S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లిబియా నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ప్రొఫెసర్లు

హైదరాబాద్‌: ఏడాదికి పైగా లిబియాలో ఉగ్రవాదుల నిర్భందంలో ఉండి ఇటీవలే విడుదలయిన ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరామకిషన్‌ శుక్రవారం అర్థరాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. గతేడాది జులై 29న వీరిద్దరినీ ఉగ్రవాదులు అపహరించిన సంగతి తెలిసిందే. నాచారం రాఘవేంద్ర కాలనీలోని స్వగృహానికి గోపీకృష్ణ, తిరుమలగిరిలోని స్వగృహానికి బలరాంకిషన్‌ చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

కాశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం : 23మంది మృతి

ముజఫరాబాద్‌: పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ముజఫరాబాద్‌కు సమీపంలోని నౌసెహ్రీ ప్రాంతంలో శనివారం ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 23 మంది మృతిచెందారు. ముగ్గురు ప్రయాణికులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. మూడు మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. నదిలో ప్రవాహం ఉండటంతో బస్సుతో ప్రయాణికులు కొట్టుకుపోయినట్లు పోలీసులు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు : ఇద్దరు మావోయిస్టులు మృతి

దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో శనివారం ఉదయం మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

ఆక్వా హబ్‌గా ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: రానున్న రోజుల్లో అక్వా కల్చర్ ఎగుమతుల్లో విదేశాలతో పోటీ పడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సముద్ర ఉత్పత్తులకు విలువల జోడింపు చేయడం ద్వారా అధిక ఆదాయం సాధించే దిశగా దృష్టి సారిస్తున్నామన్నారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో మత్స్య ఉత్పత్తులపై ప్రచారం కల్పించే యోచన ఉందని తెలిపారు. 20వ ఇండియన్ ఇంటర్నేషనల్ సీఫుడ్ షో నగరంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సీఫుడ్ షోలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశం నుంచి ఎగుమతి అవుతున్న సముద్ర ఆహార ఉత్పత్తుల్లో మూడో వంతు రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్నాయని తెలిపారు.

క్రమబద్ధీకరణతో నిరుపేదలకు మేలు

గాజువాక/అక్కిరెడ్డిపాలెం, సెప్టెంబర్ 23: పట్టణ పరిధిలో గల ప్రభుత్వ భూముల్లో స్థలాలను అక్రమించుకుని భవనాలు నిర్మించుకున్న సుమారు 60 వేల మందికి మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు జీవోలను విడుదల చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. పరవాడ వద్ద నిర్మించిన జెఎన్‌ఎన్‌యఆర్‌ఎంకాలనీని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పట్టణ పరిధిలో గల నిరుపేదలు ప్రభుత్వ భూమిని అక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలను చేపట్టినప్పటికీ నేటికీ వారికి పట్టాలను మంజూరు చేయలేదన్నారు.

గ్రేట్ ఎన్నికల్లో ప్రతిపక్షం లేకుండా చెయ్యాలి

గోపాపట్నం, సెప్టెంబర్ 23 : రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిపక్షం అనేదే లేకుండా చేసేందుకు అందరూ కష్టపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం విశాఖ విమానాశ్రయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల వరకు అందరు కలసి కట్టుగా పని చెయ్యాలన్నారు. ఏ స్థాయి వారైనా నియంతలా వ్యవహరిస్తే సహించేది లేదదన్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలని అన్నారు. ప్రజలతో మమేకమై పని చేయాలన్నారు.
స్వాగతం, వీడ్కోలు

కోస్టల్ కారిడార్‌తోనే ఎపి అభివృద్ధి

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: విశాఖ-చెన్నై కోస్టల్ కారిడర్ అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారిపోతుందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖామంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ పటం ఛాంబర్ ఆఫ్ కామర్స్, బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం మైదానంలో ఏర్పాటుచేసిన ఇండియా ఇంటర్నేషనల్ మెగా ట్రేడ్ ఫెయిర్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖ-చెన్నై కారిడార్ దేశానికి తలమానికం కానుందన్నారు. ఈ పారిశ్రామిక కారిడార్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రం మారిపోతుందన్నారు. విశాఖ నగరం వ్యాపార అభివృద్ధికి అనువైన ప్రాంతంగా అభివర్ణించారు.

‘వర్గీకరణ ఉద్యమం అంతిమ దశకు చేరుకుంది’

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గత 22 ఏళ్ళుగా మంద కృష్ణ మాదిగా నాయకత్వంలో సాగుతున్న పోరాటం అంతిమ దశకు చేరుకుందని ఆంధ్రవిశ్వవిద్యాలయం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్) అధ్యక్షులు చదువుల ఆశాకిరణ్ అభిప్రాయపడ్డారు. విశాఖ విమానాశ్రయలో ఆశాకిరణ్ నేతృత్వంలో పలువురు ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు స్వాగడం పలికారు. జనాభా ధామషా ప్రకారమే రిజర్వేషన్ ఫలాలు ఎస్సీలకు దక్కాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ సాధన దిశగా గత 22 ఏళ్ళుగా కృష్ణమాదిగ పోరాటం అమోఘమన్నారు.

సొంతింటి కల నెరవేర్చుతా...!

పరవాడ, సెప్టెంబర్ 23: నిరుపేదల సొంత ఇల్లు కలను నెరవేర్చేందుకు 4వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో నాలుగు లక్షల ఇళ్లను నిర్మిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విశాఖపట్నం జిల్లా పరవాడ వద్ద జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద 50.40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 1839 గృహాల సముదాయాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పరవాడ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నిరుపేదలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే తన లక్ష్యం అన్నారు. నిరుపేద కుటుంబాలకు భద్రత కల్పించేందుకు చంద్రన్న బీమా పథకం అక్టోబర్ 2వ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సముద్ర తీరంతోనే ఏపీ ప్రగతి

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: విశాఖ-చెన్నై కోస్టల్ కారిడర్ అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారిపోతుందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖామంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ పటం ఛాంబర్ ఆఫ్ కామర్స్, బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం మైదానంలో ఏర్పాటుచేసిన ఇండియా ఇంటర్నేషనల్ మేగా ట్రేడ్ ఫెయిర్‌లో ముఖ్యఅతిథిగాపాల్గొన్నారు. విశాఖ-చెన్నై కారిడార్ దేశానికి తలమానికం కానుందన్నారు. ఈ పారిశ్రామిక కారిడార్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రం మారిపోతుందన్నారు.

Pages