నిజామాబాద్

వ్యవసాయంపై మాట్లాడే అర్హత కాంగ్రెస్, టిడిపిలకు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఫిబ్రవరి 21: వ్యవసాయంపై మాట్లాడే అర్హత కాంగ్రెస్, టిడిపి పార్టీలకు లేదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ మార్కెట్ యార్డును అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, రూరల్ శాసన సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్‌లు సందర్శించి, పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో వ్యవసాయమే దండగా అని పేర్కొనడం జరిగిందని, ముఖ్యంగా టిడిపి హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయమే దండగా అంటూ పేర్కొనడం జరిగిందని, ఈ విషయం టిడిపి నాయకులకు తెలియంది కాదన్నారు. సోమవారం నిజామాబాద్ మార్కెట్ యార్డును సందర్శించిన టి.టిడిపి అధ్యక్షుడు రమణ, టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, రాజధానిలో సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావులు కూర్చుని ఉంటే రైతులు ఎదుర్కొనే సమస్యలు ఎలా తెలుస్తాయంటూ పేర్కొనడం జరిగిందన్నారు. మరీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఏం జరిగిందో మీకు తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాకే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుందన్నారు. రూరల్ శాసన సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూర్ జిల్లాలో మిర్చి ధర గణనీయంగా పడిపోయిందని, ముందుగా ఆ విషయాన్ని టిడిపి నాయకులు గుర్తెరిగా మాట్లాడాలని హితవు పలికారు. ఆ తర్వాతే తెలంగాణలోని రైతులు, వ్యవసాయం గురించి మాట్లాడాలని అన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను నిల్వ చేసుకునేందుకు అవసరమైన గోదాములను లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించడం జరిగిందన్నారు. ఇందులో రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకుంటే, 75శాతం విలువపై రుణాలను సైతం అందిస్తున్న ఘనత తెరాసకే దక్కిందన్నారు. సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను సరఫరా చేస్తున్నామని అన్నారు. అదే విధంగా వ్యవసాయానికి 9గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత ఒక్క టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీని సందర్శించిన వారిలో తెరాస నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

మార్చి 7న ఎంపిటిసి, మూడు వార్డుల సభ్యులకు ఎన్నికలు
నేటి నుండి నామినేషన్ల స్వీకరణ
నందిపేట, ఫిబ్రవరి 21: నందిపేట మండలంలో ఖాళీగా ఉన్న ఒక ఎంపిటిసి స్థానంతో పాటు మరో వార్డు సభ్యుల స్థానాలకు మార్చి 7వ తేదీన ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.బాలిక్ అహమద్ తెలిపారు. మండలంలోని వెల్మల్ ఎంపిటిసి స్థానంతో పాటు అయిలాపూర్ గ్రామ పంచాయతీలో 7వ వార్డుకు, బాద్గుణ జిపిలో 4వ వార్డుకు, వెల్మల్‌లో 11వ వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్నికల నియమావళిలో భాగంగా ఈ నెల 22నుండి 25వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. అదే విధంగా 26న స్కూృట్నీ, 27న అభ్యంరాల స్వీకరణ, 28న అప్పీల్‌లు, మార్చి 2న ఉప సంహరణతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరుగుతుందన్నారు. 7వ తేదీన ఉదయం 7గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, 9వ తేదీన ఓట్ల లెక్కింపు, అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడించడం జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అహమద్ తెలిపారు.