రంగారెడ్డి

హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్‌బినగర్, జులై 29: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేయాలని రవాణశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తపేట్ డివిజన్ పరిధి సిటిఓ కాలనీలోని లిటిల్ ఏంజెల్ పాఠశాల ఆధ్వర్యంలో చేపట్టిన హరితహార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఎల్బీనగర్ సర్కిల్ కమిషనర్ రఘుప్రసాద్, కార్పొరేటర్లు జివి సాగర్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, ఎల్బీనగర్ ఇన్‌చార్జి రామ్మోహన్‌గౌడ్, విద్యార్థులు, ఉపాద్యాయులతో కలిసి మొక్కలు నాటారు. మంత్రి మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత కోసం చెట్లు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణ బాధ్యతగా ట్రీగార్డ్స్, నిత్యం నీరు పోసి పెంచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తెరాస నాయకులు ఉదయ్‌గౌడ్, జహీర్‌ఖాన్, పాండుగౌడ్, ధన్‌రాజ్ గౌడ్, రామకృష్ణ, ప్రవీణ్ పాల్గొన్నారు.
మొక్కల పంపిణీ
వనస్థలిపురం: నగరంలోనే తన డివిజన్‌లో అత్యధిక మెక్కలు నాటి రికార్డు సృష్టిస్తానని మన్సురాబాద్ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చద్రపురికాలనీలోని ప్రతిభ హైస్కూల్‌లో నిర్వహించిన మెక్కల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరయ్యారు. విద్యార్థులకు వివిధ రకాల ఔషద మెక్కలను అందజేశారు. నాటిన ప్రతి మొక్కను పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పాఠశాల చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణతో పాటు మొక్కల పెంపకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రిన్సిపాల్ లలిత, శరత్, మల్లయ్య పాల్గొన్నారు.
సీడ్స్ స్కూల్‌లో..
సెంట్రల్ బ్యాంక్ కాలనీలోని సీడ్స్ స్కూల్‌లో విద్యార్థులకు మొక్కలను కార్పొరేటర్ విఠల్‌రెడ్డి అందజేశారు. ప్రతి విద్యార్థి పుట్టిన రోజున ఒక మొక్కను నాటి దానిని పెంచే భాద్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల సిఇవో మహేష్ కుమార్, డెవలప్‌మెంట్ మేనేజర్ విజయ్, ప్రిన్సిపాల్ ప్రీతి, విజయసుధ పాల్గొన్నారు.
నాగార్జున స్కూల్‌లో..
నాగోలు డివిజన్ సాయినగర్ కాలనీలోని నాగార్జున స్కూల్‌లో విద్యార్థులకు కార్పొటర్ చెర్కు సంగీత ప్రశాంత్ గౌడ్ మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అజితరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
గచ్చిబౌలి: పర్యావరణ పరిరక్షణకు అందరు మొక్కలు నాటాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ అన్నారు. హరితహారంలో భాగంగా కొండాపూర్‌లో ఏరియా ఆసుపత్రిలో కార్పొరేటర్ హమీద్‌పటేల్‌తో కలిసి మొక్కలు నాటారు. నాటిన మొక్కలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత అన్ని వర్గాల పైన ఉందని సూచించారు. పెరిగిపోతున్న కాలుష్యాన్ని అంతమొందించాలంటే మొక్కలు నాటడమే మార్గమని చెప్పారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ముందుకు వచ్చి మొక్కలు నాటాలని గాంధీ కోరారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ కళావతి పాల్గొన్నారు.
చెట్లు ప్రగతికి మెట్లు
చేవెళ్ల: ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున తప్పనిసరిగా ఒక మొక్క నాటాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. హరితహారంలో భాగంగా శుక్రవారం చేవెళ్ల మండల పరిధిలోని ముడిమ్యాల సమీపంలో మొక్కలు నాటారు. చెట్లు ప్రగతికి మెట్లని తెలిపారు. మొక్కలు నాటి వాటిని వదిలేయకుండా సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటిసి శైలజ పాల్గొన్నారు.
రాజేంద్రనగర్‌లో..
రాజేంద్రనగర్: విద్యార్థులు పాఠశాల ఆవరణతో పాటు ప్రతి ఇంట్లో విధిగా మొక్కలు నాటి పరిరక్షించాలని రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ఏవిఎం స్కూల్, చింతల్‌మెట్‌లోని న్యూ బ్లూమూన్ స్కూల్‌లో విద్యార్థులకు మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కల పంపిణీ చేశారు.