రంగారెడ్డి

నన్నూ చంపడానికి నయామ్ గ్యాంగ్ యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరూర్‌నగర్, ఆగస్టు 30: సరూర్‌నగర్ మండలంలోని బాలాపూర్‌లో నిర్వహిస్తున్న వందలకోట్ల విలువ చేసే ‘ప్రైడ్ ఇండియా’ రియల్ ఎస్టేట్ సంస్థకు గ్యాంగ్‌స్టర్ నరుూమ్ బినామీ అని ఈ వ్యవహరంపై వెంటనే సిబిసిఐడిచే విచారణ చేపట్టాలని బిజెపి రాష్ట్ర నాయకుడు ఎ.శంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బడంగ్‌పేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలాపూర్‌లో వందల ఎకరాల ప్రభుత్వ భూములు, శిఖం భూములు, దేవాలయాలు, మసీదులకు సంబంధించిన భూములను కబ్జాలు చేసి రియల్ వ్యాపారాలు చేస్తున్నారని ప్రైడ్ ఇండియా సంస్థపై ఆయన ఆరోపణ చేశారు. ఆ సంస్థ నిర్వాహకులకు క్రిమినల్ చరిత్ర ఉందని గతంలో వీరిపై అనేక పత్రికల్లో గోల్డ్ స్మగ్లింగ్ కేసులు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. సరూర్‌నగర్ మండలంలో ప్రైడ్ ఇండియా నిర్వాహకుల ఆగడాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. నరుూమ్, అతని అనుచరులు చేస్తున్న సంఘ వ్యతిరేక కార్యక్రమాలను అధికారులు అడ్డుకోలేక పోతున్నారని ఆయన అన్నారు. గతంలో నరుూమ్ అనుచరులమని బెదిరిస్తున్న వారిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో వారు తనను సైతం బెదిరించి తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆయన అన్నారు. ఒక సమయంలో నరుూమ్ అనుచరులు అయిన ప్రైడ్ ఇండియా నిర్వాహకులు తనను చర్చలకు పిలిచి టీలో విషప్రయోగం చేశారని శంకర్‌రెడ్డి త్రీవస్థాయిలో ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో తాను దేవతల గుట్టను పరిరక్షించాలనే ఉద్దేశంతో పోరాటం చేస్తే నరుూమ్ అనుచరులైన రియాజ్, సానోవర్‌బేగ్, జుబేద్, మల్లెల శ్రీకాంత్, ముజామిల్‌బాబా అలియాస్ సీతారామ్‌రెడ్డి తనతోపాటుగా దేవాలయ కమిటీ సభ్యులను కూడా హతమారుస్తామని గత సంవత్సరంలో బెదిరించారని ఆయన ఆరోపించారు. ఈవిషయాన్ని సైబరాబాద్ పోలీసు కమిషనర్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు. ప్రైడ్ ఇండియా ఎండి, ముజమిల్ బాబా మరో ఇద్దరు తాము నరుూమ్ వ్యక్తులమని చెపుతూ అనేక రకాలుగా వేధిస్తూ మీకు ఇక భవిష్యత్తే లేకుండా చేస్తామని హెచ్చరిస్తూ, మీ అందరి ఫొటోలు, రికార్డులు చేశామంటూ దాదాపుగా 14 నెలలుగా దౌర్జన్యాలతో తమను వేధించారని ఆయన తెలిపారు. సరూర్‌నగర్ మండలంలోని ప్రభుత్వ, దేవాలయ భూములను కబ్జాలు చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్న నరుూమ్ అనుచరులైన ప్రైడ్ ఇండియా నిర్వాహకులను వెంటనే అరెస్ట్ చేసి, దీనిపై ప్రభుత్వం సిబిసిఐడి విచారణ జరపాలని శంకర్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విలేఖరుల సమావేశంలోబి.నర్సింహ్మ, గడ్డం వెంకటేష్, శ్రీకాంత్‌గౌడ్, కె.సంజీవ, జె.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.