S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్నూర్ మండలంలో నీటమునిగిన గ్రామాలు

నిజామాబాద్ : మద్నూర్ మండలంలో లెండివాగు ఉధృతికి ఎన్‌గురా, ఇలుగాం, కుర్ల, గోజేగాం, మదన్ ఇప్పర్గా గ్రామాలు శనివారం నీట మునిగాయి. భారీ వర్షాలకు వందల ఎకరాల్లో పంటపొలాలు నీటి మునిగాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నందిగామలో నాటు తుపాకుల కలకలం!

నందిగామ : నాటుతుపాకులు కొనుగోలు చేశారన్న అనుమానంతో పోలీసులు కృష్ణా జిల్లా నందిగామలో శనివారం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకేసులో నిందితులను హతమార్చేందుకు తుపాకులు కొనుగోలు చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.

వరద బాధితులకు ‘మా’ చేయూత

హైదరాబాద్‌: నగరంలోని వరద బాధితులకు 'మా' ( మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ) ఆధ్వర్యంలో శనివారం ఆహారం, తాగునీటిని పంపిణీ చేస్తున్నారు. 'మా' అధ్యక్షడు రాజేంద్రప్రసాద్, శివాజీరాజా ఆల్విన్‌ కాలనీలో వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. మంచు లక్ష్మీ, మనోజ్, నవదీప్ తదితరులు నగరంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

విత్తనాలపై రాయితీ 80 శాతానికి పెంపు

విజయవాడ: వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఇచ్చే విత్తనాలపై రాయితీను మరింతగా పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంవెల్లడించింది. విత్తన రాయితీని 33 శాతం నుంచి 80శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ రాయితీ విత్తనాలను రేపట్నుంచే పంపిణీ చేయనున్నట్లు రైతులకు ఉపశమనాన్ని ఇచ్చే కబురు అందించింది.

లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

హైదరాబాద్‌: నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ బృందాలు శనివారం రంగంలోకి దిగాయి. భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న నిజాంపేట, హకీంపేట, ఆల్వాల్‌, బేగంపేట సహా పలు ప్రాంతాల్లో ఈ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

భారీ వర్షాలకు మెదక్‌లో ఇద్దరు బలి

మెదక్: నారాయణ్‌ఖేడ్‌ మండలం అనంతసాగర్‌లో వాగులో చిక్కుకున్న శ్రీనివాస్ అనే యువకుడు శనివారం గల్లంతయ్యాడు. కంగ్టి మండలం నాగూర్‌బిలో భారీ వర్షాలకు గోడ కూలి ఒక వృద్ధుడు మృతి చెందాడు.

కేజ్రీవాల్‌కు అధికార దాహం : అన్నాహజారే

ఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అధికార దాహం ఏర్పడిందని, కేజ్రీవాల్ కేబినెట్‌లోని మంత్రులను వరుసబెట్టి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సామాజిక కార్యకర్త అన్నాహజారే శనివారం విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ పనితీరుకు తాను దు:ఖిస్తున్నానని, ఆమ్ ఆద్మీ పార్టీ దేశానికి మేలు చేస్తుందనుకోవడం తన తప్పన్నారు.

పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు : కేసీఆర్‌

హైదరాబాద్‌: వర్షాల నేపథ్యంలో వాటిల్లిన పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారుల్ని ఆదేశించారు. దిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి శనివారం మంత్రులు తలసాని, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, సీఎస్‌ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మ సహా పలువురు ఉన్నతాధికారులతో వరదల పరిస్థితిపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 26న మంత్రివర్గ సమావేశం నాటికి పూర్తిస్థాయి అంచనాలు రూపొందించాలన్నారు. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్ష సూచన ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎమ్మెల్యేను అడ్డుకున్న ఎంఐఎం కార్యకర్తలు

హైదరాబాద్: బస్తీ సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ను రాజేంద్రనగర్‌లో శనివారం ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

తెలంగాణ, కోస్తాంధ్రకు మ‌రో ఐదు రోజులు వ‌ర్ష సూచ‌న‌

హైద‌రాబాద్‌: తెలంగాణ, కోస్తాంధ్రల్లో మరో ఐదు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం ప్రకటించింది. రాయలసీమలో రెండు రోజులపాటు చెదురుమదురు వర్షాలు, తేలికపాటి జల్లులు పడతాయని వివరించారు.

Pages