నిజామాబాద్

ఆవిరవుతున్న పసుపు రైతుల ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 29: అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అత్యధిక విస్తీర్ణంలో పసుపు పండిస్తున్న తెలంగాణ ప్రాంత రైతాంగం చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డు ఏర్పాటు కల సమీప భవిష్యత్తులో సాకారమయ్యే సూచనలు కనిపించడం లేదు. గత యుపిఎ ప్రభుత్వ హయాంలోనైనా బోర్డు ఏర్పాటుకు కేంద్రం నుండి సానుకూల సంకేతాలు కనిపించగా, ప్రస్తుతమైతే అసలు పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతే లేదని ఇటీవలే ఓ కేంద్ర సహాయ మంత్రి పేర్కొనడం పసుపు రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. జాతీయ స్థాయిలో 30శాతానికి పైగా పసుపు పంటను సాగు చేసే తెలంగాణ ప్రాంత రైతులు ఈ తరహా వైఖరిని ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. బోర్డు ఏర్పాటైతే తమ సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుందనే ఉద్దేశ్యంతో గత దశాబ్ద కాలంగా గల్లీ నుండి ఢిల్లీ స్థాయి వరకు పసుపు పోరాట కమిటీ ఆధ్వర్యంలో పోరాడినా ఫలితం దక్కడం లేదని నిర్వేదానికి లోనవుతున్నారు. గతం రెండున్నర మాసాల క్రితం నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఎంపిలు, ఈ ప్రాంత ఎమ్మెల్యేలతో కూడిన బృందం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిసి పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి వినతిపత్రం సమర్పించారు. ఆ సమయంలో మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, బోర్డు ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయో లేదోనని అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందాన్ని పంపిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనే అర్థరహితమని, దీని ఆవశ్యకత లేదంటూ కేంద్రం సంకేతాలు వెలువరించడంతో పసుపు రైతులు అయోమయానికి గురవుతున్నారు. స్థానికంగా పసుపు బోర్డు ఏర్పాటైతేనే తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పసుపు రైతులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పసుపు బోర్డు ఏర్పాటుకు అవసరమయ్యే కార్యక్రమాలు చేపట్టేందుకు గాను గత ఏడాదే 13మంది సభ్యులచే పసుపు ప్రత్యేక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసింది. జిల్లాలో పసుపు పార్క్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపుతూ రెండు దశల్లో నిధులను సమకూరుస్తామని ప్రకటించింది. అయితే పసుపు పార్క్ వల్ల తమకంటే వ్యాపారులకే అధిక లాభాలు సమకూరుతాయని రైతులు పేర్కొంటున్నారు. తమకు ప్రయోజనం చేకూరాలంటే పసుపు బోర్డును ఏర్పాటు చేయాల్సిందేనని రైతులు బలంగా కోరుతున్నారు. గడిచిన దశాబ్ద కాలంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఢిల్లీ స్థాయి వరకు ఆందోళనలు నిర్వహించారు. దేశంలోనే అత్యధికంగా పసుపు పంట సాగయ్యే ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఈ జిల్లాలోని ఆర్మూర్ సబ్ డివిజన్ రైతులతో పాటు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనూ రైతులు పసుపు పంటను సాగు చేస్తారు. దేశంలో తమిళనాడు, ఒడిషా, మహారాష్ట్ర, కేరళతో పాటు పలు రాష్ట్రాలు కూడా పసుపు పంటను సాగు చేస్తున్నప్పటికీ, ఒక్క నిజామాబాద్ ప్రాంత రైతులే దేశం మొత్తం మీద సాగయ్యే పసుపు పంటలో 30శాతం పంటను సాగు చేస్తారు. ఒకనాడు పసుపును అమ్ముకుని బంగారాన్ని కొనుగోలు చేసిన రైతులు పసుపును పచ్చ బంగారంగా పిలుచుకోవడం అలవాటు చేసుకున్నారు. అలాంటి పసుపు రైతులు నేడు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. గత ఆరేళ్ల క్రితం రైతులు క్వింటాలు పసుపునకు గరిష్ఠంగా 30వేల రూపాయల వరకు ధర పొందారు. ఆ తరువాత గడిచిన ఐదేళ్లుగా ధరలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూ సగటున 6వేల రూపాయల వరకు ఉంటోంది. ప్రభుత్వం స్థానికంగా పసుపు బోర్డును ఏర్పాటు చేస్తే ఈ పరిస్థితి ఉండదని రైతులు పేర్కొంటున్నారు.