S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కజకిస్థాన్‌లో వైశాఖం పాటలు

హరీష్, అవంతిక జంటగా బి.జయ దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ బ్యానర్‌పై బి.ఎ.రాజు నిర్మిస్తోన్న చిత్రం ‘వైశాఖం’. ఈసినిమా అరవై శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ, ‘‘ప్రేమలో పావని కళ్యాణ్’, ‘చంటిగాడు’, ‘ప్రేమికులు’, ‘లలీ’ వంటి చిఅతాల తరువాత మా సంస్థలో రాబోతున్న మరో చిత్రం ‘వైశాఖం’. లలీ సినిమా తరువాత మంచి సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశ్యంతో కాస్త గ్యాప్ తీసుకున్నాం. ఇప్పటికే అరవై శాతం షూటింగ్ పూర్తయింది. మా బ్యానర్‌లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా పెద్ద హిట్స్ అయ్యాయి.

శాతకర్ణితో శ్రీయ?

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా ఇటీవలే మొరాకలో ఓ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లోని చిలుకూరు దగ్గరలో జరుగుతోంది. ఇప్పుడు రెండో షెడ్యూల్‌కి చేరుకున్నా కూడా ఈ సినిమాకు ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు? దాంతో హీరోయిన్‌కోసం అనే్వషణ జోరుగా జరుగుతోంది. ఇప్పటికే నయనతార, అనుష్కల పేర్లు వినిపించాయి. కాని డేట్స్ కుదరక ఇద్దరూ నో చెప్పారు. ముఖ్యంగా నయనతారను ఈ సినిమాలో హీరోయిన్‌గా నటింపచేసేందుకు తీవ్రంగా ట్రై చేశారు కాని కుదరలేదు. దాంతో ఇప్పుడు బాలయ్య సరసన హీరోయిన్‌గా శ్రీయ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

చైనాలో బాహుబలి

ప్రముఖ దర్శకుడు రాజవౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా గతేడాది జూలైలో విడుదలై దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ‘బాహుబలి’, పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేదికలపై మన సినిమా మార్కెట్ పెరిగే అవకాశాలను కల్పించింది. ఆ క్రమంలోనే ‘బాహుబలి’ సినిమాకు సంబంధించిన ఇంటర్నేషనల్ వెర్షన్ పలు దేశాల్లో విడుదలై అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. తాజాగా ‘బాహుబలి’కి అతి పెద్ద మార్కెట్‌గా అవతరించే అవకాశంగా కనిపిస్తోన్న చైనాలో సినిమా విడుదలకు సిద్ధమైపోయింది.

మారుతి దర్శకత్వంలో సుప్రీమ్

భలే భలే మగాడివోయ్’ సినిమా తరువాత దర్శకుడు మారుతి ప్రస్తుతం వెంకటేష్ హీరోగా ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత మారుతి ఓ యువ హీరో సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిసింది. తాజా సమాచారం మేరకు మెగా హీరో సాయిధరమ్‌తేజ్ ఈ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. సుప్రీమ్ హిట్ తరువాత సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘తిక్క’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు మారుతి చెప్పిన కథ నచ్చడంతో సాయిధరమ్ తేజ్ ఈ సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

సరికొత్త పాత్రలో నటిస్తున్నా!

‘లవ్ యూ అలియా’ చిత్రంలో తాను ఓ సరికొత్త పాత్రలో నటించానని, కెరీర్‌లో ఇలాంటి పాత్ర ఇప్పటివరకూ చేయలేదని నటి భూమిక తెలిపారు. చందన్‌కుమార్, సంగీతా చౌహాన్ జంటగా సమీస్ మ్యాజిక్ సినిమా పతాకంపై ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ యూ అలియా’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో తన పాత్ర గురించి నటి భూమిక విశేషాలను తెలుపుతూ, తన పాత్రను ఈ సినిమాలో కీలకంగా వుండడం కోసం డిజైన్ చేశారని, ఈ సినిమా విషయంలో తాను కొత్త ఉత్సాహంతో వున్నానని అన్నారు. మెసేజ్‌తోపాటుగా ఎంటర్‌టైన్‌మెంట్ కూడా వున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని, త్వరలో విడుదలకానుందని తెలిపారు.

కలిసొచ్చిన బిచ్చగాడు

‘బిచ్చగాడు’ చిత్రానికి ఆ పేరును పెట్టినపుడు వ్యతిరేకత వస్తుందని అనుకున్నామని, కానీ ఆ పేరే ఈ సినిమా విజయానికి పెద్ద ప్లస్‌గా మారిందని కథానాయకుడు విజయ్ ఆంటోని అన్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సప్తనా టైటస్ జంటగా శశి దర్శకత్వంలో చెదలవాడ పద్మావతి రూపొందించిన ‘బిచ్చగాడు’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం జరిగింది. తమిళంలో ఈ సినిమాను ఎంతగా ఆదరిస్తున్నారో అంతే ఆదరణను తెలుగులోనూ లభిస్తోందని, రోజురోజుకూ థియేటర్ల సంఖ్య పెరుగుతోందని విజయ్ ఆంటోని తెలిపారు.

హరీష్ రావత్ అరెస్టుపై హైకోర్టు ‘స్టే’

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌ను అరెస్టు చేయరాదంటూ రాష్ట్ర హైకోర్టు మంగళవారం నాడు ‘స్టే’ ఇచ్చింది. ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న సందర్భంగా స్ట్రింగ్ ఆపరేషన్‌కు సంబంధించి ఓ వీడియో విడుదల కావడంతో ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలని సిబిఐ భావించింది. ఈ వీడియోపై సిబిఐ విచారణకు హరీష్ ఇదివరకే హాజరయ్యారు. ఆయన వేసిన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు అరెస్టుపై స్టే ఉత్తర్వులు జారీచేసింది. కేసు తదుపరి విచారణను జూన్ 20కి వాయిదా వేశారు. వీడియోపై సిబిఐ విచారణను రద్దు చేసేందుకు మాత్రం హైకోర్టు నిరాకరించింది.

మహానాడు తీర్మానాలపై కెసిఆర్ వక్రభాష్యం

హైదరాబాద్: తిరుపతి మహానాడులో తమ పార్టీ చేసిన తీర్మానాలపై తెరాస అధినేత, సిఎం కెసిఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు టి.టిడిపి నేత రేవూరి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలకూ భవిష్యత్‌లో నష్టం జరుగుతుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టు టెండర్లలో జరిగిన అవకతవకలపై సాక్ష్యాధారాలను సమయం వచ్చినపుడు తాము బహిర్గతం చేస్తామన్నారు.

హైదరాబాద్‌లో ఎండావాన!

హైదరాబాద్: నగరంలో మంగళవారం కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురియగా, మరికొన్ని చోట్ల వేసవి తాపాన్ని కలిగించేలా ఎండ కొనసాగింది. పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

తిరుమలలో బ్రోకర్లదే రాజ్యం!

అనంతపురం: తిరుమలలో బ్రోకర్ల రాజ్యం కొనసాగుతోందని, టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు వైఖరే ఇందుకు కారణమని ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆరోపించారు. బ్రోకర్లకు ఇరవై వేలు చెల్లిస్తే బ్రేక్ దర్శనాలకు అనుమతి ఇస్తున్నారన్నారు. జెఇఓ ధోరణిపై హైకోర్టులో కేసు వేస్తామని, సిఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.

Pages