S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/20/2018 - 01:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దాదాపు పదేళ్లుగా ఇండియన్ టేబుల్ టెన్నిస్‌ను తన భుజస్కంధాలపై మోస్తున్న తనకు మనీకా భాత్రా రూపంలో కొత్త స్టార్ క్రీడాకారిణి దొరికిందని, దీంతో తనపై చాలావరకు భారం తగ్గినట్టు ఫీలవుతున్నానని భారత సీనియర్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్ వ్యాఖ్యానించాడు.

04/20/2018 - 01:06

ముంబయి, ఏప్రిల్ 19: గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో సింగపూర్ జట్టును ఓడించడం తమలో విశ్వాసాన్ని మరింత పెంచిందని, తద్వారా గోల్డ్ మెడల్ సాధించామని భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మధురికా పట్కర్ పేర్కొంది. జకార్తా, ఇండోనేషియాలలో ఈ ఏడాది ఆగస్టు 18 నుంచి నిర్వహించనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనే ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహిస్తున్న మనీకా బాత్రాతో కలసి ఆమె పాల్గొననుంది.

04/20/2018 - 01:06

దుబాయ్, ఏప్రిల్ 19: వెస్టిండీస్‌లో పర్యటించే ఐసీసీ టీ-20 ఎలెవెన్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు షహీద్ అఫ్రిదీ, షోయబ్ మాలిక్‌కు చోటు దక్కింది. ఇంగ్లాండ్ వనే్డ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహించే ఐసీసీ జట్టులో శ్రీలంక స్టార్ బౌలర్ తిసర పెరెరా కూడా ఉన్నాడు. గత ఏడాది ‘ఇర్నా’, ‘మరియా’ తుపాన్లు సృష్టించిన బీభత్సంలో వెస్టిండీస్‌లోని చాలా స్టేడియాలు దారుణంగా దెబ్బతిన్నాయి.

04/20/2018 - 01:05

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశంలో క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, ఈ సమయంలో డోప్ సంఘటనలను ఉపేక్షించేది లేదని కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్‌తో పాటు భారత ఒలింపిక్ సంఘం (ఐఓసీ), ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ)ల ప్రతినిధుల బృందంతో ఆయన సమవేశమయ్యాడు.

04/20/2018 - 01:05

చెన్నై, ఏప్రిల్ 19: తమిళనాడులో రాజుకున్న కావేరి జలాల తరలింపు వివాదం కారణంగా చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లను పుణెకు తరలించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రెండేళ్ల నిషేధం తర్వాత సొంతగడ్డపై చెన్నై ఆడుతుంటే చూడాలని అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూశారు. కానీ ఇక్కడ జరగాల్సిన మిగిలిన మ్యాచ్‌లన్నీ పుణెకు తరలించడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు.

04/20/2018 - 01:04

మొహాలీ, ఏప్రిల్ 19: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ మ్యాచ్‌లో భాగంగా ఇక్కడి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన పోరులో పంజాబ్ జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

04/19/2018 - 02:21

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: బర్మింగ్‌హామ్‌లో 2022 సంవత్సరంలో నిర్వహించే కామనె్వల్త్ గేమ్స్‌లో షూటింగ్ అంశాన్ని చేర్చకపోవడం యువ షూటర్లకు అతి పెద్ద విఘాతం కలిగిస్తుందని ప్రముఖ షూటర్ జితూ రాయ్ ఆందోళన వ్యక్తం చేశాడు.

04/19/2018 - 02:27

విజయవాడ, ఏప్రిల్ 18: వచ్చే ఆసియన్, ఒలింపిక్ గేమ్స్‌లో పతకాలు సాధించాలని వెయిట్‌లిఫ్టర్ ఆర్వీ రాహుల్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోర్టులో ఇటీవల జరిగిన 21వ కామన్‌వెల్త్ క్రీడా పోటీల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పతకాన్ని రాహుల్ సాధించిన విషయం తెలిసిందే.

04/19/2018 - 02:23

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల నిర్వహించిన 21వ కామనె్వల్త్ గేమ్స్‌లో (జావెలిన్ త్రో) మన దేశానికి తొలిసారిగా గోల్డ్ మెడల్ అందించిన ఘనత సాధించిన అథ్లెట్ నీరజ్ చోప్రా ఇపుడు మరో గోల్డ్ మెడల్‌పై కనే్నశాడు.

04/19/2018 - 02:03

ముంబయి, ఏప్రిల్ 18: ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పటిష్టమైన బౌలింగ్ వ్యవస్థ ఉందని, దీంతో ఎలాంటి వారినైనా ఢీకొనే సత్తా ఉందని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ అన్నాడు. బుధవారం ఇక్కడ పీటీఐతో ఆయన మాట్లాడుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశాడు.

Pages