ధర్మసందేహాలు

శే్వతవర్ణం నిగ్రహానికి చిహ్నమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* దేవాలయాల్లో, పూజాంతంలో వేద పఠనం జరుగుతుంది. ఇంటిలో జరగదు. ఎందుకు ?
- సి. వెంకట్రావు, చెన్నై
ఇళ్లల్లో చేసే పూజలో జరిగే ఉపచారాలన్నీ చాలా పరిమిత స్థాయిలో ఉంటాయి. వ్యక్తిస్థాయిలో అంతకన్నావిస్తారంగా చేయడం కష్టం. ఈ లోటును పూరించటానికే గ్రామమంతా కలసి ఒక దేవాలయాన్ని ఏర్పరుచుకుంటుంది. ఈ దేవాలయానికి చేసే నిత్య పూజలలోనూ , ఉత్సవ పూజలలోను అవకాశాన్ని బట్టి అశ్వారోహణ, గజారోహణాది విశేష సేవలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. దేవాలయాలలోని విస్తృత వేద పఠనం ఈ కోవలోకి చేరినదే. దేవాలయ నిర్మాణమే సమష్టి సమాజ నిర్మాణం కనుక అక్కడ జరిగే సేవల ఫలితాలన్నీ తత్సహాయ కర్తలందరికీ సమానంగానే అందుతాయి.
* వేద పఠనం విశిష్టతను వివరించండి
యావన్మానవ జాతి యొక్క గ్రంథ స్థీకృత ప్రప్రథమ శబ్దరాశియే వేదం. వేదం పుట్టేనాటికి మతాలేవీ పుట్టనే లేదు. అందుచేత వేదాలకు మతం లేదు. కానీ అందులో ఉండే ధ్వనులకు ‘‘ఉదాత్తానుదాత్త న్వరితాది’’స్వరాలున్నాయి. అందువల్ల వేద శబ్దాలకు మానవ శఱీరంలో ఉండే నాడీ మండలాన్ని ప్రేరేపించగల విశేష శక్తి కూడా ఉన్నాయి. అందువల్లనే యుగయుగాల నాటి మన మహర్షులు వేద పఠనాన్ని ఒక శాంతి మార్గంగా ఒక ఉపాసనావిధానంగా ఒక పూజాప్రక్రియగా రూపొందించారు.
* నూతన వధూవరులు పెళ్లి బట్టల పేరిట నూతన తెల్లవస్త్రాలు ధరిస్తారు. ఈ నూతన తెల్ల వస్త్రాల విశిష్టత ఏమిటి?
- నూతన్, హైదరాబాద్
నూతన వధూవరులకు కొన్ని సంప్రదాయాలలో పసుపు బట్టలు, కొన్ని సంప్రదాయాలలో లేత ఎరుపు బట్టలు, కొన్ని సంప్రదాయాల్లో తెల్లటి బట్టలు కడుతున్నారు. ఇక్కడ పసుపు పవిత్రతకు, లేత ఎరుడు అనురాగానికి, తెలుపు సత్వగుణానికీ ప్రతీకలుగా స్వీకరించబడుతున్నాయి.
* కొత్త కాపురంలో ఆడపిల్ల తెల్లచీర కట్టుకుంటుంది. తెలుపురంగుకి సంకేతం ఏమిటి - గణపతి, బోరుబండ
గృహస్థ ధర్మంలో కామం ఆదరణీయమే అయినప్పటికీ అది ఉద్రేకపూరితము, నియమ రహితము అయి ఉండటం మన సంప్రదాయానికి సమ్మతం కాదు. అందుకే ప్రశాంతికి, నిగ్రహానికి సంకేతమైన తెల్లచీరతో కొత్త కాపురంలో నవ వధువును అలంకరించే సంప్రదాయం ఏర్పడింది.
* స్మార్తులంటే ఎవరు? స్మార్తులకు శైవులకు తేడా ఏమిటి ? - నీరజ, కోదాడ
మనుస్మృత్యాది అష్టాదశ స్మృతులను ప్రధాన ప్రమాణంగా స్వీకరించేవారు స్మార్తులు, కారణాగమాది శైవాగమాలను ప్రధాన ప్రమాణాలుగా స్వీకరించేవారు శైవులు.
* శివాలయంలో విష్ణువుని వైష్ణవాలయంలో శివుడిని స్మరించమంటారు ఇది ఎంతవరకు సాధ్యం.?
- కేశవరావు, సూర్యాపేట
భేద భావన తీవ్రంగా నాటుకుపోయిన హృదయాలకు ఇది కొంచెం కష్ట మే కావచ్చు. కానీ హరిహరబ్రహ్మలనేవారు వేరే వేరే వ్యక్తులు కారు. ఒకే తత్త్వం ఉంది. అదే తత్త్వం సృష్టించడం వైపు మొగ్గు చూపితే అపుడు ఆ తత్త్వానికి బ్రహ్మ అని పేరు. అదే తత్త్వం ఆ సృష్టిని పరిపాలించడానికైతే అది అపుడు అదే తత్త్వం పేరు విష్ణువు, వచ్చిన సృష్టి అగంతుకం కనుక ఒకనాటికి అది పోనే పోతుంది. అది పోవటానికి సహకరించే స్థితిలో అదే తత్త్వం పేరు శివుడు. ఈ సత్యాన్ని మననం చేసుకుంటే శివాలయంలో విష్ణువుని విష్ణ్వాలయంలో శివుడిని ధ్యానించడం కష్టంకాదు.
* పూర్ణాహుతి గురించి వివరించండి
హోమఫలం పరిపూర్ణంగా సిద్ధించేందుకోసం హోమాలు చేసేటపుడు, అగ్నిదేవుని ఉద్దేశించి చేసే ప్రత్యేక హోమమే పూర్ణాహుతి. అది జరిగితేగానీ ఏ హోమమైన కూడా పరిపూర్ణం కాజాలదు.
* రామలక్ష్మణులు అరణ్యానికి వెళ్ళినాక దశరథ మరణం జరిగింది. భరత శత్రుఘు్నలను మేనమామల ఇంటినుంచీ ఎవరు పిలిపించారు? దశరథునకు అంత్యక్రియలు ఎవరు చేశారు?
వశిష్ఠాది వృద్ధ మంత్రులు అయోధ్యానగర రక్షణకు తగిన ఏర్పాట్లుచేసి, భరత శత్రుఘు్నలకు తక్షణమే రమ్మని వార్త పంపారు. వారు తిరిగి వచ్చినాక మాత్రమే దశరథ మరణవార్త చెప్పారు. దశరథుడి అంత్యక్రియలు భరతుడే చేశాడు. వాల్మీకి రామాయణం ప్రకారం జరిగిన క్రమం ఇది.
**
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org