రంగారెడ్డి

కందిపంటకు కరవైన మద్దతు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జనవరి 12: కందుల పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు గురువారం ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్‌లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. కానీ కందులు క్వింటాలుకు మద్దతు ధర 5050రూపాయల ప్రకారం ఖరీదు చేయాల్సి ఉండగా ఖరీదు చేయడం లేదని బాలానగర్ మండలం పెద్దరేవల్లి, హేమాజిపూర్, కేశంపేట మండలం అల్వాల, ఇప్పలపల్లి, పాపిరెడ్డిగూడ, కొందుర్గు మండలం విశ్వనాథ్‌పూర్, లాల్‌పహాడ్, వెంకిర్యాల, ఆగిర్యాల గ్రామాల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం తమ వ్యవసాయ పొలాల్లో పండించిన కందుల పంటను విక్రయించుట కొరకు షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్‌కు తీసుకువచ్చామని, కానీ కందుల కొనుగోలు కేంద్రంలో తాము తెచ్చిన కందుల పంట నాణ్యత లేదని, అందువల్ల తీసుకోలేమని, 5050రూపాయలకు తక్కువ ధరకైనా విక్రయించుటకు సిద్దంగా ఉన్నప్పటికి వ్యాపారస్తులు కానీ, కొనుగోలు అధికారులు కానీ తీసుకునేందుకు నిరాకరించారు. దూర గ్రామాల నుండి తెచ్చిన కందులు తిరిగి గ్రామాలకు తీసుకొని వెళ్లలేమని, ధర తక్కువ అయినా 4500 క్వింటాల్ ప్రకారం విక్రయించుటకు సిద్దంగా ఉన్నప్పటికి వ్యాపారస్తులు, అధికారుల్లో స్పందన లేదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముత్తూట్, మణిపురం ఫైనాన్స్ కంపెనీలలో
నకిలీ బంగారం తాకట్టు పెట్టిన ముఠా అరెస్ట్

వనస్థలిపురం, జనవరి 12: నగరం లోని పలు ఫైనాన్స్ కంపెనీలలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని మోసాలు చేసి తప్పించుకుని తిరుగుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను ఎల్బీనగర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి లక్షా 90వేల రూపాయల నగదు, ఒక లామినేషన్ మిషన్, ఆరు సెల్‌ఫోన్‌లు, ఒక నకిలీ బంగారు గాజును స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎల్బీనగర్ సిపి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసిపి వేణుగోపాల్ రావు మాట్లాడుతూ గుజరాత్‌కు చెందిన మస్తాన్(34) సికింద్రాబాద్‌లో హార్డ్‌వేర్ షాపును నడుపుతున్నాడు. వ్యాపారం నష్టం రావడంతో మరో వ్యాపారం కోసం వెతుకుతుండగా అదే సమయంలో సికింద్రాబాద్‌లో సిల్వర్ వ్యాపారం చేసే దావూద్‌తో పరిచయం ఏర్పడింది. వనస్థలిపురంలో నివాసం ఉంటూ సిల్వర్ వ్యాపారం, పాన్‌బ్రోకర్ యజమానులు సుభాన్(30), సహిమాన్ ఖాన్(22) సికింద్రాబాద్‌లోని దావూద్ వద్దకు వస్తుండేవారు. వీరి స్నేహం బలపడింది. అందరు కలిసి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని ఆలోచించారు. పథకం ప్రకారం ఇత్తడి అభరణాలను తయారు చేసి వాటికి మూడు సార్లు బంగారు పూత పూయించి ఎవరికి అనుమానం రాకుండా బంగారంలాగా తయారు చేశారు. వాటిని నగరంలోని 11 ముత్తూట్, మణిపురం ఫైనాన్స్ కంపెనీలలో తాకట్టు పెట్టి 12లక్షల రూపాయలు తీసుకుని తప్పించుకుని తిరుగుతున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడు కేసులు నమోదు అయ్యాయి. బుధవారం ఈ ముఠా సభ్యులు నగరంలోని ఒక శాఖలో నకిలీ బంగారు అభరణాలు తాకట్టు పెట్టడానికి వచ్చిన సమయంలో అనుమానం వచ్చిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఎస్‌ఒటి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తప్పును ఒప్పుకున్నారు. వారి నుంచి ఉన్న డబ్బులను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఓటి ఇన్‌స్పెక్టర్ నర్సింగ్‌రావు, ఎస్‌ఐ ఆంజనేయులు పాల్గొన్నారు.