రంగారెడ్డి

ప్రజల సహకారంతో దేశ సమగ్రాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, డిసెంబర్ 4: దేశ సమగ్రాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పాలనలో పాదర్శకతకు పెద్దపీట వేశారని తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మేధావుల సెల్ కన్వీనర్ రాచూరి రాజశేఖర్ అధ్యక్షతన నోట్ల రద్దు, దాని ప్రభావంపై మేధావుల సదస్సు అత్తాపూర్ జనప్రియ బాస్కెట్‌బాల్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొని ప్రజల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత రెండున్నరేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలపై నరేంద్రమోడీ ఉక్కుపాదం మోపాడని తెలిపారు. భారతదేశాన్ని దశాబ్ధాలుగా పట్టి పీడిస్తున్న అవినీతి, నల్లధనం, జాడ్యం నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని, అందులో భాగంగానే నరేంద్రమోడీ రూ.వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో కుంభకోణాలకు పాల్పడి కోట్లు కూడబెట్టిన అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని, పన్నులు చెల్లించకుండా పెద్ద ఎత్తున ధనాన్ని పోగు చేసిన నల్లకుబేరుల సౌధం కూలిపోతుందని వెల్లడించారు. పెద్దనోట్ల రద్దుతో దేశ భవిష్యత్తును సమూలంగా మార్చివేసే ఈ నిర్ణయం కొంత మేరకు నగదు లభించక సామాన్యులు కొన్ని ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమేనని, బంగారు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న ప్రజలు ఇబ్బందులు ఎదురైనా ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారన్నారు. ప్రజలు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుంటే ఈ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని ఆయన తెలిపారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజలను జాగృతి చేసి క్యాష్‌లెస్ ఆర్థిక వ్యవస్థను నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దుతో ఉగ్రవాదం, నల్లధనం, అవినీతి, దొంగనోట్లు తగ్గుతాయన్నారు. కార్యకర్తలు, నాయకులు పెద్ద నోట్ల రద్దుపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్న అవినీతి, నల్లధనం నిర్మూలించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలుపుతూ ప్రజల్లో చైతన్యం కలిగించి భారత అభివృద్ధికి బాటలు వేద్దామని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయి రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచి బాటలు వేద్దామని సూచించారు. కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న సమస్యలను భూతద్ధంలో చూపెడుతూ కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాయని, తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. లావాదేవీలు జరిపేందుకు గతంలో లాగా డబ్బులు చెల్లించకుండా స్వైపింగ్ మిషన్లు, పేటిఎం, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని క్రయవిక్రయాలు చేసుకుంటే సులభతరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రేమ్‌రాజ్, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహ్మారెడ్డి, పి.అంజన్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శ్రీ్ధర్, ఉపాధ్యక్షుడు ఎన్.మల్లారెడ్డి, రాజేంద్రనగర్ అసెంబ్లీ కన్వీనర్ ఎం.కొమరయ్య, రామకృష్ణచారి, సుబ్రమణ్యేశ్వర్‌రావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

9న విద్యార్థి విజయ్ దివస్ మహాసభ
హైదరాబాద్, డిసెంబర్ 4: విద్యార్థుల పోరాటాలు, అమరుల త్యాగాల ఫలితంగానే 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు తొలిప్రకటన చేసిందని, డిసెంబర్ 9న విద్యార్థి విజయ్ దివస్‌గా నిర్వహించాలని తెలంగాణ నవ నిర్మాణ్ విద్యార్ధి సేన పిలుపునిచ్చింది. కార్యక్రమ వాల్‌పోస్టర్‌ను ఆదివారం గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఆవిష్కరించారు. విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షుడు టికె శివప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల పునాదుల మీద నిర్మితమైన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కోల రాము, శరత్‌కుమార్, మహేష్, గణేష్, రాజు, కొండల్, ప్రవీణ్ పాల్గొన్నారు.