పశ్చిమగోదావరి

కరెన్సీ కష్టాలకు నెల రోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 8: ప్రధాని నరేంద్ర మోదీ రూ.500, 1000 నోట్లను రద్దుచేసి నేటికి 30 రోజులు గడుస్తున్నా ప్రజల చిల్లర కష్టాలు తీరలేదు. నెల రోజులుగా తెరుచుకోని ఎటిఎంలు పట్టణంలో అనేకం ఉన్నాయి. బ్యాంకుల్లో నగదు తీసుకోవడానికి వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదటి వారంలో పెన్షన్లు, జీతాలు పడినా డబ్బులు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రజల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. రైతులు పండించిన పంటకు ఆన్‌లైన్ ద్వారా వచ్చిన సొమ్ము తీసుకోవడానికి కూడా అష్టకష్టాలు పడుతున్నారు. ఎటిఎంలు కోసం తాడేపల్లిగూడెం పట్టణ, పరిసరాల్లో ఉన్న ప్రజలు కూడా పట్టణంలో ఉన్న కొద్దిపాటి ఎటిఎంల వద్ద బారులు తీరుతున్నారు. ఎటిఎంల్లో రూ.2 వేలు నోటు తప్ప రూ. 500, 100 నోట్లు మచ్చుకైనా కనపడటంలేదు. బ్యాంకుల్లో వారానికి రూ.24 వేలు పరిధి నిబంధనను సడలించినప్పటికీ రూ.4 వేలకు మించి అందజేయలేని పరిస్థితుల్లో బ్యాంకులు ఉండటం శోచనీయం. 2వ శనివారం, ఆదివారం, సోమవారం సెలవులు రావడంతో గురువారం బ్యాంకుల వద్ద రద్దీ మరింత అధికంగా ఉంది. పట్టణంలో స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచి వద్ద, స్టేషన్ రోడ్డులో పంజాబ్ నేషనల్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకుల ఎటిఎంలు పనిచేయడంతో ప్రజలు బారులు తీరారు.

ధాన్యం త్వరగా జాగ్రత్త చేసుకోండి..
-మట్టిగోడల ఇళ్లవారు అప్రమత్తంగా ఉండాలి
-తుపాను ప్రభావంపై తహసీల్దార్ తిలక్ సూచనలు
వీరవాసరం, డిసెంబర్ 8: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారిన దృష్ట్యా రైతాంగం త్వరగా పంటను జాగ్రత్త చేసుకోవాలని తహసీల్దార్ ఎంవి తిలక్ కోరారు. గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఈనెల 11వ తేదీ నుంచి తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు పై అధికారుల నుంచి సమాచారం వచ్చిందన్నారు. దీని దృష్ట్యా మండలంలోని రైతులు వరిచేలల్లో ఉన్న ధాన్యాన్ని, వరికుప్పలను త్వరగా జాగ్రత్త చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే పూరిగుడిసెలు, మట్టిగోడలు గల ఇళ్లల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలపడానికి తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశామన్నారు.