పశ్చిమగోదావరి

దళితుల సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యం సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 31 : దళితుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించినా, ప్రభుత్వ కార్యాలయాలలో దళితులకు న్యాయంగా లభించాల్సిన ప్రమోషన్లను తొక్కిపట్టినా సహించబోనని ఆంధ్రప్రదేశ్ ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ హెచ్చరించారు. స్థానిక ఇరిగేషన్ అతిధిగృహంలో ఆదివారం మధ్యాహ్నం జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఎస్‌సి, ఎస్‌టి ప్రజలు అందించిన వినతి పత్రాలను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలలో ఎస్‌సి, ఎస్‌టిలకు చట్టప్రకారం ప్రమోషన్లు కల్పించాల్సి వున్నప్పటికీ కొంతమంది అధికారులు కావాలని ప్రమోషన్లు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని, ఈ విషయంలో సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి వుంటుందని చెప్పారు. ఇరిగేషన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎ లక్ష్మి వినతిపత్రం సమర్పిస్తూ సీనియారిటీ ప్రకారం తనకు సూపరింటెండెంట్ పోస్టు ఇవ్వాల్సి వుండగా తొక్కిపడుతున్నారని ఫిర్యాదు చేయగా దీనిపై శివాజీ స్పందిస్తూ ఇరిగేషన్ ఎస్ ఇని తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోపాలపురం ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులను తొలగించారని, దళితులు కావడం వల్లే ప్రిన్సిపాల్ రాణి తమను అకారణంగా ఉద్యోగాల నుండి తొలగించారని ఫిర్యాదు చేశారు. నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామానికి చెందిన చెక్కా లలిత వినతిపత్రం సమర్పిస్తూ ఎస్ సి, ఎస్‌టి ఎట్రాసిటీ కేసు నుండి కొందరిని తప్పించి తప్పుడు కేసులు కడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఎస్‌సి, ఎస్‌టిలకు చెందిన 10వ తరగతి పరీక్ష ఫీజును మినహాయించాలని, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్ధినీ విద్యార్ధులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయాలని డి ఇవో కార్యాలయంలో ఎస్‌సి, ఎస్‌టి సెల్ ఏర్పాటు చేయాలని పలువురు కారెం శివాజీకి అందజేసిన వినతిపత్రంలో కోరారు. లింగపాలెం మండలం తోచిలక గ్రామంలో స్మశాన వాటిక లేక దళితులు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని పలువురు కోరారు. రాష్ట్రంలో 2018 నాటికల్లా ఎస్‌సి, ఎస్‌టి కాలనీలకు సిమెంటు రోడ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చర్యలు తీసుకున్నారని శివాజీ చెప్పారు. దళిత వాడ ప్రాంతాలలో పక్కా రోడ్ల నిర్మాణంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విధానాన్ని ఏర్పాటు చేసి దళితులకు మంచి రహదారి వ్యవస్థను తీర్చిదిద్దుతామని చెప్పారు.