S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో తగ్గిన మాతాశిశు మరణాలు

శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపించడం వల్లే మాతాశిశు మరణాలు బాగా తగ్గాయని వైద్య ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం శ్రీ కాళహస్తి ఏరియా ఆసుపత్రిలో జరిగిన డయాలసిస్ కేంద్రం ప్రారంభోత్సవంలో అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితోపాటు మంత్రి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతాశిశు మరణాలలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా ఉండేదని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపించడం వల్ల మాతాశిశు మరణాలు బాగా తగ్గాయని తెలిపారు.

మూడేళ్ల తర్వాత తెరుచుకున్న సింగూర్ గేట్లు

సంగారెడ్డి, సెప్టెంబర్ 23: అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంజీర నది పరివాహక ప్రాంతంలో పుష్కళంగా వర్షాలు కురియడంతో సింగూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. ప్రాజెక్టులో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోకముందే ఎగువ నుంచి వస్తున్న నీటిని బేరీజు వేసుకున్న నీటి పారుదల శాఖ అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడానికి సిద్దమయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నాలుగు గేట్లను ఎత్తి దిగువకు 32 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు.

కుంభవృష్టి

గజ్వేల్, సెప్టెంబర్ 23: గజ్వేల్ నియోజకవర్గంలో సంవృద్దిగా వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు జలకళలాడుతున్నాయి. గజ్వేల్, వర్గల్, ములుగు, జగదేవ్‌పూర్, తూప్రాన్, కొండపాక మండలాల పరిధిలోని 5వందలకుపైగా చెరువులు, కుంటలలో సంవృద్దిగా వరద నీరు వచ్చి చేరడంతో మత్తడుల నుండి పరవళ్ళు తొక్కుతున్నాయి. ముఖ్యంగా గత ఆరేడు సంవత్సరాలుగా వరుణుడు కరుణించక చెరువులు, కుంటలు ఎడారుల్లా దర్శణమివ్వగా ప్రస్థుత వర్షాకాలంలోని చివరి కార్తెలో వరుణుడు కరుణించడంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది.

కొడుకును రక్షించబోయి దుర్మరణం తండ్రి దుర్మరణం

కొల్చారం, సెప్టెంబర్ 23: కన్న కొడుకును రక్షించబోయి తండ్రి మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం కొల్చారం మండలం కొంగోడ్ గ్రామ శివారులోని అల్లువాని బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. మెదక్ పట్టణానికి చెందిన నాయిని శ్రీనివాస్ వెల్దుర్తి మండలం దామరంచ గ్రామానికి కారును కిరాయికి తీసుకొని వచ్చారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అల్లువాని బ్రిడ్జి నిండుగా పారుతున్న నేపథ్యంలో కారు బ్రిడ్జి మధ్యలోకి రాగానే నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది.

చోటు లేక.. ప్రాణంతో మిగిలాడు!

మెదక్, సెప్టెంబర్ 23: భారీ వర్షాలతో గత అర్ధరాత్రి ఇల్లు కూలి తల్ల్లీబిడ్డలు మరణించిన సంఘటన మెదక్ పట్టణాన్ని దుఃఖ సముద్రంలో ముంచింది. పట్టణంలోని గోల్కొండ వీధిలో ఇందిరమ్మ పథకం ద్వారా నిర్మించిన ఇల్ల్లు వర్షానికి కూలి గుడిసెపై పడింది. దీంతో గుడిసెలో నిద్రిస్తున్న అస్తగ్రల కళావతి (45), ఆమె కుమార్తె తులసీ భవాని (8) మరణించారు. కుమారుడు దుర్గాప్రసాద్ తీవ్రంగా గాయపడగా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా కళావతికి చిన్న కుమారుడు కృష్ణ 10వ తరగతి చదువుతున్నాడు. ఇంటిలో స్థలం లేక అమ్మమ్మ ఎల్లమ్మ ఇంటికి వెళ్లి కృష్ణ నిద్రించాడు. దాంతో జరిగిన ప్రమాదం నుంచి కృష్ణ తప్పించుకున్నాడు.

అధికారులూ..పారాహుషార్

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 23: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తతతో ఉండాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశపై పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇరిగేషన్, ట్రాన్స్‌కో, పశు సంవర్ధక శాఖ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రైతులకు దేవాలయాలు వ్యవసాయ మార్కెట్లు

జగిత్యాల, సెప్టెంబర్ 23: రైతాంగానికి వ్యవసాయ మార్కెట్లు దేవాలయాల వంటివని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం జగిత్యాల ఎఎంసి నూతన పాలకవర్గ ప్రమాణస్వీకరణ మహోత్సవ కార్యక్రమానికి ఎంపి కవిత ముఖ్యఅతిధగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్ర భుత్వం ఏర్పడిన తరువాత మార్కెట్ పాలకవర్గాల్లో మహిళలకు ప్రాతిని ధ్యం కల్పించిన ఘతన కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ఇదివరకు వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాలో అగ్ర, సంపన్న వ్యక్తులు మాత్రమే చైర్మన్లుగా కొనసాగారని తెలిపారు.

ఓరుగల్లులో జోరువాన..

వరంగల్, సెప్టెంబర్ 23: జిల్లాలో గత కొద్ది రోజులుగా విస్తారంగా కురుస్తు న్న వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది స్థానికంగా ఉండి సమస్యాత్మక ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో పునరావాసం ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ తన చాంబర్‌లో పోలీసు కమిషనర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్‌తో పాటు జిల్లా ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వర్షం పరిస్థితులను సమీక్షించారు.

బాసరలో భారీ వర్షం

బాసర, సెప్టెంబర్ 23: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా బాసరలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. గ్రామంలోని పలు ప్రైవేటు పాఠశాలలు వర్షం కురవడంతో నీటిలో మునిగాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. గ్రామంలోని రవీంద్రపూర్, మైలాపూర్, శారదానగర్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ఇబ్బందుల పాలయ్యారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
* కలెక్టర్ జగన్మోహన్

ఇందూర్‌ను ముంచెత్తిన భారీ వర్షం

నిజామాబాద్, సెప్టెంబర్ 23: ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు నిజామాబాద్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. గడిచిన వారం రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షంతో ఎటుచూసినా ప్రధాన రహదారులు మొదలుకుని పంట పొలాలు, మైదాన ప్రాంతాలు సైతం పెద్దఎత్తున వర్షపు జలాలు నిలిచి తటాకాలను తలపిస్తున్నాయి. మునుముందు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడంతో ఈ వానల ఉద్ధృతి వల్ల ఎక్కడ పెనుముప్పు వాటిల్లుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

Pages