యువ
రణ్‌బీర్‌కు హైదరాబాదీ కుర్రాడి ఫిట్నెస్ పాఠాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈ ఇద్దరూ ఎవరనుకుంటున్నారా? హైదరాబాద్‌కు చెందిన ఫిట్నెస్ ట్రెయినర్లు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్లంతా ఫిట్నెస్ ట్రెయినింగ్కోసం హైదరాబాద్ వైపే చూస్తున్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేయడమే మన ట్రెయినర్ల ప్లస్ పాయింట్. వినోద్ చన్నా ఇప్పటికే ముంబయిలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. బిజినెస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వంద కేజీల మేర బరువు తగ్గడం వెనక వినోద్ చన్నా కష్టం ఎంతో ఉంది. శిల్పా శెట్టి మొదలు ఎంతోమంది బాలీవుడ్ స్టార్లకు అతను ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇస్తున్నాడు కూడా. ఇప్పుడు అదే లైన్లో దూసుకుపోతున్నాడు కునాల్ గిర్. హైదరాబాద్‌లో ఫిట్నెస్ పాఠాలు చెప్పే కునాల్‌కు అకస్మాత్తుగా ఇటీవల ఓ ఫోన్ వచ్చింది. అది నటుడు దగ్గుబాటి రానానుంచి. బాలీవుడ్ యంగ్ స్టార్ రణ్‌బీర్ కపూర్‌కు ట్రెయినింగ్ ఇస్తావా? అన్నది అటునుంచి వచ్చిన ప్రశ్న. దానికి కునాల్ సరేనన్నాడు. రణ్‌బీర్‌ను కలవడం, ట్రెయినింగ్ మొదలు కావడం వెంటవెంటనే జరిగిపోయాయి.
హైదరాబాద్‌లో బిజీగా ఉండే కునాల్..రణ్‌బీర్‌కు శిక్షణ ఇచ్చేందుకు గత నెల రోజుల్లో 20సార్లు ముంబయికి వెళ్లాడు. దీనికోసం తన టైమ్‌ను అడ్జెస్ట్ చేసుకుంటున్నానని కునాల్ చెప్పాడు. ప్రస్తుతం ‘జగ్గా జాసూస్’ చిత్రం షూటింగ్లో ఉన్న రణ్‌బీర్‌కు వీలు కుదిరినప్పుడల్లా కునాల్‌ను ముంబయికి పిలిపించుకుంటున్నాడు. ఇంతకీ రణ్‌బీర్‌కు ఫిట్నెస్ ట్రెయినింగ్ ఎందుకు? అదే ప్రశ్న వేస్తే రాబోయే సినిమా ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) కోసమని కునాల్ చెప్పాడు. ఈ సినిమాలో సూపర్ హీరో పాత్ర ధరిస్తున్న రణ్‌బీర్..చూడటానికి జిమ్నాస్ట్‌లా కనిపించాలట. అందుకే ఈ ట్రెయినింగ్ తతంగమంతా అని వివరించాడు. జగ్గా జాసూస్ షూటింగ్ డిసెంబర్‌తో ముగుస్తుందని, అప్పటినుంచీ ట్రెయినింగ్‌ను మరింత స్పీడప్ చేస్తామని కునాల్ చెప్పాడు.