S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

09/08/2018 - 00:04

జూలై ఆరవ తేదీన జరుగవలసి ఉండిన భారత, అమెరికా దేశాల ‘చతుర్ముఖ’- టు ప్లస్ టు- సమావేశం సెప్టెంబర్ ఆరవ తేదీన జరగడానికి ప్రధాన కారణం వాణిజ్య ‘దౌర్జన్యం’.. ఈ దౌర్జన్యాన్ని అమెరికా అనేక ఏళ్లుగా కొనసాగిస్తోంది. పాకిస్తాన్ బీభత్సకాండను గురువారం ఢిల్లీలో జరిగిన ‘చతుర్ముఖ’ సమావేశంలో భారత, అమెరికాలు ఖండించాయి.

09/07/2018 - 00:13

లోక్‌సభకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించడం సాధ్యం కాదన్న రాజ్యాంగ వాస్తవానికి తెలంగాణ శాసనసభ గురువారం రద్దయిపోవడం మరో నిదర్శనం. శాసనసభ రెండు సమావేశాల మధ్య ఆరు నెలల కంటె ఎక్కువ కాలవ్యవధి ఉండడానికి వీలులేదు. అందువల్ల ఈ రాజ్యాంగ నిబంధనకు లోబడి తెలంగాణలో ఎన్నికలు జరగాలి, శాసనసభ మళ్లీ ఏర్పడాలి!

09/06/2018 - 00:08

పదకొండేళ్ల క్రితం భాగ్యనగర వాసులు దిగ్భ్రాంతికి గురి అయ్యారు. 2007 ఆగస్టు 25వ తేదీన జంట నగరాలను జంట పేలుళ్లు ప్రకంపితం చేశాయి. ‘కోలుకున్న’ భాగ్యనగర వాసులు గుర్తించిన ఘోర వాస్తవం.. జంట పేలుళ్లకు నలబయి నలుగురు బలైపోవడం, అరవై ఎనిమిది మంది క్షతగాత్రులు కావడం.

09/05/2018 - 02:49

గెలిచినవారు తమకు ఎన్నికల సంఘంపై అచంచల విశ్వాసం ఉందని ప్రకటించడం, ఓడినవారు ‘ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల’ (ఈవీఎంల)ను శంకించడం మన ఘనమైన ప్రజాస్వామ్య దేశంలో చాలా ఏళ్లుగా నడుస్తున్న ప్రహసనం. ‘ఈవీఎంలు వద్దు.. మళ్లీ బ్యాలెట్ పేపర్లతోనే పోలింగ్ జరపించండి’- అంటూ ఈమధ్య కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పదిహేడు విపక్ష పార్టీలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశాయి.

09/04/2018 - 01:06

క్రీడోత్సాహంతో మొదలై భావోద్వేగంతో ముగిసింది ఆసియా ఆటల జాతర. పతకాల జాతకాలు తేరిపార చూడాల్సిన తగవు లేకుండా- మళ్లీ చైనా, జపాన్, కొరియాలను ప్రస్తావించాల్సిన దృశ్యమే గోచరమైంది. మరి- భారత్ ఆకాంక్ష మాటేమిటి? ఆరంభ అంచనాలకు ముగింపు వాస్తవాలకు లంగరేది? అన్న ప్రశ్నకు మాత్రం తడబాటే సమాధానం. పతకాల లెక్కలు పక్కనపెడితే, పాఠాలు నేర్చుకునే అవకాశం సుసంపూర్ణం.

09/01/2018 - 00:20

బిమ్‌స్టెక్’ దేశాల ప్రభుత్వ అధినేతల సమావేశంలో బీభత్సకాండ పట్ల నిరసన వ్యక్తం కావడం పాకిస్తాన్ ప్రభుత్వానికి మరో అభిశంసన. మన దేశంలోకి పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దుల తరబడి బీభత్సకారులను ఉసిగొల్పుతుండడం అంతర్జాతీయ సమాజానికి తెలిసిన రహస్యం. అందువల్ల ఇరుగు పొరుగు దేశాలు బీభత్సకాండను నిరసించడం పాకిస్తాన్‌కు కనువిప్పు కలిగించడం లక్ష్యమైన శుభ పరిణామం. పాకిస్తాన్‌కు ‘కనువిప్పు’ కలుగబోదన్నది వేఱు విషయం.

08/31/2018 - 00:16

అదిగిదిగో ఇద్దరు చంద్రులు..’ అంటూ వాట్సాప్ సహా పలు సామాజిక మాధ్యమాల్లో సందేశాలు వెల్లువెత్తి అయోమయం నెలకొనడంతో- ‘ఇదంతా కేవలం బూటకం’ అని అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ స్పష్టం చేయాల్సి వచ్చింది. ఈ నెలలో అంబరవీధిన ‘ఇద్దరు చంద్రుల’ అద్భుత దృశ్యం కనువిందు చేస్తుందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో, 2287వ సంవత్సరం వరకూ అది సాధ్యం కాదని ‘నాసా’ సశాస్ర్తియంగా వివరణ ఇచ్చింది.

08/30/2018 - 00:07

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేయడానికి నిషిద్ధ ‘్భరత మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ’ వారు కుట్ర పన్నారన్న అభియోగం ఆశ్చర్యకరం కాదు. గతంలో సైతం రాజకీయ, రాజ్యాంగ పదవులలో ఉన్న ప్రముఖులను మట్టుపెట్టడానికి వివిధ పేర్లతో చెలామణి అవుతుండిన మావోయిస్టులు యత్నించడం చరిత్ర. కొంతమంది రాజకీయ ప్రముఖులు మావోయిస్టుల తూటాలకు బలైపోవడం, మరికొందరు బతికి బయటపడడం కూడ చరిత్ర.

08/29/2018 - 00:13

చంద్రమండలంలో నీటి నిక్షేపాలు విస్తరించి ఉన్నాయని ధ్రువపడడం పదేళ్లనాటి భారతీయ ‘చంద్రయానం’ సాధించిన చారిత్రక విజయం. మన ‘చంద్రయాన్’ పరిశోధన ఫలితాలను విశే్లషించిన అమెరికా వారి ‘అంతరిక్ష విజ్ఞాన సంస్థ’- నాసా- శాస్తవ్రేత్తలు ఇప్పుడు ఈ వాస్తవాన్ని ధ్రువీకరించారు. అంతరిక్ష పరిశోధనలో అనాదిగా భారతీయులు అగ్రగాములు.

08/28/2018 - 00:58

జీవ ఇంధనం- బయో ఫ్యూయెల్- తో గగన శకటాలను నడపడం స్వచ్ఛ భారత పునర్ నిర్మాణ ప్రస్థానంలో విప్లవాత్మక పరిణామం. ఈ శుభ పరిణామం, సోమవారం సంభవించింది. ‘స్పయిస్ జెట్’ విమానం ఒకటి డెహ్రాడూన్ నుంచి బయలుదేరి ఢిల్లీవరకు ‘జీవ ఇంధనం’ సహాయంతో గగనయాత్ర చేయడం ఈ చారిత్రక పరిణామం. విమాన రంగంలో ఇది వినూతన విప్లవమని కేంద్ర ప్రభుత్వం వారు అభివర్ణించడం ‘బయో ఫ్యూయెల్’ ప్రాధాన్యానికి సరికొత్త సమ్మానం.

Pages