రంగారెడ్డి

కేసులను త్వరితగతిన పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఆగస్టు 30: జిల్లాలోని అన్ని పోలిస్‌స్టేషన్‌లలోని కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా ఎస్పీ డాక్టర్ బి.నవీన్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో పోలీస్‌స్టేషన్‌లలో కేసుల పురోగతిని సమీక్షించారు. కేసుల పరిష్కారానికి సూచనలు, సలహాలు ఇచ్చారు. అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలు, చిన్న పిల్లలపై జరుగుతున్న చట్ట వ్యతిరేక చర్యలపై తక్షణమే స్పందించి ఫిర్యాదు దారులకు న్యాయం చేయాలని సూచించారు. వినాయకచవితి, బక్రీద్ పండుగల సందర్భంగా బందోబస్తు నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పోలీసుల విధుల గురించి తెలిపారు. తాండూర్, వికారాబాద్, చేవెళ్ళ సబ్‌డివిజ అధికారులు డివిజన్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు సర్కిల్ స్థాయిలో అన్ని పోలీస్‌స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, స్టేషన్ స్థాయిలలో శాంతి సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు.
పదవి విరమణ పొందిన సిబ్బందికి సన్మానం
34 సంవత్సరాలుగా సేవలందిస్తూ ఎస్‌ఐగా విరమణ పొందుతున్న ఎం.బిచ్చప్ప, 33 సంవత్సరాలుగా సేవలందిస్తూ ఎఎస్‌ఐగా విమరణ పొందుతున్న కృష్ణారెడ్డికి లబ్ధిని అందజేస్తూ సన్మానించారు. శేషజీవితం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిటిసి డిఎస్పీ లతామాధురి, వికారాబాద్, చేవెళ్ల డిఎస్పీలు టి.స్వామి, శృతకీర్తి, ఎస్‌బిఐ వేణుగోపాలరాజు, ఇన్‌స్పెక్టర్‌లు, ఎస్‌ఐలు, రిజర్వ్ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.