పశ్చిమగోదావరి

‘ప్రత్యేక’ హామీ నెరవేర్చాలి:పరకాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లజర్ల, జులై 29: బిజెపి ప్రభుత్వం ఎన్నికల హామీగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పరకాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా పాల్గొనేందుకు శుక్రవారం ఆయన నల్లజర్ల విచ్చేసి స్థానిక టిడిపి నాయకత్వ శిక్షణా కేంద్రం వద్ద విలేఖరులతో మాట్లాడారు. కుంటి సాకులతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదోవ పట్టిస్తోందన్నారు. విభజన జరిగిన సమయంలో ప్రతిపక్ష నేతలుగా ఉన్న అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు యుపిఎ ప్రభుత్వంపై పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశాన్ని పెట్టాలని పట్టుపట్టారన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా హామీని రాష్ట్ర ప్రజలకు ప్రకటిస్తామన్నారు. ప్రత్యేక హోదాతో సమస్యలు తీరతాయని భావించిన ప్రజలు కేంద్రంలో బిజెపికి, రాష్ట్రంలో టిడిపికి పట్టంకట్టారని, ప్రస్తుతం ఆర్థిక లోటుతో రాజధాని లేకుండా అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం విభజన సమయంలో ఎన్నికల హామీగా ఇచ్చిన ప్రత్యేక హోదాను నెరవేర్చాలన్నారు. అలాగే విభజనకు అప్పట్లో సహకరించిన అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలన్నారు. ప్రత్యేక హోదా అనేది కేవలం తెలుగుదేశం పార్టీ బాధ్యతగా భావిస్తే కుదరదన్నారు. కార్యక్రమంలో జడ్పీఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎంపిపి జమ్ముల సతీష్, జడ్పీటీసీ సభ్యురాలు కొఠారి అనంతలక్ష్మి, టిడిపి మండలాధ్యక్షులు ఏలేటి సత్యనారాయణ (జెడి), తెలుగుమహిళ జిల్లా అధ్యక్షురాలు గంగిరెడ్ల మేఘలదేవి పాల్గొన్నారు.