S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెరాసతో కాంగ్రెస్ కుమ్మక్కు: రేవంత్

హైదరాబాద్: తెలంగాణలో అధికార తెరాస పార్టీతో కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నట్లు రాజ్యసభ ఎన్నికలే నిదర్శనమని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయకపోవడం పెద్ద తప్పు అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసి ఉంటే ఇటీవల తెరాసలోకి ఫిరాయించిన ఆ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి ఉండేదన్నారు. ఈ కోణంలో ఆలోచిస్తే తెరాసతో కాంగ్రెస్ కుమ్మక్కయినట్టు స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

నేపాల్‌లో ఖమ్మం యాత్రీకులు క్షేమం

హైదరాబాద్: నేపాల్‌లో చిక్కుకున్న ఖమ్మం జిల్లాకు చెందిన 60 మంది యాత్రీకులు క్షేమంగా ఉన్నారని, వారిని స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. వీరిని తీసుకువెళ్లిన ట్రావెల్ సంస్థ నేపాల్‌లో వదిలేసినట్లు ఆయన చెప్పారు. యాత్రీకులను క్షేమంగా తిరిగి పంపేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు, దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారికి విజ్ఞప్తి చేశామన్నారు.

వైద్యం వికటించి రోగి మృతి

విజయవాడ: నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం వికటించి మహిళ మరణించగా ఆమె బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి విచారణ చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కాగా, మహిళ మృతికి కారకుడైన వైద్యుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

టీఎస్‌ ఐసెట్‌-2016 ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2016-17 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌-2016 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.
మొదటి ర్యాంక్‌-గాజుల వరుణ్‌(154 మార్కులు)
రెండో ర్యాంక్‌- వివేక్‌ విశ్వనాథన్‌ అయ్యర్‌(154)
మూడో ర్యాంక్‌- రాంప్రసాద్‌(153)

రాజ్యసభ నామినేషన్ల ఘట్టానికి తెర: ఆరుసీట్లకూ ఏకగ్రీవ ఎన్నిక!

హైదరాబాద్: ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఆరు సీట్లకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగినట్లే. పోలింగ్ అవసరం లేకుండానే ఎన్నికల ఘట్టానికి తెర పడనుంది. తెలంగాణలో రెండు సీట్లకు తెరాస నుంచి డిఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు నామినేషన్లు వేశారు. వేరెవరూ నామినేషన్లు వేయనందున ఈ ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టే. అలాగే, ఎపిలో నాలుగు సీట్లకు అయిదుగురు నామినేషన్లు వేశారు. వైకాపా తరఫున విజయసాయి రెడ్డి, డమీగా ఆయన భార్య సునందా రెడ్డి నామినేషన్లు వేశారు. సునంద నామినేషన్ ఉపసంహరించుకుంటారు గనుక విజయసాయి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే.

శాంతిభద్రతలు భేష్: టి. డిజిపి

హైదరాబాద్: గత రెండేళ్ల కాలంలో తెలంగాణలో శాంతి భద్రతలు సజావుగానే ఉన్నాయని డిజిపి అనురాగ్ శర్మ మంగళవారం తెలిపారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో మహిళల పట్ల వేధింపులు తగ్గాయని, రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టిందన్నారు. ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.

వాద్రాపై కేసులు తేల్చండి: సుబ్రహ్మణ్య స్వామి

దిల్లీ: బ్రిటిష్ పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్న సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై కేసులను త్వరితగతిన విచారించాలని బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. ఇప్పటికే వాద్రా లండన్‌లో భారీగా ఆస్తులను కొనుగోలు చేశాడని, ఆయుధ డీలర్ సంజయ్ భండారీపై ఆదాయపు పన్నుశాఖ అధికారుల దాడుల్లో సోనియా అల్లుడి అక్రమాల గురించి ఆధారాలు లభించాయని పేర్కొన్నారు. వాద్రా లండన్ పారిపోకముందే కేసులు నమోదు చేసి కోర్టులో విచారించాలని డిమాండ్ చేశారు.

యువకుల ఘర్షణ: ఒకరి మృతి

ఖమ్మం: కొత్తగూడెంలో యువకుల మధ్య ఘర్షణ ఫలితంగా సుశాంత్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఘర్షణ అనంతరం సుశాంత్ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో గాలించారు. గోధుమవాగులో సుశాంత్ మృతదేహాన్ని మంగళవారం కనుగొన్నారు. యువకుల మధ్య కొట్లాట వల్లే ఈ దారుణం జరిగిందని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేజ్రీవాల్ ఇంటి వద్ద బిజెపి నిరసన

దిల్లీ: దేశ రాజధానిలో విద్యుత్, మంచినీటి సరఫరా తీరు అధ్వాన్నంగా ఉండడంతో ప్రజలు నానాపాట్లు పడుతున్నారని ఆరోపిస్తూ దిల్లీ సిఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద మంగళవారం నాడు బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సిఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేజ్రీవాల్ ఇంట్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు వారు యత్నించగా పోలీసులు వాటర్ క్యానన్లను ఉపయోగించి చెదరగొట్టారు.

బందరు ఆస్పత్రిలో ఎసిబి సోదాలు

విజయవాడ: మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో ఎసిబి అధికారులు మంగళవారం సోదాలు చేశారు. ఓ వ్యక్తి నుంచి పదివేల రూపాయలు తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్‌ను ఎసిబి అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు.

Pages