పశ్చిమగోదావరి

శ్మశానవాటికల అభివృద్ధికి రూ.10 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, డిసెంబర్ 8: రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో శ్మశానవాటిక అభివృద్ధికి రూ.10 లక్షల నిధులను అందజేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మండలంలోని గుణ్ణంపల్లి పంచాయతీ పరిధిలో తక్కెళ్లపాడు, కప్పలకుంట గ్రామాల్లో జరిగిన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా ఆయా గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అలాగే కప్పలకుంటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి ట్యాంకు, సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ కప్పలకుంట స్మార్ట్ విలేజ్‌గా కనిపిస్తోందని, దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. తక్కెళ్లపాడు గ్రామ అభివృదికి రూ.54 లక్షలు కేటాయిస్తున్నట్టు తెలిపారు. కప్పలకుంట నుండి మహదేవపురం, మారంపల్లి నుండి మహదేవపురం వెళ్లే రహదార్లను బిటి రోడ్లుగా మార్చడానికి రూ.3 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, గోపాలపురం, ఉంగుటూరు ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, గన్ని వీరాంజనేయులు, మల్లిపెద్ది వెంకటేశ్వరరావు, చెలికాని సోంబాబు, ఎంపిపి వడ్లపూడి ప్రసాద్, జడ్పీటీసీ మొగతడకల లక్ష్మీ రమణి, కొత్తపల్లి సుబ్బారావు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ కలలు నేడు సాకారం:మంత్రి దేవినేని
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కన్న కలలను ఆయన పునాదులు వేసిన పనులను ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో సాకారమవుతున్నాయని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మండలంలోని గుణ్ణంపల్లి పంచాయతీ పరిధిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన గురువారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన తక్కెళ్లపాడులో సిసి రోడ్లను ప్రారంభించారు. అలాగే పలు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్‌తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల కాలంలో ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.19 వేల కోట్లు వెచ్చించినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమ, జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎంపిపి వడ్లపూడి ప్రసాద్, జడ్పీటీసీ మొగతడకల లక్ష్మీరమణి, కొత్తపల్లి సుబ్బారావులతో కలిసి ఆయన గ్రామంలో పర్యటించారు.