S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన సుతుని కంట కన్నీరు!

ఖమ్మం, మే 30: ఆంజనేయ స్వామి విగ్రహం కన్నీరొలికిన సంఘటన ఖమ్మం జిల్లా వైరా మండలంలోని బ్రాహ్మణపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బ్రాహ్మణపల్లిలో మూడేళ్ళ క్రితం ఆంజనేయస్వామి ఆలయం నిర్మించారు. ఈ క్రమంలో ఆలయ వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా నిర్వహించాలని ఆలయ పూజారి సతీష్‌శర్మ ఆలయ పాలకమండలిలో ఒక సభ్యుడితో చర్చించారు. దీనిపై ఆగ్రహించిన సభ్యుడు పూజారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో గత రెండు రోజులుగా ఆలయం మూసివేశారు. దీంతో దిగివచ్చిన పాలకమండలి సభ్యుడు అందరితో కలసి తిరిగి తన పొరపాటును ఒప్పుకున్నారు.

వేద పండితుల వినూత్న నిరసన

తిరుపతి, మే 30: ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అనే చెప్పే పురాణ పండితుల పట్ల టిటిడి సైతం అధర్మంగా ప్రవర్తించడం దారుణమని బాలాజీ పురాణ పండితుల యూనియన్ గౌరవ అధ్యక్షుడు కందారపు మురళి విమర్శించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌లో పని చేస్తున్న పురాణ పండితులు సోమవారం టిటిడి పరిపాలనా భవనం ఎదుట పురాణ ప్రవచనంతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాణాలను ఔపోసనపట్టి, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పండితుల చేత 20 సంవత్సరాలుగా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని విమర్శించారు.

హోదాకన్నా నిధులే మేలు

కాకినాడ, మే 30: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం వలన ఏమాత్రం ప్రయోజనం లేదని, హోదా కంటే రాష్ట్రానికి అత్యధిక స్థాయిలో నిధుల మంజూరుపైనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. కాకినాడలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఏడాదికి రూ.700 కోట్ల వంతున పదేళ్లకు రూ.7000 కోట్లు మంజూరవుతాయన్నారు. హోదా లేని పక్షంలో పదేళ్లలో రాష్ట్రానికి సుమారు రూ.4 లక్షల కోట్లు కేంద్రం నుండి రాష్ట్రానికి అందుతాయన్నారు.

ముద్రగడ మాటలు నమ్మవద్దు

నెల్లూరు/కాకినాడ, మే 30: ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఉద్యమం చేపట్టిన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై రాష్టమ్రంత్రులు నారాయణ, నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ లబ్ధికోసం ఉద్యమాల పేరుతో ముద్రగడ పద్మనాభం కాపులను మోసగించడం తగదని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సోమవారం నెల్లూరులో విరుచుకుపడ్డారు. రాజకీయంగా పనీపాటు లేక ఖాళీగా ఉన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మాటలు నమ్మి కాపు సామాజికవర్గం మోసపోవద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాకినాడలో అన్నారు.

నేపాల్ యాత్రికుల కథ సుఖాంతం

ఏలూరు, మే 30: ఉత్తర భారతదేశం, నేపాల్‌లోని దేవాలయాల సందర్శనకు బయలుదేరి, మూడు రోజులుగా సమాచారం అందకుండా పోయిన పశ్చిమ గోదావరి జిల్లా యాత్రికుల కథ సుఖాంతమయ్యింది. వారంతా క్షేమంగా ఉన్నట్టు సోమవారం సాయంత్రం సమాచారం అందడంతో బంధువులు ఊపిరిపీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జల్లిపల్లి అంజనీకృష్ణకుమార్, శ్యామలా, మద్ది శ్రీను, విజయలక్ష్మి, సురేష్, రోజా, వారి కుమారులు చందన్, శరత్, బేబి, వారి కుమార్తెలు మనీషా, శ్రీవాణి, కె నూకరాజు, శకుంతల మొత్తం 28మంది ఉత్తర భారత్, నేపాల్ యాత్రకు బయలుదేరారు. 17న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో యాత్రకు బయలుదేరి వెళ్లారు.

ఇక ఇంటింటికీ గంగాజలం?

న్యూఢిల్లీ, మే 30: పవిత్ర గంగాజలం కూడా ఈ కామర్స్ రూటు పడుతోంది. మార్కెట్‌కు వెళ్లకుండానే మొబైల్ ఫోన్లు, చీరలు, దుస్తులు, ఆభరణాలే ఈ కామర్స్ ద్వారా వినియోగదారుల ఇళ్లకు ఎలా చేరుతున్నాయో.. కాశీ మహాక్షేత్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే పవిత్ర గంగాజలం కూడా ఇళ్లకు చేరుకునే తరుణం ఆసన్నమైంది. దేశం నలుచెరగులా విస్తరించిన పోస్ట్ఫాసు నెట్‌వర్క్‌నే ఇందుకు కేంద్రం వినియోగించుకోబోతోంది. గంగాజలాల్ని పోస్టుల ద్వారా అందించాలంటూ తనకు ఇప్పటివరకూ ఎన్నో అభ్యర్థనలు అందాయని.. ఇందుకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశానని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం నాడిక్కడ తెలిపారు.

రాష్ట్రావతరణ వేడుకలకు రండి

హైదరాబాద్, మే 30: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా జూన్ 2వ తేదీన హెచ్‌ఐసిసిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఇది వరకే ఖరారు అయిన హెచ్‌ఐసిసిలో జరిగే కార్యక్రమానికి గవర్నర్‌ను అధ్యక్షత వహించాల్సిందిగా మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి ఆహ్వాన పత్రాన్ని ఈ సందర్భంగా అందజేసినట్టు అధికార వర్గాల సమాచారం.

వలస ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ

విజయవాడ, మే 30: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తన నివాసంలో భేటీ అయ్యారు. అలాగే, కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, పత్తిపాటి పుల్లారావు తదితరులు కూడా పాల్గొన్నారు. రాజ్యసభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే అంశాన్ని వీరితో చర్చించారు. చివరకు సుజనా చౌదరి, టిజి వెంకటేష్ పేర్లను ఖరారు చేశారు. నాలుగో అభ్యర్థిని కూడా బరిలోకి దించాలన్న ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇప్పటికే అభ్యర్థి పేరును టిడిపి అధిష్ఠానం ఖరారు చేసింది.

భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ ముగింపు నేడే

హైదరాబాద్, మే 30: ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని నివాస గృహాలు, ఇతర నిర్మాణాలను నిర్మించుకున్న వారికి నామ మాత్రపు రుసుంతో క్రమబద్ధీకరించేందుకు ప్రవేశ పెట్టిన జీవో 59 కు కింద భూ హక్కుల పత్రాలను జారీ చేసే ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. క్రమబద్దీకరణ పత్రాలను జారీ చేయడానికి రూపొందించిన ఫార్మెట్‌ను ఆన్‌లైన్‌లో డౌన్ లోడ్ చేసుకోవడానికి మంగళవారం చివరి తేదీగా భూ పరిపాలన కమిషనర్ (సిసిఎల్‌ఎ) ఆదేశాలు జారీ చేయడంతో రెనిన్యూశాఖ తలమునకలైంది. వాస్తవానికి ఈ ప్రక్రియ సంక్రాంతి నాటికే పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే.

ప్రైవేటు విద్యాసంస్థలకు పిఎఫ్ మినహాయింపు లేదు

హైదరాబాద్, మే 30: ప్రైవేటు విద్యాసంస్థలకు పిఎఫ్ మినహాయింపు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎపి విద్యా చట్టం 1982 ప్రకారం ఈ మినహాయింపు కోరడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్ రావులతో కూడిన బెంచ్ ఆదేశించింది. పిఎఫ్ నుండి మినహాయింపును ఎపి ప్రైవేటు విద్యాసంస్థల సంఘం గతంలో ఢిల్లీలోని ఇపిఎఫ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ నుండి పొందింది. ఇలాంటి మినహాయింపు కోరినపుడు 1996లో పిఎఫ్ కమిషనర్ తిరస్కరించారు. దానిపై అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను సంఘం ఆశ్రయించగా, సంఘం అనుకూల తీర్పు ఇచ్చింది.

Pages