S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు ఘాట్‌లో విరిగిపడిన కొండ చరియలు

పాడేరు, సెప్టెంబర్ 23: పాడేరు ఘాట్‌లో శుక్రవారం కొండ చరియలు విరిగి పడడంతో దాదాపు ఏడు గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఘాట్‌లోని రాజ్‌పురం వద్ద కొండ చరియలు విరిగి ప్రధాన రహదారిపై పడ్డాయి. శుక్రవారం ఉదయం పదకొండు గంటల సమయంలో ప్రధాన రహదారిపై కొండ చరియలు పడడంతో మైదాన ప్రాంతం నుంచి పాడేరు వైపు, పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి వెళ్లే అన్ని రకాల వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుకు అడ్డం గా పడిపోయిన కొండ చరియల వలన వాహనాలు వెళ్లేందుకు ఏ మాత్రం దారి లేకపోవడంతో ఘాట్‌లో వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరి ఉండిపోవలసి వచ్చింది.

సిఎం వరాల జల్లు

గాజువాక/అక్కిరెడ్డిపాలెం, సెప్టెంబర్ 23: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరవాడ పర్యటనలో వరాలు కురిపించారు. పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి జరుగుతున్న పరవాడలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. యలమంచలి-గాజువాక రహదారిని దేశపాత్రునిపాలెం నుండి అచ్యుతాపురం వరకు అభివృద్ధి చేసేందుకు చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్‌లో భాగస్వామ్యం చేస్తామన్నారు. ముత్యాలమ్మపాలెం సముద్ర తీర ప్రాంతానికి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు.వాడచీపురుపల్లి నుండి ముత్యాలమ్మపాలెం వెళ్లే ప్రధాన రహదారి విస్తరణకు చర్యలు తీసుకుంటామన్నారు.

విద్యుత్ షాక్‌తో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి

విజయనగరం(టౌన్),సెప్టెంబర్ 23: విద్యుత్ ప్రమాదాల కారణంగా జిల్లాలో ముగ్గురు వ్యక్తులు మృతి చెంది ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపారు. విజయనగరం మండలం గుంకలాం గ్రామానికి చెందిన సిరిపురపు శంకర్(22), సువ్వాడశ్రీను(16) వినాయక చవితి నిమజ్జనం వేడుకలను ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి మృత్యువాత పడ్డారు. ఎస్.కోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కిరాణా వ్యాపారి టిత్రినాథ(63) రోజూలాగే వారపుసంతకు అరకు వెళుతూ ఎస్.కోట పట్టణంలోని దేవీ బొమ్మ కూడలిలోని దుర్గాదేవికి నమస్కరించుకుని హుండీలో డబ్బులు వేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు.

అభివృద్ధి పనులను త్వరితంగా పూర్తి చేయాలి

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 23: పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతంగా జరిగేలా చూడాలని ఎమ్మెల్యే మీసాల గీత కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ వివేక్‌యాదవ్‌తో సమావేశమయ్యారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. వచ్చేనెలలో పైడితల్లి జాతర జరుగుతున్నందున రోడ్లు, కాలువ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణంలో కోట జంక్షన్ నుంచి ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, గుచీ నుంచి దాసన్నపేట రైతుబజారు జంక్షన్ వరకు, అంబటిసత్రం జంక్షన్ నుంచి కొత్తపేట జంక్షన్ వరకు, సింహాచలం మేడ జంక్షన్ నుంచి బాలాజీ జంక్షన్ వరకు రోడ్ల విస్తరణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని కోరారు.

సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ కార్మికుల ధర్నా

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 23: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో స్థానిక డిపో ఎదుట ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంప్లారుూస్ యూనియన్ డిపో కమిటీ కార్యదర్శి బిఆర్‌కె పరమహంస మాట్లాడుతూ డిపోలో శ్లాక్ సీజన్ పేరిట షెడ్యూళ్లను తగ్గించరాదన్నారు. ఎటువంటి బదిలీలు, రిలీవింగ్‌లు చేయరాదని తెలిపారు. కండక్టర్లు, డ్రైవర్ల డ్యూటీ చార్టులు వేయాలని జాయింట్ మీటింగ్‌లో నిర్ణయించినప్పటికీ, డ్యూటీలు వేయకపోవడం వల్ల అనేకమంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 23: పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించామని ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. రోడ్లపై పేరుకుపోయిన చెత్తాచెదారం, కాలువలో నిలిచిపోయిన వ్యర్థాలు, పూడికను తొలగించేందుకు వారంరోజుల పాటు స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పట్టణంలో చెత్తాచెదారం, కాలువల్లో పూడిక పేరుకుపోవడం వల్ల పలురకాల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున సామూహికంగా పూడికతీత పనులు చేపడతామని చెప్పారు. అదేవిధంగా పందుల నియంత్రణకు కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.

తోటపల్లి కాలువ తారకరామ ప్రాజెక్టుకు అనుసంధానం

నెల్లిమర్ల, సెప్టెంబర్ 23: తోటపల్లి కాలువను తారకరామ ప్రాజెక్టుకు అనుసంధానం చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం తారకరామ ప్రాజెక్టు డిఇ సన్యాసప్పారావు, తోటపల్లి ప్రాజెక్టు జెఇపి. రవికుమార్ తంగుడిబిల్లి గ్రామంలోని భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా తారకరామ ప్రాజెక్టు డిఇ సన్యాసప్పారావు మాట్లాడుతూ తోటపల్లి కాలువను తారకరామ ప్రాజెక్టు అనుసంధానం చేయడానికి 20 కోట్ల నిధులతో అంచనాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఈ అనుసంధానం విజయనగరం పట్టణానికి తాగునీరు అందించడానికి అని వెల్లడించారు. తొలుత తారకరామ తీర్థసాగర్ నుంచి తాగునీరు అందించడానికి ప్రతిపాదనలు తయారు చేశారు.

ముంపు అంచుల్లో మడ్డువలస జలాశయం

శ్రీకాకుళం, సెప్టెంబర్ 23: అల్పపీడన ప్రభావంతో జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కరుస్తున్న వర్షాలతో జిల్లా వ్యాప్తంగా జలాశయాలు, నదులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. సువర్ణముఖి, వేగావతి నదులు నుంచి మడ్డువలస ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి నాగావళి నదిలోకి 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు తోటపల్లి జలాశయానికి భారీగా వరదనీరు చేరుతుండటంతో రెండు గేట్లు ఎత్తి నాగావళిలోకి 3800 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. వంశధార జలాశయం నుంచి 7 గేట్లు ఎత్తి ఏడు వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికలకు పార్టీల కసరత్తు

ఒంగోలు,సెప్టెంబర్ 23:రాష్టవ్య్రాప్తంగా పాలకవర్గాలు లేని నగర, మునిసిపాలిటీలకు డిసెంబర్ లేదా జనవరి నెలలో ఎన్నికలు జరుగుతాయని తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు ఎన్ లోకేష్ పార్టీశ్రేణులకు సూచించటంతో జిల్లాలో పాలకవర్గాలు లేని ఒంగోలు నగర కార్పొరేషన్, కందుకూరు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈపాటికే పార్టీశ్రేణులకు రాష్టప్రార్టీ నుండి ఆదేశాలు రావటంతో ఒంగోలు నగరం, కందుకూరు మునిసిపాలిటీల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కనుంది. డిసెంబర్ లేదా జనవరి నెలలో ఎన్నికలు జరిగితే ముందుగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.

విద్యార్థుల్ని రెచ్చగొట్టడం మానుకోవాలి

నెల్లూరు, సెప్టెంబర్ 23: ప్రత్యేక హోదా పేరుతో అభం శుభం తెలియని విద్యార్థుల్ని రెచ్చగొట్టే చర్యలను ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి వెంటనే మానుకోవాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డితో పాటు ఇతర నేతలు హితవు పలికారు. శుక్రవారం సాయంత్రం జిల్లా టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తొలుత సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వం ప్రత్యేక హోదాకు వ్యతిరేకం కాదని, కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజి ఎంతో ఉన్నతంగా ఉండటంతో తామంతా స్వాగతించామని తెలిపారు.

Pages