యువ

నోసకిల్‌తో కాలుష్యానికి చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెచ్చుమీరుతున్న కాలుష్యం మనిషిని వ్యాధుల బారిన పడేస్తోంది. ఆ మధ్య ఢిల్లీ నగరాన్ని కాలుష్య మేఘాలు కప్పేయడంతో పాఠశాలలకు సైతం సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాతావరణ కాలుష్యాన్ని తట్టుకునేందుకు మార్కెట్లో మాస్క్‌లు అందుబాట్లో ఉన్నా, వాటివల్ల ప్రయోజనం అంతంతమాత్రమే. అయితే ఢిల్లీ-ఐఐటికి చెందిన రీసెర్చర్లు కొందరు ఈ దిశగా చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వారు కనిపెట్టిన ‘నోసకిల్’ అనే చిన్నపాటి మాస్క్ అద్భుతంగా పనిచేస్తున్నట్టు పరీక్షల్లో తేలింది. ఇది కాలుష్యం కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న భారతీయులకు శుభవార్తే.
ఐఐటి- ఢిల్లీకి చెందిన పరిశోధకులు దేవయాన్ సాహా, శశి రంజన్ ఈ నోసకిల్‌కు రూపకర్తలు. ఇదో చిన్న పరికరం. ఎన్నిసార్లయినా వాడొచ్చు. నోసకిల్... స్లీప్ ఆప్నియాతో బాధపడేవారు వాడే నోస్ ప్లగ్స్‌లా ఉంటుంది. ఇందులో కాట్రిడ్జ్‌లు ఉంటాయి. కాలుష్యాన్ని ఫిల్టర్ చేసే ఈ కాట్రిడ్జ్‌లను ప్రతి ఎనిమిది గంటలకోసారి మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ రీసెర్చర్ల ద్వయం గతంలో స్టాన్‌ఫోర్డ్-ఇండియా బయోడిజైన్ ఫెలోషిప్ చేశారు. వారికి అప్పుడు వచ్చిన ఈ ఆలోచన ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చిందట. తాము కనుగొన్న నోసకిల్ గురించి దేవయాన్ సాహా మాట్లాడుతూ ‘ముక్కుకు తగిలించుకునే ఫేస్‌మాస్కుల్లో ఒక పొర ఉంటుంది. ఈ పొరకుండే చిన్నపాటి రంధ్రాలు కాలుష్య కణాలను అడ్డుకుంటాయి. అయితే ఈ రంధ్రాల ద్వారా గాలి పీల్చడం ఇబ్బందికరమైన విషయమే. మేం కనిపెట్టిన నోసకిల్‌లో పొర ఉండదు. దాంతో గాలి పీల్చుకోవడం సాఫీగా సాగిపోతుంది. అలాగే కాలుష్యాన్ని 90 శాతం వరకూ అరికడుతుందని మా ప్రయోగాల్లో తేలింది’ అని చెప్పారు. ధర విషయానికొస్తే, ప్రస్తుతం చెలామణిలో ఉన్న రీ యూజబుల్ మాస్కుల ధరలో మూడోవంతు ధరకే నోసకిల్ లభ్యమవుతుందట. ఈ సంవత్సరాంతంలో నోసకిల్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.