పశ్చిమగోదావరి

ముందు జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 21 : ఈసారి రబీ సీజన్‌కు ముందు నుంచి వంతుల వారీ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ ఏడాది కొంత వరకు గోదావరి జలాల అందుబాటు ప్రస్తుతానికి సంతృప్తికరంగానే వున్నా గత రబీ సీజన్‌లో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సారి జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్తగా ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. దీనిలో భాగంగా ఆదివారం నుంచి జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌కు వంతుల వారీ విధానం అమలుకు నిర్ణయించింది. అలాగే దీని నిమిత్తం ప్రాంతాల వారీగా ఈ విధానం అమలు ప్రణాళికను కూడా యంత్రాంగం విడుదల చేసింది. కాగా గత రబీ సీజన్‌లో తొలి సమయానికి గోదావరి జలాలు అందుబాటు సంతృప్తికరంగా వుండటంతో మొత్తం ఆయకట్టుకు నీరు అందించేందుకు అప్పట్లో యంత్రాంగం సిద్ధమైంది. అయితే ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలు రైతాంగానికి ఇబ్బందికరంగా మారగా యంత్రాంగాన్ని ఈ పరిస్థితులు ఇరుకునపెట్టాయనే చెప్పుకోవాలి. అప్పట్లో స్వయంగా జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ క్షేత్రస్థాయిలో పలుమార్లు పర్యటించి పరిస్థితిని చక్కదిద్దేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొన్ని శివారు ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. తొలుత వున్న పరిస్థితికి ఆ తరువాత రానురాను మారిన జలాల అందుబాటుకు పొంతన లేకపోవడంతో అటు వ్యవసాయ శాఖాధికారులు, ఇటు రైతులు కూడా అయోమయ పరిస్థితిని ఎదుర్కొన్నారు. అయితే పూర్తి ఆయకట్టులో అప్పట్లో నాట్లు వేయకపోవడం కొంత వరకు ఉపశమనాన్ని కలిగించగా వేసిన చోట్ల మాత్రం ఈ ఇబ్బందులు తప్పలేదు. వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది రబీ సీజన్ తొలి నుంచి ముందు జాగ్రత్తగా వంతుల వారీ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. వాస్తవానికి రబీలో వంతుల వారీ విధానం రూపకల్పనకు జిల్లాయే కీలకపాత్ర పోషించడమే కాకుండా నీటి యాజమాన్య పద్దతులను అవలంభించి తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని సాధించగలమన్న ఫలితాన్ని కూడా రాష్ట్రానికి అందించిందనే చెప్పాలి. అప్పట్లో ఇది ఒక చరిత్రగానే నిలిచిపోయింది. ఆ అనుభవాల నేపధ్యంలో ఆ తరువాత కాలంలో కూడా జలాల అందుబాటు ఏ మాత్రం సందేహాస్పదంగా కనిపించినా వంతుల వారీతో సమర్ధ నీటి యాజమాన్య విధానాలతో రబీ పంటను కాపాడుకునే ప్రయత్నాలు జరుగుతూనే వచ్చాయి. గత ఏడాది దానికి భిన్నంగా కొంత వ్యవహారం నడిచినప్పటికీ వాస్తవానికి ఆ సమయంలో జలాల అందుబాటు విషయంలో అధికారుల అంచనాలు ఒకరకంగా వుంటే రాజకీయ నేతల ప్రయత్నాలు మరో విధంగా ఉండడంతో పొంతన లేక చివరి సమయంలో ఇబ్బందులు తలెత్తాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. వీటిని దృష్టిలో ఉంచుకునే ఈసారి ముందు నుంచి ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని నిర్ణయించారు. దీనివల్ల రానున్న రోజుల్లో జలాల అందుబాటు ఏ మేరకు తగ్గినా అందుబాటులో వున్న జలాలతో రబీ పంటను దక్కించుకోగలిగే అవకాశం వుంటుంది. రబీ పంట ఫసలీ 1426 ప్రకారం ఈ వంతుల వారీ విధానాన్ని నిర్ణయించారు. మొత్తం మీద ఈ ముందు జాగ్రత్త రైతుల విషయంలో మంచి ఫలితాలనే అందిస్తుందని భావించవచ్చు.