భక్తి కథలు

కాశీఖండం 111

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భ్రూమధ్య దృష్టికలవారున్ను, పంచాక్షరీ మంత్ర జప పరాయణులు అయిన ప్రమథులు కొలిచిరాగా, పార్వతీదేవితో నందికేశ్వరుణ్ణి ఆరోహించి, ఆనందలీలతో, సకల భువనాధీశ్వరుడైన పరమశివుడు సమగ్ర మహిమతో ఆకాశమార్గాన మందరగిరికి ప్రయాణం అయ్యాడు.
అంతేకాక సారస్వతేశ్వరుడు, రత్నజాతీశ్వరుడు, శైలేశ్వరుడు, త్రిపురేశ్వరుడు, బాణేశ్వరుడు, ప్రహ్లాదేశ్వరుడు, భృంగీశ్వరుడు మొదలైన - కాశీ క్షేత్రంలోని దివ్యజ్యోతిర్లింగమూర్తులు, శతములు, సహస్రాలు, లక్షలు, కోట్లు, అర్బుదాలు, న్యర్బుదాలు అయిన సంఖ్యలు కలవాళ్ళు విశే్వశ్వరశ్రీమన్మహాదేవుని వెన్ను తవిలి నడిచారు. లోలార్క కేశవులున్ను, డుంఠి విఘ్నేశ్వరుడున్ను, శ్రీ విశాలాక్షియున్ను, దండపాణి ప్రయాణం అయారు. దేవతలందరు ఇరువంకల, వెనుక కూడి ఏతెంచుతూ వుండగా కాశీనాథుడు లవణ సముద్రం పరివేష్టించి వున్న జంబూద్వీపాన్ని దాటి, ఇక్షురస జలధిచే పరివేష్టితం అయిన ప్లక్షద్వీపాన్ని గడచి, సురాసముద్ర వేష్టిత శాల్మలీ ద్వీపాన్ని అధిగమించి, ఘృతసముద్ర ముద్రిత మేర అన కుశద్వీపాన్ని చేరి, ఆ దీవికి రత్నాలు పొదిగిన కిరీటంలాగు ప్రకాశించే మందరాచలంలో బంగారు, వెండి, మాణిక్యమయం అయిన గుహలో శివుడు నివసించాడు.
ఈ కరణి కాపురం వుండి- చంద్రకళాధరుడు ఆ మందరాచలంలో మణిమయ గుహామందిరంలో విహరిస్తూ గిరి రాజకుమారిని కాంచి ఈ విధంగా పలికాడు.
ఓ పద్మాక్ష్మీ! ఇంద్రుడి ఏనుగు ఐరావత కుంభస్థలంలో నీ పీనవక్షస్స్థలం సరి వస్తుంది. పారిజాత తరుకిసలయాలతో నీ పాణి పల్లవాలు ప్రతివస్తాయి. కౌస్త్భు మణిశిల కందళంతో నీ నునులేత ఎర్రని పెదవి సాటివస్తుంది. అళివినీల కుంతలా! అమృతప్రవాహంతో నీ ముఖ వినిర్గత మధుర వాక్కు ఎనవస్తుంది. ఈ ఉపమాన వస్తువులు సముద్రంలో నీ అవయవాలకి ఉదయించాయి. ఈ మహామందరాచలం కవ్వంగ సురాసురులు సంప్రీతితో త్రచ్చడంవల్ల పుట్టాయి సుమా!
కిన్నర కంఠీ! పార్వతీ! పర్వత సానువు వెంబడి తీవ్రమైన ఘర్షణచే, ఒక్కుమ్మడిగా తీగ చుట్టుకోవడంవల్ల ఏర్పడిన ఒత్తుడు రేకలలాగున వున్న వాసుకి అనే కవ్వపు త్రాడు యొక్క వలయాకారపు ఒత్తిళ్ళనుంచి సెలయేటి జలాలు పై నుంచి దిగబారగా పాల సంద్రాన్ని మథించే సమయంలో సర్పరాజు వాసుకి చుట్టుకొన్న రీతిగా కనవస్తుంది. ఈ మందారాచలాన్ని చూడు-
ఏ మహాతరంగిణి చంద్ర సూర్య స్వరూపాలైన పెద్ద మెట్టులు దిగి, ఆకాశం యొక్క సర్వ సమగ్రభావాన్ని పుక్కిట పట్టి గ్రహాలని, తారలని, నక్షత్ర గణాలన్ని ఆస్ఫాలించి, శశిమకుటుడైన శివుడి వౌళిని వెల్లిగొలిపి మంచు కొండ రాచవారి ఔదలమెక్కి, కనఖలక్షేత్రాన్ని కౌగిలించుకొని, కాశీనగర సమీప ప్రదేశాన్ని డాసి, ఏడు వందల త్రోవలుగా సముద్రాన్ని చేరిందో ఆ మహాతరంగిణి- ఆ గంగానదికి ఇరువంకల విడిదిచేసి వున్న నలు దిక్కుల దేవతలున్ను ఆకాశ మార్గంలో శంకరుణ్ణి కలుసుకోగోరి ఆనందంతోమందర గిరికి అరిగారు.
ఆ తరిని జంజూద్వీప మధ్య ప్రదేశంలో వాసికాంచిన ఆ దివోదాసు ఆజ్ఞ చేత సందులలోను, గొందులతోను కుంటినిగాని, కుదిపినిగాని, పేదనిగాని, అనాథనిగాని ఉండనీయలేదు.
‘కోయిల’ పుణ్యస్థలంలోను, వేంకటాచలంలోను, కంచిలోను, నూట ఎనిమిది తిరుపతుల్లోను, కుంభకోణం మున్నయిన పుణ్యక్షేత్రాల్లోగాని విష్ణువు అర్చావిగ్రహాలు మటుమాయమై ఏ యెడకి పోయాయో కదా!

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి