S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/06/2018 - 01:23

లండన్, జూన్ 5: భారత్‌లో నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడటం కలిసొచ్చిందని, తనలో ఆత్మ విశ్వాసం రెట్టింపు చేసిందని ఇంగ్లాండ్ క్రికెటర్ బట్లర్ స్పష్టం చేశాడు. బట్లర్ రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించి ఐపీఎల్ 11వ సీజన్‌లో బ్యాటింగ్‌లో రాణించి ఐదు అర్ధ సెంచరీలు సాధించాడు.

06/06/2018 - 01:21

నూఢిల్లీ, జూన్ 5: అంతర్జాతీయ బాడ్మింటన్‌లో రాణిస్తూ మేటి స్టార్లుగా ఎదుగుతున్న సైనా నెహ్వాల్, పీవీ సింధుల రూటే సెపరేటు. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామనె్వల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన సైనా, సింధులకు జాతీయ కోచ్ గోపిచంద్ వేర్వేరుగా శిక్షణ ఇవ్వడం చర్చానీయంశంగా మారింది.

06/05/2018 - 00:11

** క్రీడాభిమానులను అలరించే వరల్డ్ కప్ సాకర్ చాంపియన్‌షిప్ ఈనెల 14 నుంచి రష్యాలో మొదలుకానుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీక్షించే ఫిఫా వరల్డ్ కప్‌ను క్రీడా రంగంలోనే అతిపెద్ద టోర్నీల్లో ఒకటిగా పేర్కొంటారు. ఒలింపిక్స్‌తర్వాత అంతటి ఆదరణ ఉన్న ఏకైక క్రీడా ఈవెంట్‌గా కూడా వరల్డ్ కప్ సాకర్ గుర్తింపు సంపాదించింది. ఇంతటి ఆదరణ పొందిన ఈ మెగా టోర్నమెంట్ 1930లో మొదలైంది.

06/05/2018 - 00:06

కౌలాలంపూర్, జూన్ 4: భారత మహిళ క్రికెట్ జట్టు ఆసియా కప్ టీ-20 మ్యాచ్‌లో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. (్భరత్ తన ప్రారంభ మ్యాచ్‌లో మలేషియాను 142 పరుగులతో ఓడించింది). సోమవారం ఇక్కడ థాయిలాండ్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో 66 పరుగులతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన విజయం సాధించింది.

06/05/2018 - 00:03

లివర్‌పూల్, జూన్ 4: బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ స్టయికర్ నేమార్ ఆరోగ్యం నుంచి కోలుకుని వరల్డ్ కప్ కంటే ముందు బరిలోకి దిగడంతో అతని అభిమానులు ఊపిరిపీల్చుకుంటున్నారు.

06/05/2018 - 00:01

పారిస్, జూన్ 4: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ వైదొలగింది. ఇప్పటికే మూడో రౌండ్ దాటి సోమవారం నాలుగో రౌండ్‌లో తన చిరకాల ప్రత్యర్థి గ్రాండ్‌శ్లామ్ దిగ్గజం మారియా షరపోవాతో పోటీ పడాల్సిన కొన్ని నిమిషాల ముందు ఛాతీ కండరం నొప్పితో వేధిస్తుండడంతో వైదొలగుతున్నట్టు 36 ఏళ్ల సెరెనా ప్రకటించడమే కాకుండా ఇది తనకు నిరాశను కలిగించిందని పేర్కొంది.

06/04/2018 - 23:59

ముంబయి, జూన్ 4: తన ఫుట్‌బాల్ చరిత్రలో 100వ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడబోతున్న సందర్భంగా ఒక జట్టు కెప్టెన్ చేసిన విజ్ఞప్తి మేరకు అభిమానులు చెప్పనలవికాని విధంగా స్పందించారు. భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ ముంబయి ఫుట్‌బాల్ మైదానంలో కెన్యాతో తలపడనున్న ఇంటర్ కాంటినెంటల్ కప్ గేమ్ సందర్భంగా తన అభిమానులకు పిలుపునిచ్చాడు.

06/04/2018 - 03:25

న్యూఢిల్లీ: ఫుట్‌బాల్ మ్యాచ్‌లను కూడా చూడాలని, అన్ని క్రీడలను ఒకే రీతిలో అదరించినప్పుడే క్రీడాభారతాన్ని చూడగలుగుతామని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పిలుపునిచ్చాడు. నాలుగు దేశాల ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా ఆదివారం ముంబయిలో జరిగే గ్రూప్ మ్యాచ్‌ని తిలకించేందుకు స్టేడియానికి తరలి రావలని భారత సాకర్ జట్టు కెప్టెన్ సునీల్ ఛత్రీ ట్విటర్ ద్వారా చేసిన సూచనపై కోహ్లీ స్పందించాడు.

06/04/2018 - 01:57

చిత్రం..జర్మనీ గోల్‌కీపర్ మాన్యుయెల్ న్యూయెర్

06/04/2018 - 01:52

క్లాగెన్‌ఫర్ట్ (ఆస్ట్రియా), జూన్ 3: ప్రపంచ కప్ సాకర్ డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఈనెల 14 నుంచి రష్యాలో ప్రారంభం కానున్న వరల్డ్ కప్‌కు సిద్ధమవుతున్న ఈ జట్టుకు గోల్‌కీపర్ మాన్యుయెల్ న్యూయెర్ గాయం సమస్యగా మారింది. అయితే, ఆస్ట్రియాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో న్యూయెర్ బరిలోకి దిగాడు. మోకాలి గాయం నుంచి కోలుకొని, పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నానని నిరూపించుకున్నాడు.

Pages