S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/08/2018 - 02:47

ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ జెఫ్ బాయ్‌కాట్ కెరీర్‌ను కొనసాగించిన కాలంలో చిరకాల ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియా అంటేనే మండిపడేవాడు. క్రికెట్ నుంచి రిటైరై, కామెంటేటర్‌గా స్థిరపడిన అతను, ప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ మైదానంలో జరుగుతున్న చివరి టెస్టులో బ్యాగీ గ్రీన్ టోపీ పెట్టుకొని అందరి దృష్టినీ ఆకర్షించాడు.

01/08/2018 - 02:46

న్యూఢిల్లీ, జనవరి 7: విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న టీమిండియా విదేశాల్లోనూ అద్భుత విజయాలు సాధిస్తుందని, తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తుందని నరేంద్ర బండే అనే జోతిష్కుడు ఘంటాపథంగా చెప్తున్నాడు. విదేశాల్లో టోర్నీలను, సిరీస్‌లను భారత క్రికెట్ జట్టు గెల్చుకోలేకపోతున్నదని ఇన్నాళ్లూ ఉన్న ముద్ర ఇకపై తొలగిపోతున్నదని పీటీఐతో మాట్లాడుతూ బండే ధీమా వ్యక్తం చేశాడు.

01/08/2018 - 02:45

నూఢిల్లీ, జనవరి 7: న్యూఢిల్లీ, చండీగఢ్ మార్గంలోని అలీపూర్ గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు పవర్‌లిఫ్టర్లుసహా మొత్తం నలుగురు మృతి చెందారు. ఇద్దరు తీవ్రగా గాయపడ్డారు. వారిలో ప్రపంచ జూనియర్ చాంపియన్ సాక్షమ్ యాదవ్ ఉన్నాడు.

01/08/2018 - 02:44

కరాచీ, జనవరి 7: భారత క్రికెట్ జాతీయ సెలక్షన్ కమిటీ మాదిరిగానే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆటగాళ్ల ఎంపిక జరగాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి మాజీ కెప్టెన్ సల్మాన్ బట్, జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన కమ్రాన్ అక్మల్ సూచించారు. పాక్ జాతీయ సెలక్టర్లతో పోలిస్తే, భారత సెలక్టర్ల ఎంపిక ఎంతో బాగుందని, అందుకే, ఆటగాళ్లు రాణిస్తున్నారని అన్నారు.

01/08/2018 - 02:43

ఇస్లామాబాద్, జనవరి 7: తాను మూడో పెళ్లి చేసుకున్నట్టు వచ్చిన వార్తలను రాజకీయ నాయకుడిగా మారిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఖండించాడు. బుస్రా మనేకా అనే మహిళను తాను ప్రపోజ్ మాత్రమే చేశానని తెలిపాడు. మనేకాను మూడో పెళ్లి చేసుకునే విషయమై ఆమె కుటుంబ సభ్యులు, ఆమె పిల్లలదే తుది నిర్ణయమని ఆదివారం ఇమ్రాన్ ఖాన్ తరఫున ఆయన ప్రతినిధి ఒకరు పేర్కొన్నాడు.

01/08/2018 - 02:42

ఆక్లాండ్, జనవరి 7: ఆక్లాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను 29 ఏళ్ల జర్మనీ క్రీడాకారిణి జూలియా జార్జస్ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఆమె ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకిని 6-4, 7-6 తేడాతో ఓడించింది. మొదటి సెట్ నుంచే వొజ్నియాకిపై విరుచుకుపడిన ఆమె, ఒకానొక దశలో గంటకు 180 కిలోమీటర్లు (112 మైళ్లు) వేగంతో బంతిని సర్వ్‌చేసి సత్తా చాటాంది. బలమైన సర్వీసులే ఆమె విజయంలో కీలక పాత్ర పోషించాయి.

01/07/2018 - 01:26

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు లో స్కోరింగ్ మ్యాచ్‌గా ముగిసే లక్షణాలు కనిపిస్తున్నాయ. మొదటి రోజు ఆటలో 13 వికెట్లు కూలితే, రెండో రోజున కూడా దాదాపు అదే పరిస్థితి కొనసాగింది. మొత్తం 9 వికెట్లు పడ్డాయి
*

01/07/2018 - 01:23

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 73.1 ఓవర్లలో 286 ఆలౌట్ (ఏబీ డివిలియర్స్ 65, ఫఫ్ డు ప్లెసిస్ 62, క్వింటన్ డికాక్ 43, వెర్నర్ ఫిలాండర్ 23, కేశవ్ మహాజన్ 35, కాగిసో రబదా 26, డేల్ స్టెయిన్ 16 నాటౌట్, భువనేశ్వర్ కుమార్ 4/87, అశ్విన్ 2/21, హార్దిక్ పాండ్య 1/53, జస్‌ప్రీత్ బుమ్రా 1/73, మహమ్మద్ షమీ 1/47).

01/07/2018 - 01:23

వెల్లింగ్టన్, జనవరి 6: కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ అద్భుత సెంచరీతో రాణించడంతో, పాకిస్తాన్‌తో శనివారం ఇక్కడ జరిగిన మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌ను న్యూజిలాండ్ 61 పరుగుల తేడాతో గెల్చుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

01/07/2018 - 01:21

చెన్నై, జనవరి 6: చెన్నై సూపర్ జెయింట్స్ సంబరాలు చేసుకుంటున్నది. రెండేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి అడుగుపెట్టడం అందుకు ఒక కారణమైతే, సూపర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని రీటైన్ చేయాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మరో కారణం.

Pages