోనే విద్యార్థులు పడిపోతున్నారన్నారు.
ఈ క్రమంలో గుమ్ములూరు గ్రామానికి చెందిన వై దుర్గ్భావానీ మేనమామ మేడిశెట్టి కొండయ్య వైద్యులు, విద్యాభివృద్ధి కమిటీ, ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థులకు సోకిన వ్యాధి ఏమిటో గుర్తించలేకుండా రోజుకోరకమైన వ్యాఖ్యలు చేయడం తమకు ఆందోళన కలిగిస్తుందన్నారు. రెండురోజుల క్రితం పాఠశాల ప్రాంగణంలో కోళ్ళను కోయడం వల్ల తాము మరింత ఆందోళన చెందుతున్నామన్నారు.