S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/06/2018 - 01:38

మెల్బోర్న్, జనవరి 5: డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి వైదొలగింది. ఈమెగా టోర్నీలో ఆడేందుకు మెల్బోర్న్ వచ్చినప్పటికీ, మోచేతి గాయం కారణంగా వైదొలగుతున్నట్టు బ్రిటిష్ స్టార్ ఆండీ ముర్రే ప్రకటించి ఇరవ, నాలుగు గంటలు కూడా గడవక ముందే సెరెనా కూడా అలాంటి ప్రకటనే విడుదల చేసింది.

01/06/2018 - 01:37

షెన్‌జెన్ (చైనా), జనవరి 5: ఇక్కడ జరుగుతున్న షేన్‌జెన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రష్యా బ్యూటీ మరియా షరపోవా పోరాటానికి తెరపడింది. సెమీ ఫైనల్స్‌లో ఆమె పరాజయాన్ని ఎదుర్కొంది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన కాతెరీన సినియాకొవాను ఢీకొన్న 30 ఏళ్ల షరపోవా 2-6, 6-3, 3-6 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. కాగా, టైటిల్ కోసం సినియాకొవా ఫైనల్‌లో సిమోనా హాలెప్‌తో తలపడుతుంది.

01/05/2018 - 01:21

మెల్బోర్న్, జనవరి 4: బ్రిటిష్ టెన్నిస్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ ఆండీ ముర్రే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ నుంచి వైదొలిగాడు. కాలి కండరాల నొప్పి కారణంగా అతను సుమారు ఎనిమిది నెలలుగా ఏటీపీ టోర్నీలకు దూరమయ్యాడు. ఇప్పుడు కోలుకున్నానని, ఆస్ట్రేలియా ఓపెన్‌కు సిద్ధంగా ఉన్నానని రెండు రోజుల క్రితం ఇక్కడికి చేరుకున్న ముర్రే ప్రకటించాడు.

01/05/2018 - 01:19

కేప్ టౌన్, జనవరి 4: జట్టులోని మిగతా ఆటగాళ్లకు ఎలావున్నా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాత్రం దక్షిణాఫ్రికా టూర్ పరీక్షగా నిలవనుంది. తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తూ, భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా ఎదిగిన కోహ్లీ ప్రతిభాపాటవాలు విదేశాల్లో ఏ విధంగా కొనసాగుతాయన్నది ప్రశ్న.

01/05/2018 - 01:17

* ఇరు జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో భారీ విజయం దక్షిణాఫ్రికా పేరిట ఉంది. 2008లో అహ్మదాబాద్ టెస్టులో ఆ జట్టు ఇన్నింగ్స్ 90 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. అంతకు ముందు 2000 సంవత్సరం మార్చి నెలలో బెంగళూరు టెస్టులో ఇన్నింగ్స్ 71 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.

01/05/2018 - 01:17

షెన్‌జెన్, జనవరి 4: ప్రపంచ మాజీ నంబర్ వన్, రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా ఇక్కడ జరుగుతున్న షెన్‌జెన్ ఓపెన్ టోర్నమెంట్‌లో సెమీస్ చేరింది. క్వార్టర్ ఫైనల్‌లో ఆమె జరినా దియాస్ (ఖజకస్థాన్)ను 6-3, 6-3 తేడాతో ఓడించింది. 30 ఏళ్ల షరపోవా చాలా కాలం తర్వాత తన పూర్వవైభవాన్ని గుర్తుకు తెచ్చే రీతిలో ఆడుతున్నది.

01/05/2018 - 01:15

కెరీర్‌లో వరుసగా 150వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలస్టర్ కుక్. విరామం లేకుండా ఎక్కువ వరుస టెస్టులు ఆడిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అలాన్ బార్డర్ (153) తర్వాత అతను రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఇంగ్లాండ్ తరఫున అత్యధిక టెస్టులు ఆడింది కూడా అతనే.

01/05/2018 - 01:14

సిడ్నీ, జనవరి 4: ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభమైన చివరి, ఐదో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఐదు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. మొదటి మూడు మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కొని, సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన ఇంగ్లాండ్ నాలుగో టెస్టును డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. చివరి టెస్టును సాధించి, కొంతైనా ఊరట పొందాలనుకుంటున్న ఈ జట్టు టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది.

01/05/2018 - 01:13

కేప్ టౌన్, జనవరి 4: దక్షిణాఫ్రికాతో కష్టతరంగా భావిస్తున్న టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుండగా, టీమిండియా క్రికెటర్లు గురువారం నాటి అత్యంత కీలకమైన ప్రాక్టీస్ సెషన్‌కు డుమ్మా కొట్టారు. ఈ టెస్టుకు ముందు ఒక వామప్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా, దానిని రద్దు చేయించుకున్న భారత జట్టు ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్‌ను కూడా వినియోగించుకోలేదు.

01/05/2018 - 01:12

కొలంబో, జనవరి 4: శ్రీలంక వనే్డ జట్టు కెప్టెన్సీని తిసర పెరెరా కోల్పోనున్నాడు. ఈ పదవి నుంచి అతనిని తొలగించాలని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) తీర్మానించింది. అతని స్థానంగా జట్టు పగ్గాలను మరొకరికి అప్పగించనుంది. పెరెరా కెప్టెన్సీలో లంక వరుస పరాజయాలను ఎదుర్కోవడంతో, అతనిని తొలగిస్తున్నది. కాగా, కెప్టెన్సీ రేసులో మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్, టెస్టు జట్టు కెప్టెన్ దినేష్ చండీమల్ ఉన్నారు.

Pages