S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

10/09/2018 - 01:17

సదస్సులు జరుగుతున్నాయి, అంతర్జాతీయ అవగాహనలు కుదురుతున్నాయి, విభేదాలు విస్తరిస్తున్నాయి, మళ్లీ మళ్లీ సయోధ్యలు కూడ ఏర్పడుతున్నాయి. కార్యాచరణ పథకాలు రూపొందుతూనే ఉన్నాయి. పరిసరాలు మాత్రం కలుషితం అవుతూనే ఉన్నాయి. పర్యావరణం నిరంతరం మరింతగా వేడెక్కిపోతోంది..

10/06/2018 - 00:08

ఏడుగురు రోహింగియా ముస్లింలను వారి స్వదేశమైన బర్మాకు తిప్పి పంపరాదన్న అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించడం నకిలీ ‘స్వచ్ఛంద సంస్థల’కు చెంపపెట్టు. ఈ ఏడుగురూ బర్మా- మ్యాన్‌మార్- దేశపు పౌరులు. 2012లో మన దేశంలోకి అక్రమంగా చొరబడిన ఈ ఏడుగురినీ వారి స్వదేశానికి తిప్పి పంపడానికి ఆరేళ్లు పట్టడం వైపరీత్యం.

10/05/2018 - 02:14

జస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ప్రతిపక్షాల ‘కూటమి’ కుప్పకూలడం వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయానికి దోహదం చేయగల పరిణామం. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోరాదని ఇదివరకే నిర్ణయించుకున్న బహుజన సమాజ్ పార్టీ బుధవారం నాడు రాజస్థాన్‌లోను, మధ్యప్రదేశ్‌లోను కూడ కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుంది.

10/04/2018 - 01:51

రాయలసీమ ద్వారమైన- గేట్‌వే ఆఫ్ రాయలసీమ- కర్నూలు నుంచి బయలుదేరి తెలంగాణ రాజధాని భాగ్యనగరానికి ఒకటిన్నర గంటల వ్యవధిలో చేరుకోవడం మధ్యతరగతి జనాన్ని మత్తెక్కించే మహా అనుభూతి.. భాగ్యనగరం-హైదరాబాద్-నుంచి ‘ఎల్లబూరి’ విజయవాడను రెండున్నర గంటలలో స్పృశించడం ఉత్కంఠ పూరితమైన మరో విచిత్రం!

10/03/2018 - 02:23

స్వచ్ఛతా ఉద్యమం విశ్వాసానికి, పరివర్తనకు ప్రతీక అన్నది ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాట! కొత్త ఢిల్లీలో నాలుగు రోజులపాటు జరిగిన మహాత్మా గాంధీ ‘అంతర్జాతీయ స్వచ్ఛతా సదస్సు’ సమారోహ్ ఉత్సవంలో ప్రసంగించిన మోదీ భౌతిక పరివర్తనతోపాటు మానసిక పరివర్తన స్వచ్ఛత పునరుద్ధరణకు అనివార్యమన్న వాస్తవాన్ని గుర్తుచేశాడు.

10/02/2018 - 01:23

స్వ చ్ఛత సృష్టి నిహితమైన సహజ స్వభావం. సృష్టిగతమైన వౌలిక తత్త్వం ఇది.. ఈ స్వచ్ఛతను మాలిన్యం ఆవహించడం ‘అపవాదం’ మాత్రమే. అపవాదం- ఎక్సెప్షెన్- తొలగిపోయి వౌలిక తత్త్వం మళ్లీ అంకురించడం, విస్తరించడం కూడ విశ్వవ్యవస్థలో నిహితమైన సహజ పరిణామ క్రమం. అందువల్ల కాలుష్య విముక్తమైన ప్రకృతి మళ్లీ మళ్లీ ప్రస్ఫుటిస్తూనే ఉంటుంది. సృష్టిగత వాస్తవాలు సమాజస్థితి జీవన విలాసంగా వికసించడం వేద విజ్ఞాన ప్రచోదిత భారతీయత..

09/29/2018 - 00:23

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐక్యరాజ్యసమితి వారు ‘‘్భ పరిరక్షక పురస్కారం’’ - ఛాంపియన్స్ ఆఫ్ అర్త్ అవార్డ్ - ప్రదానం చేయాలని నిర్ణయించడం మన జాతీయ జీవనగరిమకు అంతర్జాతీయ సమ్మానం... పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న వారికి, సంస్థలకు, ప్రభుత్వాలకు ‘సమితి’ వారు ఈ ‘్భమి పురస్కారాన్ని’ అందజేస్తున్నారు.

09/28/2018 - 00:06

వ్యభిచరించడం నేరం కాదని సర్వోన్నత న్యాయస్థానం గురువారం చేసిన నిర్ణయం సనాతన జాతీయ జీవన ప్రస్థాన క్రమంలో గొప్ప సంచలనం!! భారత జాతి తుది మొదలు లేని శాశ్వతమైన జాతి. సనాతనం అని అంటే ‘శాశ్వతం - ఎటర్నల్ - అని అర్థం. అందువల్ల ఈ జాతికి సనాతనమైన అంటే శాశ్వతమైన నైతిక నియమాలు ఉన్నాయి. అలాంటి నైతిక నియమాలలో ఒకటి వ్యభిచరించకపోవడం...

09/27/2018 - 00:29

ఆధార్ ‘గుర్తింపు పత్రం’ రాజ్యాంగబద్ధమని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం చెప్పిన తీర్పు జాతీయ సమష్టి అస్తిత్వానికి మరో ధ్రువీకరణ. ప్రాధాన్యానికి నోచుకోని కోట్ల మంది సామాన్య ప్రజలకు ‘ఆధార్’ పత్రం వల్ల విలక్షణ అస్తిత్వం ఏర్పడిందన్న వాస్తవం సుప్రీం కోర్టు చెప్పిన తీర్పుతో మరింతగా ప్రస్ఫుటిస్తోంది. కోట్లాది ప్రజలలో ప్రతి ఒక్కరికీ విలక్షణ అస్తిత్వం ప్రత్యేక వ్యక్తిత్వం ఉందన్నది సృష్టి సహజమైన వాస్తవం.

09/26/2018 - 00:43

మాల్‌దీవులలో మతోన్మాద నియంతృత్వాన్ని వ్యవస్థీకరించడానికి ఆరు ఏళ్లకు పైగా ప్రయత్నించిన అబ్దుల్లా యమీన్ పరాజయం పాలయ్యాడు. ఆరేళ్లకు పైగా కొడిగట్టి ఆరిపోవడానికి సిద్ధమై ఉన్న ప్రజాస్వామ్య జ్వాల సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాలతో మళ్లీ సముజ్వల శోభను సంతరించుకొంది.

Pages