S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/11/2018 - 00:38

వరంగల్, జూన్ 10: దేశంలో దళితులపై మోదీ ప్రభుత్వం, బీజేపీ దాడులు చేస్తోందని లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి వరంగల్‌లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అధ్యక్షతన జరిగిన దళిత, గిరిజన సంఘాల సింహగర్జన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లో దళితులపై రోజురోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు.

06/11/2018 - 03:34

విజయవాడ: రాష్టవ్య్రాప్తంగా కొద్దిరోజులుగా బీజేపీ కార్యకర్తలు, నాయకులపై జరుగుతున్న భౌతిక దాడులు, అనుచిత వ్యాఖ్యలకు ఇక అన్నిస్థాయిల్లో ఎదురుదాడితో చెక్ పెట్టాలని బీజేపీ నిర్ణయంచింది. సోమవారం విజయవాడలో మహా నిరసన ధర్నా నిర్వహించాలని నిర్ణయంచింది. ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన తొలిసారిగా జరిగిన పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ఈమేరకు నిర్ణయంచారు.

06/11/2018 - 03:32

విశాఖపట్నం: రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్ళ పాలన వలన చంద్రబాబు కుటుంబానికే ప్రయోజనం చేకూరింది తప్ప, ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. మన్యంలో గిరిజనులు మలేరియాతో అల్లాడిపోతున్నారని, పట్టణాల్లో ప్రజలు డెంగి తదితర వ్యాధులతో ఇబ్బందిపడుతున్నారని అన్నారు.

06/11/2018 - 00:17

విజయవాడ, జూన్ 10: రాష్ట్రంలో అమల్లోవున్న 24గంటల విద్యుత్ సరఫరాను అంతర్జాతీయ ప్రమాణాలతో మరింత మెరుగుపర్చడానికి ప్రత్యేక కార్యాచరణ తక్షణం రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇంధన శాఖను ఆదేశించారు. రౌండ్ ది క్లాక్ విద్యుత్ సరఫరా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వెనె్నముక లాంటిదన్నారు.

06/10/2018 - 05:45

ముంబయి: వచ్చేవారం ముంబయిలో పర్యటించనున్న కాంగ్రెస్ బాస్ రాహుల్‌గాంధీ, పార్టీ శ్రేణులకు సాధికారత కల్పించే ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు. పార్టీకి సంబంధించి వివిధ అంశాలపై నేరుగా కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వీలుగా ‘సమాచార’ సంధాన పథకాన్ని ప్రారంభించనున్నారు.

06/10/2018 - 02:54

హైదరాబాద్, జూన్ 9: కొల్లాపూర్ ఛత్రపతి సాహూ మహరాజ్ టెర్మినస్ నుంచి బీదర్ వరకు వారానికి ఒకసారి నడిపే కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 13న ప్రారంభమవుతుందని ద.మ. రైల్వే తెలిపింది. పార్లమెంట్ సభ్యుడు ధనుంజయ్ భీమ్‌రావ్ మహాదిక్ ఈ నెల 13న కొల్లాపూర్‌లో జెండా ఊపి కొత్త రైలు ప్రారంభిస్తారని, తిరుగు ప్రయాణంలో బీదర్ నుంచి పార్లమెంట్ సభ్యుడు భగవంత్ కుబా బీదర్‌లో 14న జెండా ఊపి ప్రారంభిస్తారని పేర్కొంది.

06/10/2018 - 05:00

తిరుపతి, జూన్ 9: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆభరణాలకు సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, తిరుమల ఆలయానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని హంపీ పీఠాధిపతి విద్యారణ్యస్వామి, హిందూ దేవాలయ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు కమలానంద భారతి అన్నారు. అనువంశీక అర్చకులకు పదవీ విరమణ లేదన్నారు.

06/10/2018 - 05:04

కాచిగూడ/ హైదరాబాద్ జూన్ 9: దళిత ఉద్యమంలో కాల్పులు జరిపిన ఆర్‌ఎస్‌ఎస్ బలగాలను కాపాడేందుకే ప్రధాని మోదీ హత్య కుట్రను తెరపెకి తెచ్చారని విరసం నేత వరవరరావు ఆరోపించారు. ఒక పథకం ప్రకారం దీనిని రచించారని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రొ. హరగోపాల్‌తో కలిసి మాట్లాడారు.

06/10/2018 - 02:28

చిత్తూరు, జూన్ 9: కన్నతండ్రే కాలయముడయ్యాడు. క్షణికావేశంతో తీసుకొన్న నిర్ణయం రెండు ప్రాణాలను బలిగొంది. బిడ్డలకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాల్సిన కన్నతండ్రే వారిని కడతేర్చాడు. చిన్నపాటి ఆస్తి వివాదం ఈ దారుణ సంఘటనకు కారణమైంది. ఆస్తి కోసం తల్లితో గొడవపడ్డ కుమారుడు చివరివకు తన ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి చంపి తాను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

06/10/2018 - 05:07

విజయవాడ, జూన్ 9: గడచిన నాలుగేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూస్తుంటే ఏ ఊరు వెళ్లినా అత్యంత సంతృప్తిగా ఉందని, ఇది గొప్ప అనుభవమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.

Pages