పశ్చిమగోదావరి

జిల్లాలో 47 వేల మంది స్నానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 31 : గోదావరి అంత్యపుష్కరాల ప్రారంభం రోజైన ఆదివారం జిల్లాలో కొవ్వూరు, సిద్ధాంతం, నరసాపురం, పోలవరం, ఇతర ప్రాంతాలలో ఏర్పాటుచేసిన స్నానఘట్టాలలో సుమారు 47 వేల మంది భక్తులు పుష్కర పుణ్యస్నానాలు ఆచరించారు. నరసాపురం డివిజన్‌లోని 15 స్నానఘట్టాలలో సుమారు 27 వేల మంది, జంగారెడ్డిగూడెం డివిజన్‌లో ఏర్పాటుచేసిన 20 స్నానఘట్టాలలో సుమారు 10 వేల మంది, కొవ్వూరు డివిజన్‌లోని 5 స్నానఘట్టాలలో 10 వేల మంది భక్తులు పుష్కర స్నానమాచరించారు. అంత్య పుష్కరాలు సందర్బంగా మొదటి రోజు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. స్ర్తి శిశు సంక్షేమ శాఖ, వివిధ స్వచ్ఛంద సంస్తలు చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. స్నానఘట్టాలలో స్వచ్ఛంద సేవా సంస్తలు భక్తులకు పులిహోర, మంచినీరు అందించారు. భక్తులు సౌకర్యార్ధం స్నానఘట్టాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి భక్తులకు అవసరమైన మందులు, వైద్య సేవలు అందించారు. అన్ని ఘాట్లలో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి స్నానఘట్టాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీని బట్టి మరిన్ని సౌకర్యాలు ఏర్పాటుచేస్తామని అధికారులు వెల్లడించారు.