రంగారెడ్డి

చిన్నారులకు చాక్లెట్ ఆశచూపి దోపిడీ.. మాయలేడి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, నవంబర్ 17: మేడ్చల్ పట్టణంలోని రథంశాల సమీపంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న ముగ్గురు చిన్నారులకు (బాలికలు) మాయమాటలు చెప్పి బంగారు చెవి పోగులు వెండి పట్టీలతో ఉడాయించిన మాయలేడి ఉదంతమిది. ఎస్‌ఐ గ్యార పవన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని రథంశాల సమీపంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న హేమలత, సత్యవతి, సాయికీర్తన ముగ్గురు చిన్నారి బాలికలను మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఓ గుర్తుతెలియని మహిళా కుర్‌కురే, చాక్లెట్ ఇస్తానని మాయమాటలు చెప్పి కొంత దూరం తీసుకువెళ్లింది. వారిలో ఇద్దరు చిన్నారి బాలికల బంగారు చెవి పోగులు, కాళ్ల వెండి పట్టీలు తీసుకుని వారిని మేడ్చల్ బస్ స్టేషన్ సమీపంలోని వినాయక్‌నగర్ కాలనీలో వదిలిపెట్టి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కె.కాశీ.. మేడ్చల్ పిఎస్‌లో ఫిర్యాదు చేశారు. చిన్నారి బాలికలు ముగ్గురు క్షేమంగా తమతమ ఇళ్లకు చేరుకున్నారని ఎస్‌ఐ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. స్కూల్ పిల్లలకు బంగారు లేదా వెండి ఆభరణాలు వేసి పంపించవద్దని పంపించినా వారికి అన్ని జాగ్రత్తలు సూచించాలని ఎస్‌ఐ పవన్‌కుమార్ తెలిపారు.