S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/26/2018 - 23:53

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: వచ్చే నెలలో మస్కట్‌లో నిర్వహించే ఆసియా చాంపియన్ ట్రోఫీలో ప్రాతినిధ్యం వహించే భారత జట్టుకు మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇంతవరకు కెప్టెన్‌గా ఉన్న పీఆర్ శ్రీజేష్ స్థానంలో మన్‌ప్రీత్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. సర్దార్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు ఆడుతున్న తొలి మేజర్ టోర్నమెంట్ ఇదే కానుంది.

09/26/2018 - 23:54

హైదరాబాద్, సెప్టెంబర్ 26: ప్రముఖ స్టార్ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పెళ్లి పీటలు ఎక్కనుంది. వరుడు పారుపల్లి కాశ్యప్. ఇతను కూడా బాడ్మింటన్ స్టార్ క్రీడాకారుడే. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో 2005 నుంచి వీరిద్దరూ శిక్షణ పొంది, ఆటలో బాగా రాటుదేలారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సఖ్యత ఏర్పడి, ఆ తర్వాత ప్రేమగా మారి, ఇపుడు పెళ్లి పీటలు ఎక్కేవరకు వచ్చింది.

09/26/2018 - 23:07

బాటుమ్(జార్జియా), సెప్టెంబర్ 26: చెస్ ఒలింపియాడ్ రెండో రౌండ్‌లోప్రపంచ ప్రఖ్యాత చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ బుధవారం నాడు మార్కస్ రగ్గర్‌పై విజయం సాధించి భారత పురుషుల జట్టు ఆస్ట్రేలియాపై 3.5-0.5 తేడాతో గెలుపొందేందుకు దోహదం చేశాడు. పనె్నండేళ్ల విరామానంతరం సైతం అదే ఆటతీరును ప్రదర్శించిన విశ్వనాథన్ ఆనంద్ ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు.

09/26/2018 - 23:06

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: గాయాలబారిన పడిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ, ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లకు ఈనెల 29న ఫిట్నెస్ పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చేనెల 4 నుంచి వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొనే జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో ఫిట్నెస్‌పరంగా ఓకే అయితే సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది.

09/26/2018 - 23:05

దుబాయ్, సెప్టెంబర్ 26: భారత్ వంటి అత్యుత్తమ క్రికెట్ జట్టుతో జరిగిన పోరును టైగా ముగించడాన్ని తమ జట్టు మరిచిపోలేని విజయంకన్నా గొప్ప విషయంగా భావిస్తోందని ఆఫ్గనిస్తాన్ జట్టు సారధి అస్గార్ ఆఫ్గాన్ పేర్కొన్నాడు. మంగళవారం రాత్రి ఇరు జట్లు నువ్వానేనా అనే విధంగా సాగించిన ఉత్కంఠభరిత పోరాటాన్ని ఆయన గుర్తుచేస్తూ మహమ్మద్ షహజాద్ అద్భుత సెంచరీతో తమ జట్టు 252 స్కోర్ చేయడానికి తోడ్పడ్డాడన్నాడు.

09/26/2018 - 02:27

శ్రీలంక: శ్రీలంకతో జరిగిన ఐదు టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌ను భారత మహిళా జట్టు కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒకటి రద్దు కాగా, మిగిలిన నాలుగింట్లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన ఐదో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 17.4 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.

09/26/2018 - 00:06

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ప్రభుత్వ సంస్థలకు, గోల్ఫ్‌కు మధ్య సమాచార లోపం కారణంగా అదితి అశోక్ అర్జున అవార్డును కోల్పోయింది. మహిళా గోల్ఫ్ అసోసియేషన్ మంగళవారం నాడిక్కడ ఈ విషయంపై విచారం వ్యక్తం చేసింది. అర్జున అవార్డుల జాబితాలో అదితి అశోక్ పేరు లేకపోవడం తమకు షాక్‌కు గురిచేసిందని డబ్ల్యుజిఏఎల్ సెక్రటరీ జనరల్ చంపికా సాయల్ చెప్పారు.

09/25/2018 - 23:30

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: టెస్ట్ క్రికెట్ స్వరూపాన్ని మార్చాలని చూడటం మంచిది కాదని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. టెస్ట్ మ్యాచ్‌ను ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు కుదించాలన్న ఆలోచనను ఆయన విభేదించాడు. సంప్రదాయబద్ధమైన ఫార్మట్‌ను మార్చడానికి ఐసీసీ ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా స్పందించాడు.

09/25/2018 - 23:27

బాటుమి (జార్జియా), సెప్టెంబర్ 25: 43వ చెస్ ఒలింపియాడ్‌ను భారత క్రీడాకారులు విజయాలతో ఆరంభించారు. మంగళవారం నుంచి ఇక్కడ ప్రారంభమైన పోటీల్లో మహిళల జట్టు న్యూజీల్యాండ్‌పై 4-0 తేడాతో విజయం సాధించింది. కోనేరు హంపి, ఈషాకరావడే, పద్మినీ రౌత్‌లు సునాయాస విజయాలను నమోదు చేయగా, టీనాసచ్‌దేవ్ మాత్రమే కొంత తడబాటుకు గురయింది.

09/25/2018 - 23:23

అబూదాబి, సెప్టెంబర్ 25: సూపర్ ఫోర్ గేమ్‌లో భాగంగా ఆసియా కప్‌లో భారత్ చేతిలో ఘోరంగా దెబ్బతిన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు బుధవారం జరిగే సెమీఫైనల్స్‌లో తలపడనున్నాయి. ఈ పోటీలో గెలుపొందిన జట్టు ఫైనల్ పోరులో భారత్‌తో పోరాడుతుంది. బంగ్లా, పాక్ జట్ల ఆటతీరును బేరీజు వేసుకుంటే ఒక విధంగా పాకిస్తాన్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్ల సెమీస్ పోరుకు ఇక్కడి షీఖ్ జాయెద్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది.

Pages