పశ్చిమగోదావరి

అయి భీమవరంలో కంచిస్వాముల ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, డిసెంబర్ 5: కంచి పీఠాధిపతి జయేంద్రసరస్వతి, ఉత్తరాధికారి విజయేంద్రసరస్వతి సోమవారం అయి భీమవరంలోని చంద్రశేఖరేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున మహిళాభక్తులు స్వామీజీల అశీస్సులు అందుకున్నారు. అనంతరం వేద పాఠశాల విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. గతంలో జయేంద్ర సరస్వతి ఈ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమాల ఫొటోలను మాజీ ఎంపి కనుమూరి బాపిరాజు చూపించారు. అయి భీమవరంలో నూతనంగా నిర్మించిన శివాలయాన్ని విజయేంద్రసరస్వతి సందర్శించారు. ఆలయంలో నూతనంగా నిర్మించిన వివిధ మండపాలను ఆయన తిలకించారు. గ్రామ ప్రముఖులు స్వామిజీలకు ఘనంగా వీడ్కొలు పలికారు. కనుమూరి బాపిరాజు, అన్నపూర్ణమ్మ దంపతులు, కనుమూరి అబ్బాయిరాజు, కనుమూరి రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల పరిష్కారంలో శ్రద్ధ వహించాలి
నరసాపురం, డిసెంబర్ 5: మీకోసం కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆయన 20 ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకంతో దూర ప్రాంతాలనుంచి ప్రజలు తరలివస్తున్నారని, దీనికి అనుగుణంగా అధికారులు సమస్యలను సత్వరం పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఇఒ మద్దూరి సూర్యనారాయణమూర్తి, ఎడి మురళీకృష్ణ, డిఎల్‌పిఒ శ్రీరాములు, ఇరిగేషన్ డిఇఇ శ్రీమన్నారాయణ, పంచాయితీరాజ్ ఇఇ ఎస్ రఘుబాబు, మున్సిపల్ కమిషనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారిపై ఆటో బోల్తా
ఏలూరు, డిసెంబర్ 5 : జాతీయ రహదారిపై వెళుతున్న ఆటోకు కుక్క అడ్డురావడంతో సడన్ బ్రేక్ వేయడంతో బోల్తా పడి డ్రైవర్‌తో సహా 14 మందికి గాయాలయ్యాయి. కృష్ణాజిల్లా నందివాడ మండలం తెర్సి గ్రామానికి చెందిన 12 మంది మహిళలు బొమ్ములూరుకు చెందిన ఒక ఆటోలో పెదవేగి మండలం సీతాపురం గ్రామానికి ఆదివారం వెళ్లారు. అక్కడ జరుగుతున్న సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాల అన్నసమారాధనలో కూరగాయలు తరిగేందుకు వెళ్లిన ఈ బృందం అక్కడ పనులు ముగించుకున్న అనంతరం సోమవారం సాయంత్రం బయలుదేరి తమ గ్రామానికి వెళుతున్నారు. ఆటో దుగ్గిరాల సమీపానికి వచ్చే సరికి ఒక కుక్క ఆకస్మికంగా అడ్డు వచ్చింది. దీనితో డ్రైవర్ సత్యనారాయణ సడన్ బ్రేక్ వేయడంతో ఆటో బోల్తాపడింది. ఆటోలోని 12 మంది మహిళలు, డ్రైవర్ సత్యనారాయణ, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.