నిజామాబాద్

రైతాంగ పోరాటాలు తీవ్రతరం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమ్‌గల్, జనవరి 22: రైతాంగ సమస్యలను ఎజెండాగా మల్చుకుని రైతాంగ పోరాటాలను తీవ్రతరం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షుడు కె.గంగాధర్ పిలుపునిచ్చారు. ఆదివారం భీమ్‌గల్ మండల కేంద్రంలోని ఎఐకెఎంఎస్ కార్యాలయంలో ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు ఎస్.సురేష్ అధ్యక్షతన డివిజన్ స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గంగాధర్ మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం పూర్తిగా రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు రైతు సంక్షేమమే తమ ధ్యేయమని చెప్పుకున్న పాలకులు, నేడు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ వారిని పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదన్నారు. అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలోని కెసిఆర్ సర్కార్ కూడా బహుళ జాతి సంస్థలకు అనుకూలంగా భూసేకరణ చట్టాన్ని సవరణ చేస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టిందని ఆక్షేపించారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారని, ఈ సమస్య నుండి అన్నదాతను గట్టెక్కించేందుకు ప్రభుత్వం చొరవ చూపకపోవడం శోచనీయమన్నారు. రైతుల రుణ మాఫీ ఇప్పటికీ పూర్తిగా మాఫీ కాకపోవడం ప్రభుత్వ తీరును చాటుతోందన్నారు. జొన్న, పసుపు, సన్న ధాన్యం సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని మెరుగుపర్చి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటమే ఏకైక మార్గమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎఐకెఎంఎస్ జిల్లా కార్యదర్శి కె.రాజేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు కిషన్, ఆర్మూర్ డివిజన్ ఉపాధ్యక్షుడు రిక్క దామోదర్, నాయకులు అశోక్, బాలయ్య, నారాగౌడ్, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

విఒఎ ఆత్మహత్యాయత్నం
సధాశివనగర్, జనవరి 22: మండల కేంద్రంలోని పాత గ్రామ పంచాయతీ వద్ద ప్రగతి గ్రామ సంఘం విఒఎ తోకల పద్మావతి ఆదివారం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. విఒఎలు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గత 22రోజులుగా విఒఎల సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేస్తున్నామన్నారు. ఆదివారం మండల కేంద్రంలో భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎపిఎం విఒఎలతో మాట్లాడుతూ, సమ్మెను విరమించి విధులకు హాజరు కావాలని సూచించారు. లేనిచో పోలీసుల సహకారంతో గ్రామ సంఘాల్లో పనులు కొనసాగిస్తామని పేర్కొన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన విఒఎ పద్మావతి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. సంఘటన స్థలానికి ఎస్‌ఐ నాగరాజు తన సిబ్బందితో చేరుకొని 108లో విఒఎను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, విఒఎల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గౌస్‌ఖాన్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎపిఎం సాయిలుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విఒఎలు, గ్రామ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.