S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/31/2018 - 18:06

ఒడిసా: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అప్పారావు హత్యకు జరిగిన కుట్రను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు. మావోయిస్టు నేత హరిభూషణ్ ఆదేశాలతో చందన్ మిశ్రా, పృథ్వీరాజ్ అనే యువకులను భద్రాచలం సరిహద్దుల్లో అదుపులోనికి తీసుకున్నారు. హెచ్‌సీయూలో దళిత స్కాలర్ రోహిత్ వేముల హత్యకు ప్రతీకారంగా ఈ హత్యకు కుట్ర పన్నినట్లు వెల్లడించారు.

03/31/2018 - 16:47

తిరుపతి: తిరుమల గిరిపై నియమనిబంధనలు కట్టుతప్పుతున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడున్న రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద ప్రైవేట్‌ వ్యక్తులు కొందరు హోమం నిర్వహించారు. అయితే ఈ వ్యవహారానికీ తమకు సంబంధం లేదని ఆలయ పూజారి పేర్కొనడం గమనార్హం.

03/31/2018 - 16:45

హైదరాబాద్ : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం వడగళ్ల వాన కురిసింది. హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్, లంగర్‌హౌజ్, మోహిదీపట్నం, గుడిమల్కాపూర్, సిద్ధిపేట పట్టణంలో వడగళ్ల వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.

03/31/2018 - 16:42

హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, వ్యవసాయానికి టెక్నాలజీని జోడించి పంట దిగుబడిని పెంచాలని, వరిని సిరులు కురిపించే పంటగా మార్చాలని, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. రాజేంద్రనగర్‌లోని వరి పరిశోధన సంస్థలో వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.

03/31/2018 - 16:23

విజయవాడ: రాష్టవ్య్రాపితంగా సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యకేసులో కొన్నాళ్లు శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదల అయిన సత్యం బాబు ఈరోజు స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకర్లతో మాట్లాడారు. దళితుడ్ని అయినందునే తనకు ప్రభుత్వం సాయం చేయటం లేదని అన్నారు. కొందరి స్వార్థం కారణంగా ఎలాంటి తప్పు చేయకున్నా జైలుకు వెళ్లాల్సి వచ్చిందని అన్నారు.

03/31/2018 - 16:22

విశాఖపట్నం: విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే పిడుగులు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. చిత్తూరు జిల్లాలో బలమైన గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

03/31/2018 - 16:21

కడప: కడప ఉక్కు కర్మాగారం పూర్తిచేస్తామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఆయన శనివారం నాడు ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ..పోలవరాన్ని రాష్ట్ర నిధులతో పూర్తిచేస్తామని అంటున్నారని, మిగిలిన ప్రాజెక్టులను కూడా అలాగే పూర్తిచేయాలని అన్నారు. ఇంకొంత కాలం టీడీపీతో ఉంటే ఆత్మహత్యే శరణ్యమయ్యేదని అన్నారు. రాయలసీమ పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు.

03/31/2018 - 14:07

పోలవరం: పశ్చిమగోదావరి శివగిరిలో గోదావరిలో స్నానానికి దిగి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. మృతదేహాలను శివగిరి గ్రామస్థులు వెలికితీశారు. మృతులు ఛత్తీస్‌గఢ్ వాసులై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

03/31/2018 - 13:28

కడప: ఒంటిమిట్ట ఘటనపై సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. ఒంటిమిట్టలో శాశ్వత మండపం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నిన్న ఒంటిమిట్ట రాములోరి కల్యాణంలో అపశ్రుతి చోటుచేసుకున్న విషయం విదితమే. నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 52మంది భక్తులకు తీవ్రగాయాలయ్యాయి.

03/31/2018 - 13:23

హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని గౌలిగూడలో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ రామమందిరం నుంచి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు 12 కిలోమీటర్ల వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. భక్తులు పెద్దఎత్తున చేరుకున్నారు. శోభాయాత్ర వచ్చే మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.

Pages