S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/10/2018 - 01:10

న్యూఢిల్లీ, జనవరి 9: డోపింగ్ టెస్టులో దొరికిపోయిన భారత ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్‌పై ఐదు నెలలపాటు విధించిన సస్పెన్షన్ వేటును మరికొద్దిరోజుల్లో ఎత్తివేయనున్నారు. బీసీసీఐ యాంటీ డోపింగ్ సిబ్బంది పఠాన్ నుండి శాంపిళ్లను సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఇందులో యూసుఫ్ టెర్బుటలైన్ అనే ఉత్ప్రేరకం వాడినట్టు తేలింది. ‘వాడా’ నిబంధనల ప్రకారం దేశవాళీ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు దీనిని వాడకూడదు.

01/10/2018 - 01:09

న్యూఢిల్లీ, జనవరి 9: వయసు 44 ఏళ్లు.. తన ఖాతాలో ఇప్పటికే 18 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు, ఓ ఒలింపిక్ పతకం.. అందుకేనేమో.. తాను అన్నీ సాధించినట్లేనని, ఇప్పుడు తనకు కొత్త లక్ష్యాలేవీ లేవని అంటున్నాడు ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్. అయినప్పటికీ ఆట మీద మమకారం వదులుకోలేక అడపాదడపా ఏదో ఒక టోర్నమెంటులో మెరుస్తునే ఉంటాడు.

01/10/2018 - 01:08

మెల్‌బోర్న్, జనవరి 9: తన కెరీర్‌లో ఇప్పటివరకు 20 గ్లాండ్‌స్లామ్ పోటీల్లో విజయం సాధించిన అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టెన్నిస్ ఆటగాడు, 36 ఏళ్ల రోజర్ ఫెదరర్ ఇపుడు ఆస్ట్రేలియన్ ఓపెన్‌పై కనే్నశాడు. 2017లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్‌లో విజయం సాధించడం ద్వారా ఘనత సాధించిన విషయం తెలిసిందే. ఇపుడు మళ్లీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌పై దృష్టి సారించిన ఫెడరర్‌కు అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి.

01/10/2018 - 01:07

న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య మంగళవారం జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా వర్షం కురవడంతో మైదానాన్ని కప్పుతున్న దృశ్యం

01/10/2018 - 01:06

కొలంబో, జనవరి 9: 2019-ప్రపంచ కప్ పోటీల నేపథ్యంలో ఏంజిలో మాథ్యూస్‌ను ‘పరిమిత ఓవర్ల’ క్రికెట్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆల్ రౌండర్’గా ప్రఖ్యాతి చెందిన 30 ఏళ్ల మాథ్యూస్ కెప్టెన్ పదవి నుంచి వైదొలగిన ఆరు నెలలకే బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వరుసగా గాయాల పాలు కావడంతో గత జూలైలో కెప్టెన్సీతో పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కూ మాథ్యూస్ దూరమయ్యాడు.

01/10/2018 - 01:05

సిడ్నీ, జనవరి 9: వచ్చేనెలలో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో జరిగే టి-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అసిస్టెంట్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ సిరీస్‌లలో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టుకు డర్రెన్ లెహ్మన్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. అతనికి సహాయకులుగా ట్రోయ్ కూలీ, మాథ్యూ మోట్ వ్యవహరిస్తారు. 2019తో లెహ్మన్ కాంట్రాక్ట్ పీరియడ్ ముగుస్తుంది.

01/10/2018 - 01:04

మెల్‌బోర్న్, జనవరి 9: ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌గా అతవరించేందుకు తాను శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉన్నానని 12 సార్లు గ్రాండ్‌స్లామ్ విన్నర్‌గా నిలిచిన ఆటగాడు నవోజ్ జుకోవిక్ అన్నాడు. ఈ ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఆటగాడు కూడా గాయాలబారిన పడి దాదాపు ఆరునెలలపాటు విశ్రాంతి తీసుకుని, గత ఏడాది నవంబర్ నుండి మళ్లీ ముమ్మరంగా ప్రాక్టీసు చేస్తున్నాడు.

01/09/2018 - 01:40

కేప్ టౌన్, జనవరి 8: మొదటి రోజు ఆటతోనే లో స్కోరింగ్ మ్యాచ్‌గా కొనసాగే అవకాశం ఉందని అందరూ అనుమానించిన విధంగానే భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్టు ముగిసింది. ప్రత్యర్థిని రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే కట్టడి చేసిన ఆనందం విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టుకు ఎక్కువ సేపు నిలవలేదు. 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌటైంది.

01/09/2018 - 00:44

దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్: 73.1 ఓవర్లలో 286 (ఏబీ డివిలియర్స్ 65, ఫఫ్ డు ప్లెసిస్ 62, క్వింటన్ డి కాక్ 43, వెర్నన్ ఫిలాండర్ 23, కేశవ్ మహారాజ్ 35, కాగిసో రబదా 26, డేల్ స్టెయిన్ 16 నాటౌట్, భువనేశ్వర్ కుమార్ 4/87, అశ్విన్ 2/21).

01/09/2018 - 00:43

న్యూఢిల్లీ, జనవరి 8: న్యూజిలాండ్‌తో ఈనెల 17 నుంచి జరుగనున్న హాకీ సిరీస్‌లో భారత్ గోల్‌కీపర్ పి.ఆర్.శ్రీజేష్‌కు మళ్లీ చోటు దక్కింది. మోకాలి నొప్పితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన గత ఏడాది జరిగిన కొన్ని కీలక మ్యాచ్‌లలో పాల్గొనలేకపోయాడు. అయితే, ప్రస్తుతం ఫిట్‌గా ఉండడంతో మళ్లీ ఎనిమిది నెలల విరామం తర్వాత అతనికి హాకీ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.

Pages