S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దళితులను వంచిస్తున్న ఇద్దరు సిఎంలు!

వరంగల్: రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబు దళితులను వంచిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ మంగళవారం ఇక్కడ ఆరోపించారు. ఎమ్మార్పీఎస్‌పై ఎపిలో పోలీసులు నిఘా పెట్టడంలో చంద్రబాబు ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దళితుడిని సిఎం చేస్తానన్న కెసిఆర్ ఆ వర్గాలకు అన్యాయం చేస్తున్నారన్నారు.

అర్ధరాత్రి రిసార్ట్సులో రివాల్వర్ కాల్పులు

హైదరాబాద్: నగర శివారులోని గండిపేట వద్ద గోల్కొండ రిసార్ట్సులో సోమవారం అర్ధరాత్రి రివాల్వర్ కాల్పులు కలకలం సృష్టించాయి. గండిపేట సర్పంచ్ భర్త ప్రశాంత్ యాదవ్ తన స్నేహితులకు రిసార్ట్సులో పార్టీ ఇచ్చాడు. అక్కడికి హాజరైన ప్రభాకర్ అనే వ్యక్తి పార్టీలో ఆకస్మికంగా తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ప్రభాకర్‌ను పొలీసులు అదుపులోకి తీసుకుని కాల్పుల ఘటనపై ఆరా తీస్తున్నారు.

నేవీ అధిపతిగా అడ్మిరల్‌ సునిల్‌ లంబా

దిల్లీ: చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌కే ధోవన్‌ పదవికాలం పూర్తవడంతో నేవీ అధిపతిగా అడ్మిరల్‌ సునిల్‌ లంబా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. భారత నావికాదళానికి ఆయన 21వ అధిపతి. 58 ఏళ్ల లంబా మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. సికింద్రాబాద్‌లోని డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ కళాళాలలో చదువుకుని, 30ఏళ్ల పాటు నావికదళానికి సేవలందించినందుకు పరమ విశిష్ట సేవాపతకంతో కేంద్ర ప్రభుత్వం నుంచి లంబా సత్కారం అందుకున్నారు.

నామినేషన్లు వేసిన డిఎస్, కెప్టెన్

హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థులు డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు మంగళవారం ఉదయం టి.అసెంబ్లీ కార్యదర్శి వద్ద నామినేషన్లు దాఖలు చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రైతులను అడ్డుకున్న పోలీసులు

కర్నూలు: ఆదోని మండలం సిద్ధేశ్వరం వద్ద అలుగు నిర్మాణానికి వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన రైతులను మంగళవారం ఉదయం పోలీసులు అడ్డుకున్నారు. కొత్తపల్లి, ఆత్మకూరు, సంగమేశ్వరం, సిద్ధేశ్వరం తదితర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించినప్పటికీ రైతులు అలుగు శంకుస్థాపనకు బయలుదేరారు. విపక్షాలకు చెందిన కొంతమందిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.

నామినేషన్లు వేసిన సుజానా, టిజి

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న కేంద్రమంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రి టిజి వెంకటేష్ మంగళవారం ఎపి అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారి సమక్షంలో తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి వీరు ర్యాలీగా బయలుదేరి అసెంబ్లీకి చేరుకున్నారు. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఇతర నాయకులు, అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు.

రేపటి నుంచి జగన్ రైతు భరోసా యాత్ర

హైదరాబాద్: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న రైతు కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు వైకాపా అధినేత జూన్ 1 నుంచి అయిదు రోజుల పాటు రైతు భరోసా యాత్ర చేపడుతున్నారు. బుధవారం ఆయన అనంతపురం జిల్లా కదిరి, తాడిపత్రి ప్రాంతాల్లో పర్యటించి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఓదారుస్తారు.

ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఖరారు: కాల్వ

హైదరాబాద్: రాజ్యసభకు అభ్యర్థుల ఎంపిక పార్టీలో ఏకాభిప్రాయంతోనే సాధ్యమైందని ఎపి ప్రభుత్వవిప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. వివిధ సామాజిక వర్గాలకు న్యాయం చేసే సంప్రదాయాన్ని టిడిపి అనాదిగా పాటిస్తోందన్నారు.

నలుగురు బాలికలు అదృశ్యం

హైదరాబాద్: ఒకే ప్రాంతానికి చెందిన నలుగురు బాలికలు అదృశ్యమైన సంఘటన నార్సింగ్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం నుంచి వీరు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు చివరికి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలికల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

మోహన్‌బాబుతో ముద్రగడ భేటీ

హైదరాబాద్: సినీ నటుడు, మాజీ ఎంపి మోహన్‌బాబును కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మంగళవారం కలిశారు. శంషాబాద్ మండలం జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఫాంహౌస్‌కు ఆయన వెళ్లి, కాపు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముద్రగడ గత కొన్నిరోజులుగా నగరంలోనే బస చేసి వివిధ పార్టీల నాయకులను, సినీ నటులను కలుసుకుంటున్నారు.

Pages