S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/03/2018 - 01:50

పారిస్, జూన్ 2: రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్ చేరింది. మూడో రౌండ్‌లో ఆరో సీడ్ కరోలినా ప్లిస్కోవాను ఆమెను 6-2, 6-1 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేసింది.

06/03/2018 - 01:47

న్యూఢిల్లీ, జూన్ 2: అఫ్గానిస్తాన్‌తో ఈనెల 14న బెంగళూరులో జరుగనున్న చరిత్రాత్మాక ఏకైక టెస్టుకు టీమిండియా టెస్టు జట్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా దూరమైన నేపథ్యంలో అతని స్థానంలో దినేష్ కార్తీక్‌కు బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ అవకాశం కల్పించింది.

06/03/2018 - 01:41

న్యూఢిల్లీ, జూన్ 2 వివిధ కీలక అంశాలను చర్చించడానికి ఈనెల 22న నిర్వహించతలపెట్టిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)ను రద్దు చేయాలని బీసీసీఐ పాలనాధికారుల బృందం (సీఓఏ) చేసిన ప్రతిపాదనను బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి తీవ్రంగా వ్యతిరేకించాడు. వివిధ యూనిట్లు కోరడం వల్లనే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు శనివారం ఆయన పీటీఐతో మాట్లాడుతూ చెప్పాడు.

06/03/2018 - 01:41

డెహ్రాడూన్, జూన్ 2: బెంగళూరులో ఈనెల 14 టీమిండియాతో జరిగే ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌లో పోరుకు తమ క్రికెటర్లు అన్నివిధాల సంసిద్ధంగా ఉన్నారని అఫ్గానిస్తాన్ కోచ్ ఫిల్ సిమన్స్ తెలిపాడు. ఈనెల 3వ తేదీ నుండి బంగ్లాదేశ్‌తో తమ టీమ్ మూడు టీ-20 సిరీస్‌లలో తలపడనున్న నేపథ్యంలో ఇప్పటికే జట్టు సభ్యులంతా సన్నద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు.

06/03/2018 - 01:39

న్యూఢిల్లీ, జూన్ 2: ఇండోనేషియాలో ఈ ఏడాది ఆగస్టు 18 నుంచి జరిగే ఆసియా గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారుల తల్లిదండ్రులకు అక్రిడిటేషన్ ఇచ్చే విషయమై ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తామని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) స్పష్టం చేసింది.

06/03/2018 - 01:57

లండన్, జూన్ 2: మరికొద్ది రోజుల్లో రష్యాలో ఫిఫా ప్రపంచకప్ చాంపియన్‌షిప్ ప్రారంభంకానున్నది. టోర్నమెంట్‌లో పాల్గొంటున్న వివిధ దేశాల జట్లు అతిధ్య దేశానికి చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇంగ్లాండ్ అటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తోంది. ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో భాగంగా కబడ్డీ ఆడుతూ కనిపించారు.

06/03/2018 - 01:38

పారిస్, జూన్ 2: ప్రపంచకప్ సాకర్ చాంపియన్‌షిప్ త్వరలో ప్రారంభం కానుండటంతో అభిమానులకు ‘సాకర్’ ఫీవర్ పట్టుకుంది. ప్రపంచకప్‌లో భాగంగా నైస్‌లో ఫ్రాన్స్-ఇటలీ జట్ల మధ్య స్నేహపూర్వక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఫ్రెంచ్ 3-1 గోల్స్ తేడాతో ఇటలీపై విజయం సాధించింది. ప్రపంచకప్‌లో భాగంగా నిర్వహించిన మ్యాచ్‌లో ఇది రెండవది.

06/03/2018 - 01:38

ఇంఫాల్, జూన్ 2: డోపింగ్ పరీక్షలో దొరికిన సంజితా ఛాను కేసులో జోక్యం చేసుకోవాల్సిందిగా కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌ను మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ కోరారు. సంజిత ‘శాంపిల్’లో నిషిద్ధ ఉత్ప్రేరకాల ఆనవాళ్లు ఉన్నట్టు వాడా ప్రకటించడంతో అంతర్జాతీయ వెయట్ లిఫ్టింగ్ సమాఖ్య ఆమెను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయతే, తాను నిర్దోషినని సంజిత వాదిస్తోంది.

06/02/2018 - 04:12

న్యూఢిల్లీ: సినిమా హీరోయన్లతో చెట్టపట్టాలేసుకొని తిరిగిన విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ వంటి క్రికెటర్ల జాబితాలో తాజాగా లోకేష్ రాహుల్ కూడా చేరడంతో, అంతటా అదే చర్చ కొనసాగుతున్నది. కోహ్లీ, యువరాజ్ తాము ప్రేమించిన నటీమణులనే వివాహం చేసుకుంటే, రాహుల్ ఎప్పుడు ఓ ఇంటివాడవుతాడన్నది ఆసక్తి రేపుతున్నది.

06/02/2018 - 03:29

న్యూఢిల్లీ, జూన్ 1: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ), దాని రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న పాలనాధికారుల బృందం (సీఓఏ) మధ్య ఆధిపత్య పోరాటం తీవ్ర స్థాయికి చేరింది. ఈనెల 22న జరపాలని నిర్ణయించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)పై ఇరు వర్గాలు పట్టుదలకు పోవడంతో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Pages