S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/13/2018 - 00:23

రాజమహేంద్రవరం, జూన్ 12: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత నాలుగేళ్లుగా రెండు అబద్దాల సినిమాలు చూపిస్తున్నారని, అందులో ఒకటి అమరావతి, రెండోది పోలవరం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఎద్దేవాచేశారు. గ్రాఫిక్స్‌తోనే ఇదిగో సింగపూర్, అదిగో జపాన్ అంటూ రాజధాని పేరిట ఒక సినిమా చూపిస్తున్నారన్నారు.

06/13/2018 - 00:19

విశాఖపట్నం, జూన్ 12: విశాఖ విమానాశ్రయంలో నవంబర్ నుంచి రోజూ కొన్ని సమయాల్లో పౌర విమానాల రాకపోకలపై నేవీ ఆంక్షలు విధించబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఎయిర్ అధారిటీ ఆఫ్ ఇండియాకు విశాఖలోని తూర్పు నౌకాదళ అధికారులు పంపించారు. విశాఖకు వచ్చే విమానాలపై ఆంక్షలు విధించడంపై నగరంలోని పలు సంస్థలు అభ్యంతరం తెలియచేశాయి. టీడీపీ కూడా విమానాల రాకపోకలపై కేంద్రం ఆంక్షలు విధించడం తగదని పేర్కొంది.

06/13/2018 - 00:17

విజయవాడ, జూన్ 12: కేంద్రం నుంచి ఎలాంటి చేయూత లేనప్పటికీ సొంత వనరులతోను, తెలివితేటలతోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి అమలుచేస్తున్న బృహత్తర ప్రాజెక్టుల నిర్మాణాలపై దెయ్యపు కళ్లు పడకుండా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

06/13/2018 - 02:05

న్యూఢిల్లీ, జూన్ 12: విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ అభిమతమని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మొదటిసారి కన్నా ప్రధాని మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

06/12/2018 - 17:55

అనంతపురం: రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురంలో సీపీఎం చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఓ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఆందోళనలో కొందరు మహిళా పోలీసులు, సీపీఎం కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. సీపీఎం నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాలు పోటీపోటీగా నెట్టుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

06/12/2018 - 15:57

హైదరాబాద్‌: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు వివేక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వివేక్ ఎన్నిక చెల్లదంటూ అంబుడ్స్‌మన్‌ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా పునర్విచారణ జరపాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం ఆదేశించింది. కోర్టు తాజా ఉత్తర్వులతో వివేక్ మరోసారి పదవి కోల్పోనున్నారు.

06/12/2018 - 13:26

కరీంనగర్: జిల్లాలోని ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు తండ్రి కొడుకులను కత్తులతో పొడిచి హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు.

06/12/2018 - 13:14

పెద్దపల్లి: మంత్రి హరీశ్ రావు మంగళవారం ఉదయం సుందిళ్ల బరాజ్ పనులను పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులు, కలెక్టర్‌తో సమావేశం నిర్వహించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ పనుల ప్రణాళికపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజువారి ప్రణాళిక రూపొందించి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు.

06/12/2018 - 13:07

తిరుమల: తిరుమల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్, నటి ప్రేమ కుటుంబసభ్యులతో కలిసి ఉదయం వీఐపీ విరామ సమయంలో వెంకన్నను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

06/12/2018 - 04:23

హైదరాబాద్: వర్షాకాలంలో రైల్వే ట్రాక్‌ల పట్ల ముందస్తు తనిఖీలు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (జిఎం) వినోద్‌కుమార్ యాదవ్ ఆదేశించారు. వర్షాలకు చెరువులు, కాలువలు పొంగి రైల్వే ట్రాక్‌లపై ప్రవహించే ప్రాంతాలను ముందుగానే అంచనా వేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. సోమవారం నాడిక్కడ రైల్ నిలయంలో ‘్భద్రత’పై నిర్వహించిన సమీక్షలో పలు అంశాలను చర్చించారు.

Pages