S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/22/2018 - 04:08

భద్రాచలం టౌన్, జనవరి 21: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం భక్తరామదాసు 385వ జయంతి సందర్భంగా వాగ్గేయకారోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన సంగీత కళాకారులు ఆలపించిన నవరత్న కీర్తనలు ఆద్యంతం అలరించాయి. ఆలయ ఈవో కె ప్రభాకర శ్రీనివాస్, శ్రీచక్ర సిమెంట్స్ అధినేత నేండ్రగంటి కృష్ణమోహన్ ఈ ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

01/22/2018 - 03:34

కొత్తగూడెం, జనవరి 21: మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు దళ సభ్యులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా తెలిపారు. ఆదివారం ఇక్కడి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుంచి చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి మావోయిస్టులకు అవసరమైన సామగ్రి సరఫరా అవుతోందనే పక్కా సమాచారంతో వాహనాలు తనిఖీ చేశారు.

01/22/2018 - 02:32

తిరుపతి, జనవరి 21: ఈ నెల 24న సూర్య జయంతి సందర్భంగా తిరుమలలోని శ్రీ మలయప్ప స్వామివారు ఉదయం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు సప్తవాహనాలపై దర్శనమిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనం, వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు.

01/22/2018 - 01:56

హైదరాబాద్, జనవరి 21: దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ జైళ్ల శాఖ డిజి వికె సింగ్ ఖైదీలను గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 26న చంచల్‌గూడ జైల్లో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఖైదీలు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. చంచల్‌గూడ, చర్లపల్లి, వరంగల్ ఓపెన్ జైళ్లలో ఉన్న 63 మంది ఖైదీలను పరేడ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.

01/22/2018 - 01:55

తివిరి ఇసుకన తైలం తీయవచ్చు... ఇది నిజంగా నిజం. కరడుగట్టిన ఖైదీల్లో సైతం మార్పునూ తేవచ్చు. నైతికవర్తననూ పాదుకొల్పవచ్చు. జీవితం వ్యర్థం కారాదంటూ ‘ఉన్నత’ విలువలనూ పెంపొందించవచ్చు. ఒకసారి నేరం చేస్తే అది చర్విత చరణంగా జీవితానే్న మార్చేస్తుందన్న నైరాశ్యం నుంచీ బయటపడేవచ్చు. ఇలాంటి ఉన్నత భావాలను ఖైదీల్లో పాదుకొల్పి వారిలో పరివర్తనను తీసుకువచ్చే సమున్నత పథకమే ‘ఉన్నతి’.

01/22/2018 - 01:51

హైదరాబాద్, జనవరి 21: ‘బ్యాలెట్ పేపర్‌తోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి’ అని తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించేందుకే పంచాయతీలకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నదని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

01/22/2018 - 01:49

కె.విజయ శైలేంద్ర

01/22/2018 - 01:45

చిత్రాలు..కడప జిల్లా గండికోట ఉత్సవాల్లో భాగంగా నృత్యం చేస్తున్న
కళాకారిణులు.. *జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను
ప్రారంభిస్తున్న మంత్రి ఆదినారాయణరెడ్డి

01/22/2018 - 02:01

నిమ్మరాజు చలపతిరావు

01/22/2018 - 01:41

శ్రీకాళహస్తి, జనవరి 21: తన స్వార్ధం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా సంకల్పయాత్ర 67వ రోజైన ఆదివారం శ్రీకాళహస్తి పట్టణంలో బహిరంగ సభ జరిగింది. పట్టణంలోని పెళ్లిమండపం వద్ద స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన ఈ వేదికపైకి స్థానిక నాయకులు, ప్రజలు రావడంతో అది కూలిపోయింది.

Pages